For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ అవొకాడో తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు

By Super Admin
|

మహిళ జీవితంలో గర్భధారణ చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో ఆమె తీసుకునే మీల్స్ చాలా సమతుల్యంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. తల్లి తినేటటువంటి న్యూట్రీషియన్ ఫుడ్స్ బేబీకి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. తల్లి తీసుకునే ఆహారం మీద బిడ్డ యొక్క ఆరోగ్యం, పెరుగుదల ఆధారపడుంటుంది.

అటువంటి హెల్తీ ఫుడ్స్ లో అవొకాడో ఒకటి. ఇది చాలా లక్జ్సరీ అండ్ రిచ్ ఫ్రూట్ ''అవొకాడోను బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు . భూమ్మీద ఇది చాలా విలువైన పండు,. ఎందుకంటే ఇందులో మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్, విటమిన్స్ , ఇతర అనేక ప్రయోజనాలున్నాయి.

అందువల్లే గర్భధారణ సమయంలో మరియ ప్రోస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తీసుకోమని సలహాలిస్తుంటారు.

అవొకాడో రెగ్యులర్ డైట్ ల చేర్చుకోవడం వల్ల గర్భణీలకు డైలీ అవసరమయ్యే క్యాలరీలను పొందుతారు. గర్భధారణ సమయంలో అవొకాడో తినడం వల్ల మార్నింగ్ సిక్నెస్ ను నివారించుకోచ్చు. గర్భిణీ స్త్రీలు అవొకాడో తినడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారు . మరి అవేంటో తెలుసుకుందాం...

1. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది:

1. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది:

ఇది డిప్రెషన్, నీరసం, అనీమియ, నిద్రలేమి, మూడ్ స్విగ్స్, ప్రీక్లాప్సియా వంటివి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఈ బట్టర్ ఫ్రూట్ ను తినడం మంచిది . అరకప్పు అవొకాడో లో 59గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది .కాబట్టి దీన్ని రెగ్యలర్ డైట్ లో చేర్చుకుంటే తల్లి, బిడ్డకు క్షేమం.

2. క్యాల్షియం ఎక్కువ:

2. క్యాల్షియం ఎక్కువ:

అవొకాడోలో క్యాల్షియం ఎక్కువ. గర్భధారణ సమయంలో శరీరంలో క్యాల్షియం తగ్గిపోతుంది కాబట్టి, అవొకాడో తీసుకోవడం వల్ల తిరిగి భర్తీ అవుతుంది. అందుకే క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.

3. విటమిన్స్ ఫుల్ గా ఉన్నాయి:

3. విటమిన్స్ ఫుల్ గా ఉన్నాయి:

అవొకాడోలో విటమిన్ సి, ఇ, ర, బి1, బి2 మరియు బి6లు అధికంగా ఉన్నాయి. ఈవిటమిన్స్ గర్భిణీ స్త్రీలకు చాలా అత్యవసరమైనవి . తల్లికి మాత్రమే కాదు, పెరిగే బిడ్డకు కూడా చాలా అవసరమైనవి. అలాగే గర్భిణీలో వికారం, వాంతును తగ్గిస్తుంది .

4. అనీమియా తగ్గిస్తుంది:

4. అనీమియా తగ్గిస్తుంది:

ఐరన్ లోపం వల్ల అనీమియా సమస్య. కొన్ని బట్టర్ ఫ్రూట్ ముక్కలు రోజూ తినడం వల్ల రక్తహీనత ప్రమాదం నుండి బయటపడవచ్చు. అవొకాడోలో ఐరన్ ఎక్కువగా ఉండుట వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుంది. దాంతో అనీమియా సమస్య ఉండదు.

5. జీర్ణశక్తిని పెంచుతుంది:

5. జీర్ణశక్తిని పెంచుతుంది:

గర్భధారణ సమయంలో పొట్ట సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా, మలబద్దకం, తొమ్మిది నెలల వరకూ ఈ సమస్య వేధిస్తుంది, అవొకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. జీర్ణక్రియమెరుగ్గా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. అందువల్ల బట్టర్ ఫ్రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. బౌల్ మూమెంట్ సాఫీగా ఉంటుంది.

6. మంచి ఫ్యాట్ ఉంటుంది:

6. మంచి ఫ్యాట్ ఉంటుంది:

గర్భధారణ సమయంలో బరువు పెరగాలని కోరుకునే వారు, అవొకాడోను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జంక్స్ ఫుడ్స్ శరీరంలో ఫ్యాట్ చేరడానికి కారణమవుతుంది. దాంతో బర్నింగ్ సెన్షేషన్ ఉంటుంది. బటర్ ఫ్రూట్ లో క్యాలరీలు మరియు మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. గర్భిణీలకు అవసరమయ్యే ఎ3.5ఔన్సుల మంచి ఫ్యాట్ ను అందిస్తుంది. ఇవి బేబీలో సెల్ స్ట్రక్చర్ ఏర్పడుటకు సహాయపడుతుంది .

7. న్యూట్రీషియన్స్ ఎక్కువగా గ్రహిస్తుంది:

7. న్యూట్రీషియన్స్ ఎక్కువగా గ్రహిస్తుంది:

అవొకాడో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది న్యూట్రీషియన్స్ అందివ్వడం మాత్రమే కాదు, న్యూట్రీషియన్స్ శరీరంలో షోషింపబడేలా చేస్తుంది. అంతే కాదు, శరీరంలోనికి కెరోటినాయిడ్ బాడీలోకి గ్రహించడాన్ని కూడా మెరుగుపరుస్తుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో తేలింది.

8. మినిరల్స్ ఎక్కువ:

8. మినిరల్స్ ఎక్కువ:

అవొకాడోలో, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మరియు నియాసిన్ లు ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీలకు ఇవన్నీ చాలా ముఖ్కమైనవి, అవసరమైనవి..

9. బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్:

9. బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్:

ఒక కప్పు అవొకాడో ఫ్రూట్స్ తినడం వల్ల 22గ్రాముల కోలిన్ అందుతుంది. ఇది బేబీలో బ్రెయిన్ డెవలప్ మెంట్ కు , ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థకు సహాయపడుతుంది,

10. లెగ్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

10. లెగ్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

గర్భదారణ సమయంలో లెగ్ క్రాంప్ చాలా సాదారణ సమస్య. ఇది తరచూ బాధిస్తుంటే, అవొకాడో తినడం వల్ల లెగ్ క్రాంప్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.ఇందులో ఉండే పొటాషియం అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

11. కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

11. కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

అవొకాడోను రెగ్యులర్ గా తినడం వల్ల ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది,

English summary

11 Reasons to Eat More Avocados During Pregnancy

Since you are advised to add on few more calories during pregnancy and breastfeeding, you can meet the daily calorie requirements by adding avocado to your daily diet. Consuming avocados during pregnancy also offer you the much needed relief when you are suffering from morning sickness.
Story first published:Monday, August 29, 2016, 14:08 [IST]
Desktop Bottom Promotion