డెలివరి తర్వాత నడుంనొప్పి తగ్గించే 10 సింపుల్ పద్ధతులు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

గర్భవతిగా ఉన్నప్పుడు, తర్వాత కూడా మీ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. మీరు మళ్ళీ మామూలు అవ్వటానికి మీ శరీరంలో అవసరమైనవన్నీ ఉన్నా,మీ బేబీ పుట్టాక చిన్న చిన్న సమస్యలు మీ ఒంట్లో కలుగుతూనే ఉంటాయి.

పిల్లలు పుట్టాక నడుంనొప్పి, ముఖ్యంగా నడుం కింద భాగంలో నొప్పి సాధారణంగా వచ్చే సమస్య. ఇలా జరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.

10 Simple Ways To Relieve Back Pain Post Delivery

డెలివరీ అయ్యాక వచ్చే నడుంనొప్పి తీవ్రత మనిషికి మనిషికీ మారుతూ ఉంటుంది, అది తక్కువ నుంచి తీవ్రనొప్పి వరకు మధ్యలో ఎక్కడైనా ఉండవచ్చు. తక్కువ నుంచి మామూలు నడుంనొప్పికి చేయాల్సింది దానంతట అదే తగ్గే వరకు వేచి ఉండటం. మీ శరీరానికి దానంతట అదే తనకెంత సమయం కావాలో అంత తీసుకోనిచ్చి తగ్గనివ్వండి. అంత శారీరక శ్రమ తర్వాత మీరు హాయిగా, ఆరోగ్యంగా మారటానికి కొంచమైనా సమయం పడుతుంది కదా!

మీరు డెలివరీ తర్వాత వచ్చే నడుంనొప్పిని నియంత్రించడానికి ఈ కింది చిట్కాలు పాటించవచ్చు మరియు ప్రయత్నించవచ్చు ;

1.మీ బరువును నియంత్రణలో ఉంచుకోండి. స్థూలకాయం డెలివరీ ముందు, తర్వాత కూడా నడుంనొప్పి కలుగచేయటంలో పెద్ద పాత్రను పోషిస్తుంది.

10 Simple Ways To Relieve Back Pain Post Delivery

2.కడుపుతో ఉన్నప్పుడు తర్వాత కూడా వ్యాయామం చేయటం మానవద్దు. కొంచెమైనా శారీరక శ్రమ మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి పట్టేసిన కండరాలు మరియు ఎముకలను వదులుచేసి, వాటి కదలికను పెంచుతుంది.

3.బిడ్డపుట్టాక సరిగా బెడ్ రెస్ట్ తీసుకోండి. కుటుంబంలో ఎవరైనా లేదా ప్రొఫెషనల్ ఏజెన్సీ నుంచి ఎవరినైనా మీ పనులు చేయటానికి సహాయంగా ఉంచుకోండి. అది చాలా మంచిది.

4.కడుపుతో ఉన్నప్పుడు, తర్వాత కూడా భారీ వస్తువులను మోయకండి లేదా ఎత్తకండి. మీ శరీరానికి మామూలవ్వటానికి సమయం ఇవ్వండి.

10 Simple Ways To Relieve Back Pain Post Delivery

5.కూర్చునేటప్పుడు నిటారుగా సరిగ్గా కూర్చోండి. ముఖ్యంగా ఇది బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు ముందుకి వంగే తల్లులకి అవసరం. మీరు వంగటం కన్నా మీ బిడ్డను మీకు దగ్గరగా తెచ్చుకుని, పాలిచ్చేటప్పుడు నిటారుగా, వీపును వంగనీయకుండా కూర్చొండి.

6.సౌకర్యంగా ఉండే చెప్పులను ధరించండి. డెలివరీ అయిన కొన్ని నెలల వరకు హీల్స్ కి దూరంగా ఉండి ఫ్లాట్ గా ఉండే చెప్పులను వేసుకోండి.

7.మీ పాపాయిని లేదా కొన్ని నెలల బిడ్డను ఒకవైపే ఎత్తుకోవడం మానేయండి. ప్రయాణంలో ఉన్నప్పుడు ముందుకి బేబీని కట్టుకునే వీలున్న ఫ్రంట్ పాక్ ను వాడండి.

10 Simple Ways To Relieve Back Pain Post Delivery

8.బేబీని ఎత్తుకోడానికి మీ చేతులను చాచవద్దు. దానిబదులు మీరే వారి దగ్గర వరకు వెళ్ళి మెల్లగా ఎత్తుకోండి.

9.ఎప్పుడూ సౌకర్యంగా ఉన్న స్థితిలోనే పడుకోండి. దిండ్లను సపోర్టుగా పెట్టుకోండి.

10.వెన్ను మరియు కింద శరీరానికి విశ్రాంతి మరియు స్వస్థత చేకూర్చే యోగా మరియు ఇతర రిలాక్సేషన్ వ్యాయామాలు చేయండి.

English summary

10 Simple Tips To Relieve Back Pain Post Delivery

The severity and intensity of post delivery back pain differs from person to person, and may range from mild to severe. One of the best ways to deal with mild to moderate back pain is to wait till things get better. Allow your body to heal itself at its own pace after all the physical stress, and very soon, you’ll be fit and fine.