For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుద్ధుడి విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలంటే

బుద్ధుడు శాంతికి చిహ్నం. బుద్ధుని విగ్రహంతో జీవితంలో శ్రేయస్సు, సామరస్యం వస్తుందని నమ్ముతారు. అయితే బుద్ధుని విగ్రహం ద్వారా ప్రయోజనం చేకూరాలంటే వాస్తు శాస్త్రాన్ని పాటించాలి. వాస్తు ప్రకారం ఇంట్లో బుద్ధుని విగ్రహం ఎక్కడ

|

చాలా మంది ఇళ్లళ్లో బుద్ధుడి విగ్రహాన్ని చూసే ఉంటారు. చూడచక్కని బుద్ధ విగ్రహం అలంకరణగా మాత్రమే కాకుండా ఇంటికి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఇస్తుంది. కొంతమంది ఇంటి అలంకరణలో భాగంగా బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. అయితే బుద్ధ విగ్రహాన్ని అలా ఇష్టమున్న చోట పెట్టకూడదని చెబుతోంది వాస్తు శాస్త్రం.

Vastu tips for placing buddha idol at home in Telugu

బుద్ధుడు శాంతికి చిహ్నం. బుద్ధుని విగ్రహంతో జీవితంలో శ్రేయస్సు, సామరస్యం వస్తుందని నమ్ముతారు. అయితే బుద్ధుని విగ్రహం ద్వారా ప్రయోజనం చేకూరాలంటే వాస్తు శాస్త్రాన్ని పాటించాలి. వాస్తు ప్రకారం ఇంట్లో బుద్ధుని విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఎటువైపు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ఎందుకు ప్రదర్శిస్తారో తెలుసా?Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ఎందుకు ప్రదర్శిస్తారో తెలుసా?

Vastu tips for placing buddha idol at home in Telugu

బుద్ధుని విగ్రహాన్ని ఎక్కడెక్కడ ఉంచవచ్చు:

  • బుద్ధుని విగ్రహాన్ని స్టడీ రూములో ఉంచుకోవచ్చు. దీని వల్ల చదువుపై శ్రద్ధ ఉంటుంది. దృష్టి మరల్చుకోకుండా ఉంటుంది.
  • ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి పని చేసే డెస్క్ వద్ద బుద్ధుని విగ్రహం పెట్టుకోవచ్చు.
  • యోగాభ్యాసం చేసేటప్పుడు బుద్ధుని విగ్రహం సానుకూల శక్తిని ఇస్తుంది.
  • బుద్ధుని విగ్రహాన్ని కారులో కూడా పెట్టుకోవచ్చు. అయితే కారు ముందు భాగంలో ఉంచుకోవడం శ్రేయస్కరం.
  • బుద్ధుని విగ్రహాన్ని తోటలో పెడితే ఐశ్వర్యం చేకూరుతుంది. ఇది ఇంట్లోని ప్రతికీల శక్తిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
  • ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి బుద్ధుని బొమ్మను ప్రధాన ద్వారా ఎదురుగా ఉంచవచ్చు.
  • బుద్ధుని విగ్రహానిక బదులు బుద్ధ కాన్వాస్ ఆర్ట్ పెయింటింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది జీవితంలో సానుకూల శక్తిని తీసుకువస్తుంది.

మీ లైఫ్‌ పార్ట్‌నర్‌ గురించి ఈ విషయాలు తెలుసా? లేదంటే వెంటనే తెలుసుకోండి

Vastu tips for placing buddha idol at home in Telugu

బుద్ధుని విగ్రహాన్ని ఈ చోట్ల ఉంచకూడదు:

  • బుద్ధుని విగ్రహాన్ని నేలపై ఉంచకూడదు.
  • బుద్ధ విగ్రహాన్ని, పెయింటింగ్ ను షూ రాక్ కింద లేదా మీద పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది.
  • బుద్ధుని విగ్రహాన్ని పెట్టేటప్పుడు కింద ఎర్రటి కాగితం లేదా వస్త్రాన్ని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల దురదృష్టం దూరమవుతుంది, అదృష్టం తలుపు తడుతుంది.
  • బుద్ధుని విగ్రహాన్ని లాకర్ లో ఉంచకూడదు. దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.
  • బుద్ధుని విగ్రహాన్ని ఏదైనా షెల్ఫ్ లో ఉంచవచ్చు.
  • బుద్ధుని విగ్రహాన్ని ప్రధాన ద్వారాని అభిముఖంగా ఉంచాలి. వ్యతిరేక దిశలో ఉంచకూడదు.
  • బుద్ధుని విగ్రహాన్ని బాత్రూములో ఉంచకూడదు.
  • బుద్ధ విగ్రహాన్ని స్టోర్ రూములో, వాష్ రూములో ఉంచకూడదు.
  • బుద్ధ విగ్రహాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దుమ్ము ధూళి లాంటి పేరుకుపోకుండా చూసుకోవాలి. గుడ్డతో దుమ్ము ధూళి తొలగించి తడి గుడ్డతో తుడుచుకోవాలి. బుద్ధ విగ్రహంపై దుమ్ము ధూళి పేరుకుపోతే అది ఇంటికి ఏమాత్రం మంచిది కాదు. ఇంటి కుటుంబసభ్యుల మధ్య కలహాలు వచ్చే ప్రమాదం ఉంది.
  • బుద్ధ విగ్రహాన్ని ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి.
  • విరిగిన, నొక్కులు పోయిన బుద్ధ విగ్రహాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉంచకూడదు. దీని వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో తప్పక చూడాల్సిన 5 బౌద్ధ వారసత్వ ప్రదేశాలు

English summary

Vastu tips for placing buddha idol at home in Telugu

read this to know Vastu tips for placing buddha idol at home in Telugu
Story first published:Friday, January 20, 2023, 10:55 [IST]
Desktop Bottom Promotion