For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ది బెస్ట్ ‘విటమిన్ డి ఫుడ్స్’

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ది బెస్ట్ ‘విటమిన్ డి ఫుడ్స్’

|

సాధారణంగా విటమిన్స్ వల్ల మన ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే.. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ లోపించటం.. ఊబకాయం.. ధూమపానం.. వీటిన్నింటి మూలంగా నానాటికీ మన శరీరంలో విటమిన్‌-డి అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా.. ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి తగలకుండా.. నెలలు, సంవత్సరాలూ నీడ పట్టునే గడపటం పెరిగిపోతోంది. దాంతో.. ఎంతోమందిలో ఎంతో కొంత విటమిన్‌-డి లోపం కనబడుతోంది. మన శరీరంలో, మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్‌-డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఇది అస్సలు మంచి పరిణామం కాదు.

సాధారణంగా విటమిన్లను మన శరీరం తయారు చేసుకోలేదు. వాటిని ఆహారం రూపంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క విటమిన్‌-డి మాత్రం మన శరీరంలోనే తయారవుతుంది. సూర్యరశ్మి సహాయంతో దీన్ని చాలావరకూ మన శరీరమే తయారు చేసుకుంటుంది, చాలా కొద్ది భాగం మాత్రమే ఆహారం ద్వారా లభిస్తుంది. అంతా విటమిన్‌-డి అన్నది ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికే కీలకమైనదని భావిస్తుంటారు. అది వాస్తవమేగానీ.. దీనితో అనేకానేక ఇతరత్రా ప్రయోజనాలూ చాలా ఉన్నాయని పరిశోధనా రంగం గుర్తించింది.

గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోవటం తప్పనిసరి. దీంతో విటమిన్లు, ఇతర పోషకాల లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇది వారికే కాదు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. గర్భిణుల్లో విటమిన్ల లోపం.. ముఖ్యంగా విటమిన్‌ డి లోపం కారణంగా వారి పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతినే ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. మూణ్నెల్లు దాటిన తర్వాత గర్భస్థ శిశువు మెదడులో భాషను నేర్చుకోవటంలో తోడ్పడే భాగం రూపుదిద్దుకోవటం ఆరంభిస్తుంది. అలాగే భావోద్వేగ, ప్రవర్తన వంటివాటి అభివృద్ధిలో పాలు పంచుకునే నిర్మాణాలు, మార్గాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో విటమిన్‌ డి లోపం గనక ఏర్పడితే వారి పిల్లలు భాషను నేర్చుకోవటంలో మిగతావారికన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

కోడ్ లివర్ ఆయిల్: కోడ్ లివర్ ఆయిల్ వాసన మరియు రుచి అంత బాగుండవు. అయితే ఇందులో విటమిన్ డి అధిక శాతంలో ఉంటుంది. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఒక చెంచా కోడ్ ఆయిల్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత విటమిన్ డి లభ్యం అవుతుంది.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

సోయా ప్రొడక్ట్స్: సోయా ప్రొడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

మష్రుమ్(పుట్టగొడుగులు): మష్రుమ్(పుట్టగొడుగు)ల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 ను కూడా అందిస్తుంది. తెల్లని పుట్టగొడుగులను మహిళలు తినడం వల్ల ఫెర్టిలిటి విలువలను పెంచుతుంది.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

ఓస్ట్రెస్: సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఫెర్టిలిటి స్థాయి పెరుగుతుంది. అంతే కాదు వీటిలో జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మరియు కాపర్ అధిక శాతంలో ఉంటుంది.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

చేపలు: సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభ్యం అవుతాయి.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

హెరింగ్(సముద్ర చేప): ఈ సముద్ర చేపలో విటమిన్ డి అత్యధిక శాతంలో ఉంటుంది మరియు శరీరానికి కావల్సినంత క్యాల్షియం కూడా పుష్కలంగా ఇందులో లభిస్తుంది.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

సార్డినెస్: ప్రతి రోజూ శరీరానికి కావల్సిన 33 శాతం క్యాల్షియం ఈ సార్డినెస్ చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఈ సార్డినెస్ చేసల్లో అధికశాతంలో విటమిన్ డి మాత్రమే కాదు అధిక శాతంలో ప్రోటీనులు కూడా లభ్యం అవుతాయి.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

సలామీ: సలామీ, హామ్, సాసేజులు వంటివి మాంసాహారులు ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి బాగా మెరుగుపడుతుంది. అయితే మాంసాహారాలు తీసుకొనేటప్పుడు తాజావి మాత్రమే ఆరోగ్యానికి మంచిది. ప్యాక్ చేసినవాటికి దూరంగా ఉండండి.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

గుడ్లు: అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి మరియు విటమిన్ బి12 మరియు ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

సూర్య రశ్మి(సన్ లైట్): సన్ లైట్ ఆహారం కాదు. అయితే సూర్యరశ్మి శరీరం మీద పడటం వల్ల శరీరంలో విటమిన్ డి తనంతట తాను ఉత్పత్తి చేసుకోగలిగే గుణం కలదు. సంతోనోత్పతి పెంచడంలో సూర్యరశ్మి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో చేర్చబడినది.

అంతే కాదు ఎంతో మంది సంతానలేమితో బాధపడేవారు ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్న ఫలించనప్పుడు ఈ విటమిన్లతో కూడిన ప్రోటిన్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వెలువడుతాయి. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత విటమిన్స్ అందుతుంది. దాంతో మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది. ఫెర్టిలిటి విలువను పెంచుతుంది. దాంతో అతి త్వరగా, సులభంగా గర్భం దాల్చడానికి సులభం అవుతుంది. కాబట్టి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తిని సంతానలేమితో బాధపడే మహిళలు ఫెర్టిలిటీ స్థాయిని పెంచుకోవచ్చు.

పాలు, గుడ్లు, చీజ్‌, సాల్మన్‌ చేపల నుంచి విటమిన్‌ డి లభిస్తుంది. రోజులో కొంతసేపు ఎండలో నిలబడినా మన చర్మం దీన్ని తయారుచేసుకుంటుంది. అందువల్ల గర్భిణులు సమతులాహారం తీసుకుంటూ, కాసేపు ఎండలో నిలబడటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి స్త్రీలకు ఇంత అద్భుతంగా ఉపయోగపడే విటమిన్ డి ఆహారాలేంటో చూద్దాం...

English summary

Vitamin D Foods To Boost Women's Fertility | మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

Vitamin D is essential to build and maintain strong bones and healthy teeth. In the same way, it also plays an important role during pregnancy. It enables the body to absorb and hold onto that calcium and other minerals, which the baby needs. Therefore, it is important to include foods to meet the daily requirement of vitamin D in pregnant women.
Desktop Bottom Promotion