For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు దానిమ్మ, దానిమ్మ జ్యూస్ అందించే అద్భుత ప్రయోజనాలు..

By Super Admin
|

మహిళ గర్భం పొందిన తర్వాత ఎక్కువ న్యూట్రీషియన్స్ అవసరమవుతుంది. గర్భిణీలు ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో ఫ్రెష్ గా ఉండే హెల్తీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ను తినమని సూచిస్తుంటారు. పండ్లలో దాదాపు అన్నీ తినమని చెబుతుంటారు. దానిమ్మ , మరియు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం గర్భిణీలకు సురక్షితమా ? కాదా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.

దానిమ్మగింజలు మరియు దానిమ్మ జ్యూస్ ను తీసుకోమని గైనిక్స్ సూచిస్తుంటారు. దానిమ్మ వల్ల గర్భిణీలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎలాంటి నిర్ధారణ లేదు. అందుకనీ, గర్భిణీలు దానిమ్మగింజలు, జ్యూస్ తాగాలనుకునేవారు, ముందుగా డాక్టర్ ను కలిసి, వారి సూచనల ప్రకారం తీసుకోవచ్చు. దానిమ్మలో పోషకాలు అధికంగా ఉన్నాయి . ఇవి తల్లికి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా సహాయపడుతాయి. అదే విధంగా శరీరానికి తగినంత హైడ్రేషన్ అందివ్వడంలో దానిమ్మ జ్యూస్ గ్రేట్ అని చెప్పవచ్చు . స్వీట్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. దానిమ్మ, దానిమ్మ జ్యూస్ లోని హెల్త్ బెనిఫిస్ట్ ..

ఫైబర్ ఎక్కువ:

ఫైబర్ ఎక్కువ:

అరకప్పు దానిమ్మ గింజల్లో 5గ్రాముల పైబర్ ఉంటుంది. గర్భధారణ సమయంలో మలబద్దక సమస్యలు మరియు ఇతర బౌల్ మూమెంట్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ డైలీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉన్న దానిమ్మ చేర్చుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించుకోవచ్చు. ఫైబర్ బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది.

ఐరన్ ఎక్కువ:

ఐరన్ ఎక్కువ:

ఐరన్ కు గొప్ప మూలం దానిమ్మ. గర్భిణీ శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే, అనీమియాకు గురిచేస్తుంది, అనీమియా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐరన్ లోపంతో బాధపడే గర్భిణీలు ప్రీటర్మ్ డెలవరీ, లోవెయిట్ బర్త్ కు కారణమవుతుంది. కాబట్టి, ఐరన్ లెవల్స్ ను హెల్తీగా ఉంచుకోవడం కోసం, కొన్ని ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, వీటికి ప్రత్యామ్నాయంగా నేచురల్ గా ఉండే దానిమ్మ తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిది. ఇది రుచకరమైనది, ఐరన్ ను ఫుల్ ఫిల్ చేస్తుంది. అయితే ఓవర్ డోస్ తీసుకోకూడదు.పండ్లను తినడం వల్ల ఆటోమాటిక్ గా ఐరన్ పెరుగుతుంది.

విటమిన్ సి :

విటమిన్ సి :

దానమ్మ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, దీన్ని తినడంవల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. ఐరన్ గ్రహిస్తుంది, దాంతో అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారు.

తగినన్ని క్యాలరీలను అందిస్తుంది:

తగినన్ని క్యాలరీలను అందిస్తుంది:

గర్భిణీలకు గర్భధారణ సమయంలో ముఖ్యంగా రెండవ, మూడవ త్రైమాసికంలో 2000 నుండి 2,200 వరకూ క్యాలరీలు అవసరమవుతాయి .దానిమ్మ జ్యూస్ లో 136క్యాలరీలున్నాయి. ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్తీగా క్యాలరీలను పొందవచ్చు. అలాగే శరీరానికి అవసరమైన హైడ్రేషన్ ను అందివ్వొచ్చు.

ఫొల్లెట్:

ఫొల్లెట్:

గర్భధారణ సమయంలో ఫొల్లెట్ అనే విటమిన్ బేబీ డెవలప్ మెంట్ కు ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల 60గ్రాముల ఫొల్లెట్ అందుతుంది. గర్భిణీలు 600మిల్లీగ్రాముల ఫొల్లెట్ అవసరమవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో సరైన మోతాదాలు ఫొల్లెట్ అందాలన్నా, బర్త్ డిఫెక్ట్స్ ను నివారించాలన్నా, దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్ కె:

విటమిన్ కె:

దానిమ్మ జ్యూస్ లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఒక సర్వింగ్ లో 26.1మైక్రోగ్రాములు విటమిన్ కె ఉంది., రోజుకు 90mcgవిటమిన్ కె అవసరం అవుతుంది . విటమిన్ కె తల్లి బిడ్డలో బోన్ స్ట్రెంగ్ ను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.

 పొటాషియం:

పొటాషియం:

8 ఔన్సుల దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల 538గ్రాముల పొటాషియం అందుతుంది. ఇది మరో న్యూట్రీషియన్ ఫుడ్. ఇందులో 4700మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది., ఇది గర్భిణీలు కాళ్ళ నొప్పులు నివారిస్తుంది.ఇంకా క్రాంప్స్ ను నివారిస్తుంది . మజిల్స్, నాడీవ్యవస్థకు సహాయపడుతుంది,

యాంటీఆక్సిడెంట్స్ :

యాంటీఆక్సిడెంట్స్ :

దానిమ్మ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. దీని వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారు . హెల్తీ ప్రెగ్నెన్సీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్లాసెంటా ఇంజ్యూర్ కాకుండా నివారిస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఫీటస్ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది.

English summary

Is It Safe To Have Pomegranate & Pomegranate Juice During Pregnancy?

Most doctors will happily ask you to continue eating pomegranates and drinking pomegranate juice throughout the course of your pregnancy. However, get a checkup done to be on the safe side. Moreover, science does not know whether is pomegranate good during pregnancy, so it is better to steer well clear of these during your pregnancy.
Story first published: Friday, September 2, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion