For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని దుర్వాసనలు... వదిలించడమెలా?

By B N Sharma
|
Getting Rid Of Vaginal Odour!
చాలామంది మహిళలు వారి జననాంగాలలో దుర్వాసనలతో బాధపడుతూంటారు. ఈ వాసనలను యోని దుర్వాసనలంటారు. మూత్రం కంపు లేదా చేపల కంపుగా వుంటుంది. సాధారణంగా ఇది గర్భవతి దశలో అధికంగా వుంటుంది. కారణం. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చి వారికి యోని అందుబాటులో లేకుండుట. కనుక ఈ జననాంగాలలో చెడు వాసనలు వదిలించేందుకు కొన్ని చిట్కాలు పరిశీలించండి.

1. క్రీములు వాడకం - యోని సంబంధిత సమస్యలు తేలికగా తీసుకుంటే అవి ముదిరి మరింత పెద్ద సమస్యలవుతాయి. వాసన, మంట, ఎరుపెక్కటం వంటివి ఇన్ఫెక్షన్ వలన కావచ్చు. డాక్టర్ సలహాలతో క్రీములవంటివి రాస్తే తగ్గిపోతాయి.
2. యాంటీ బయోటిక్స్ - యాంటీ బయోటిక్స్ వాడకం ఇన్ ఫెక్షన్ తగ్గిస్తుంది. బాగా శుభ్రం చేయించటం లేదా సుగంధాలు వాడటం చెడు వాసన అరికడతాయి.
3. నీటితో శుభ్రపరచటం - యోని దుర్వాసన అంటే శుభ్రం తక్కువనే చెప్పాలి. పరిశుభ్రమైన కాటన్ గుడ్డలు వాడటం, ఆ భాగాన్ని నులివెచ్చని నీటితో శుభ్రం చేసి రసాయన రహిత సోపులు వాడితో దుర్గంధం పోతుంది. మూత్రం చేసినపుడు శుభ్రంగా ఆ భాగాన్ని కడగటం, పేపర్ టవల్ తో పొడి చేయటం వంటివి వాసన అరికడతాయి.
4. మందుల వాడకం - గనోరియా వంటి వ్యాధులున్నట్లయితే అవి పుట్టే బిడ్డకు, జీవిత భాగస్వామికి కూడా వ్యాపిస్తాయి. కనుక వీటినివారణకై మందులు వాడాలి.
5. ఆహారం - ఆహారంలో, పెరుగు, మజ్జిగ, లేదా అధికంగా నీరు తాగటం వంటివి ఆభాగాల్లో చెడు బాక్టీరియాను తొలగించి మంచి బాక్టీరియా ఏర్పడేలా కూడా చేస్తాయి.

లోపలి దుస్తులను వేడినీటిలో నానపెట్టి డిటర్జెంట్ లతో వుతికి వాడండి. శానిటరీ ప్యాడ్లను విరివిగా వాడితే అవి తేమ లేకుండా ఎప్పటికపుడు పీల్చి వేసి వాసన లేకుండా చేస్తాయి.

English summary

Getting Rid Of Vaginal Odour! | యోని దుర్వాసనలు... వదిలించడమెలా?

Poor hygiene is the most common reason for the vaginal odour. Wearing washed and sun dried cotton fabric that is comfortably fit and washing the area with warm water and chemical free (mild) soap will reasonably (at least for a few hours) control the odour. Washing genitals well everytime you urinate and patting the region dry with paper towels (toilet paper) will prevent the smell.
Story first published:Tuesday, November 8, 2011, 10:50 [IST]
Desktop Bottom Promotion