For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భనిరోధక మాత్రలతో ఉపయోగాలు.. సైడ్ ఎఫెక్ట్స్..

|

తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యామిలి ప్లానింగ్‌ తప్పనిసరి. మొదటి ప్రసవానికి రెండవ ప్రసవానికి కనీసం రెండు సంవత్సరాల గ్యాప్‌ ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా గర్భనిరోధానికి ఇవి ఎంతో ఉపయోగ కరంగా ఉంటాయి. గర్భనిరోధానికి రెండు రకాల పద్ధతులున్నాయి. ఇవి పర్మనెంట్‌, టెంపరరీ పద్ధతులుగా చెప్పుకోవచ్చు. టెంపరరీ పద్ధతిలో గర్భనిరోధక మాత్రలతో పాటు కండోమ్స్‌ వాడకం, ఇంట్రాయిన్‌ లూప్‌ కాంట్రసెప్ట్‌ డివైజ్‌లను ఉపయోగిస్తారు. వీటితో పాటు హార్మోన్‌ ఇంజెక్షన్లను కూడా వాడతారు. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్ట్రోన్‌ హార్మోన్‌ మాత్రలనే గర్భనిరోధక మాత్రలుగా పేర్కొంటారు. ఇవి మహిళల్లో అండం తయారుకాకుండా నిరోధిస్తాయి. దీంతో వారిలో ప్రెగ్నెన్సీ రాదు. ప్రస్తుతం తక్కువ మోతాదులోని గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తక్కువగా ఉంటాయి.

ఎవరు తీసుకోవాలి: గర్భనిరోధక మాత్రలను 18 నుంచి 40 సంవత్సరాలున్న మహిళలందరూ తీసుకోవచ్చు. వీటిని మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాడడం మంచిది. అంతకుమించి వాడాలనుకుంటే డాక్టర్ల సలహాను తీసుకోవాలి. గర్భనిరోధక మాత్రలను ఉపయోగించే ముందు డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి. వారు సూచించిన మేరకు తమకు అనువైన మాత్రలను వేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.

ప్రసవం తర్వాత శిశువుకు పాలిస్తున్న తల్లి ఆరు నెలల తర్వాత గర్భనిరోధక మాత్రలను వాడడం శ్రేయస్కరం. పాలివ్వని తల్లి మూడు నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్రలతో తల్లిలో పాలు తగ్గే అవకాశం ఉంది. గర్భనిరోధ మాత్రలను వాడుతున్న ప్పుడు మధ్యమధ్యలో డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. డాక్టర్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌, యుటిరస్‌ టెస్ట్‌, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పరీక్ష నిర్వహిస్తారు.

Benefits of Contraceptive Pills and Side Effects...

ఉపయోగాలు: గర్భనిరోధక మాత్రల వల్ల ఇష్టంలేనప్పుడు గర్భం ధరించకుండా ఉండవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు ఎంతో దోహదపడతాయి ఈ మాత్రలు. ప్రెగ్నెన్నీ ప్లానింగ్‌తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు. కొంతమంది స్త్రీలలో పీరియడ్స్‌లో బ్లీడింగ్‌ ఎక్కువగా వస్తుంటుంది. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఈ బ్లీ డింగ్‌ తగ్గుతుంది. బహిష్టు సమయంలో కొందరు కడుపునొప్పితో బాధపడుతుంటారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వినియోగంతో గర్భాశయం ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. హెక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. రుమాయిటెడ్‌, ఆర్థరైటిస్‌ ఉన్న వాళ్లకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటాయి. ఓవరీస్‌లో సిస్ట్‌లు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తాయి. బ్లీడింగ్‌ ఎక్కువ ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది.

సైడ్‌ ఎఫెక్ట్స్: గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు, గ్యాస్‌ ప్రాబ్లమ్‌తో వారు ఇబ్బం ది పడుతుంటారు. పొట్ట ఉబ్బి నట్టు కూడా వారికి అనిపి స్తుంది. కొందరికి నెలమధ్యలో బ్లీడింగ్‌ అవుతుంది. కొందరికి వెజెనల్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. లివర్‌ సమస్య కూడా రావచ్చు. టిబి ఉన్న వారు వీటిని వేసు కుంటే ఇబ్బందులు ఎదురవు తాయి. కొంత మందికి తలనొ ప్పి రావచ్చు. బరువు పెరుగుతా రు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టు కుపోతుంది. ఇటువంటి సమ స్యలు ఎదురై నప్పుడే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

English summary

Benefits of Contraceptive Pills and Side Effects... | గర్భనిరోధక మాత్రలతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్..

Emergency contraceptive pills are birth control measures to avoid an unwanted pregnancy. If you have unprotected lovemaking sessions, then the chances of getting pregnant is very high. If something like this happens,. Women take emergency contraceptive pills. These pills are easily available in the pharmaceutical stores. To avoid pregnancy, these contraceptive pills should be taken within 72 hours of making love.
Desktop Bottom Promotion