For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో జామ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

By Super Admin
|

జామలో అనేక రకాలు ఉన్నప్పటికీ, రుచికరమైన పానీయం కోసం సాధారణ జామ రకాన్ని ఎంపిక చేస్తారు. జామ చర్మ సంరక్షణ మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

జామ పండు అంటే ఏమిటి?

మిర్టేసి కుటుంబానికి చెందిన జామ పండు ఉష్ణమండల పొదలు మరియు చిన్న చెట్లతో 100 రకాల జాతులను కలిగి ఉంది. ఇది మెక్సికో,మధ్య అమెరికా మరియు దక్షిణ,ఉత్తర అమెరికా స్థానికతను కలిగి ఉంది. ఇప్పుడు జామ పండ్లను ఆఫ్రికా,దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా,కరేబియన్ వంటి ఉష్ణమండల మరియు ఉత్తర అమెరికా, హవాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్పెయిన్ వంటి ఉప ఉష్ణమండల ప్రాంతాలలో సహజసిద్ధంగా సాగు చేస్తున్నారు.

జామ పండు అండాకారంలో ఉండి పసుపు రంగులో ఉంటుంది. జామ పండు లోపలి గుజ్జు తెలుపు మరియు ఎరుపు రంగు,మృదువైన ఉపరితలం,తీపి రుచి మరియు మధ్యలో చిన్న విత్తనాలతో ఉంటుంది.

గర్భధారణ సమయంలో జామ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

జామ పండు గుజ్జు కంటే జామ పండు తొక్కలో విటమిన్ సి కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. అలాగే జామ పండు తొక్క జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. అంతేకాక మలబద్ధక సమస్యను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

జామ పండును అధిక ఆక్సీకరణ కంటెంట్ ఉన్న పండు అని అంటారు. అదనంగా జామలో విటమిన్లు B3 మరియు B6 సమృద్ధిగా ఉండుట వలన మేధస్సును ఉత్తేజపరిచటం మరియు చిత్తవైకల్యంను నిరోధించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

కొలెస్ట్రాల్,అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు ఉన్న రోగులలో జామ పండును సహజ ఔషధంగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే దీనిలో ఉండే పొటాషియం శక్తివంతమైన బైండింగ్ కొవ్వును శక్తిగా మార్చుతుంది. జామ పండులో పోలిఫెనోల్స్ అధికంగా ఉండుట వలన వృద్ధాప్య లక్షణాలను తగ్గించటమే కాక శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని బయటకు పంపుతుంది.

జామలో మంచి వాసన, రుచే కాకుండా ఇనుము,కాల్షియం,థియామిన్,పొటాషియం, మెగ్నీషియం,ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

ఇక్కడ గర్భధారణ సమయంలో జామ ఆరోగ్య ప్రయోజనాలు మరియు చర్మ ప్రయోజనాలు ఉన్నాయి.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

జామలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.

రక్తపోటు

రక్తపోటు

గర్భధారణ సమయంలో మహిళలకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజు ఒక జామ పండు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. గర్భధారణ సమయంలో జామ యొక్క ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలలో ఇది ఒకటి.

శిశువు నాడీ వ్యవస్థ

శిశువు నాడీ వ్యవస్థ

జామలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన శిశువు యొక్క మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి బాగా సహాయపడుతుంది.

ప్రశాంతత

ప్రశాంతత

ప్రతి రోజు ఒక జామ పండును తినటం అలవాటుగా చేసుకుంటే,గర్భిణీ స్త్రీల యొక్క నరములు ప్రశాంతంగా ఉండటమే కాక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మలబద్ధకం

మలబద్ధకం

జామలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకంను తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్

గర్భధారణ సమయంలో ఈ సమస్య రావటం అనేది సాధారణమే. గర్భధారణ సమయంలో ప్రతి రోజు ఒక జామ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు మధుమేహంను నిరోధించడానికి సహాయపడుతుంది.

కంటిచూపును మెరుగుపరుస్తుంది

కంటిచూపును మెరుగుపరుస్తుంది

జామలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండుట వలన అంధత్వాన్ని నిరోధించడానికి మరియు పిండం యొక్క కంటి పనితీరును మెరుగుపరిచటానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గర్భిణీ స్త్రీలలో క్యాన్సర్ ని నిరోధించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు జామలో సమృద్ధిగా ఉంటాయి. జామలో ఉండే లైకోపీన్ మరియు విటమిన్ సి శరీరం నుండి విషాన్ని తొలగించటానికి సహాయపడతాయి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

ప్రారంభ గర్భధారణ సమయంలో జామపండును తినటం అలవాటుగా చేసుకుంటే గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ ను తగ్గించవచ్చు.

English summary

9 Health Benefits of Guava During Pregnancy

Guava fruit is known as the fruit with a high antioxidant content. In addition, the guava is also rich in vitamins B3 and B6 are excellent for stimulating intelligence and prevent dementia.For patients with diseases of cholesterol, high blood pressure and coronary heart disease, guava fruit can be used as a natural remedy because it implies that proved high in potassium and potent binding fat to be converted into energy.
Story first published:Tuesday, August 9, 2016, 12:00 [IST]
Desktop Bottom Promotion