For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విన్స్ పుట్టడానికి కొన్ని సర్ ప్రైజింగ్ రీజన్స్ ..!

By Super Admin
|

గర్భం పొందడం అనేది మహిళకు దేవుడిచ్చిన ఒక వరం. కవలలు పుడితే అదొక అద్భుతం . ఒకే సారి ఇద్దరి పిల్లలకు జన్మనివ్వడం అనేది ఆశ్చర్యం. కొద్ది సమయం తేడాతో రెండు ప్రసవాలు జరుగుతాయి. ఒకరకంగా చెప్పాలంటే మరో లేబర్ పెయిన్ లేకుండా లేదా మరో సజేరియన్ జగకుండా ఒకే సారి కవలలు పుట్టడం కూడా మంచిదే.

అలాగే ఒకే సమయంలో ఇద్దరు పిల్లల పెంపకానికి బాద్యత వహించవచ్చు. అయితే ట్విన్స్ ఉండటం వల్ల పని కూడా రెట్టింపు అవుతుంది. వారి ఫీడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి . ఒక బేబికి ఫీడ్ చేసినప్పుడు మరో బేబీ కూడా ఆకలితో ఉంటుంది.

కవలపిల్లలను కోరుకునే వారు , వారి ఓవరీస్ 2 అండోత్సర్గాలు ఉత్పత్తి కావల్సి ఉంటుంది. రెండు అండాలు విడుదలైనప్పుడు, రెండు స్పెర్మ్స్ వాటిని కలవడం వల్ల ఇద్దరు పిల్లలుగా ఏర్పడుతారు.

ఇందుకు అదనంగా శ్రమపడాల్సిన అవసరం లేదా . ఇది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. దీని మీద కంట్రోల్ ఉండదు. కవల పిల్లలు కలగడానికి కొన్ని ప్రత్యేమైన విషయాలు ఉన్నాయి .

సంతానం కోసం మందులను వాడటం, ట్రీట్మెంట్స్ వల్ల ఒక్కో సందర్భంలో కలల పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . కవలలు పుట్టడానికి అవకాశం కల్పించే కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మెడిసిన్స్

మెడిసిన్స్

మహిళలు సంతానం కోసం తీసుకొనే డ్రగ్స్ వంద్యత్వంతో బాధపడేవారు , సంతానం కోసం తీసుకునే ముందులు గర్భం పొందడానికి మాత్రమే కాదు, ఒకే సారి కవలపిల్లలను పొందే అవకాశం ఉంటుంది . ఫెర్టిలిటి డ్రగ్స్ వల్ల మహిళలు ఒకటి కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి . ఇవి రెండు వేరు వేరు వీర్యకణాలతో కలవడం వల్ల కలలు ఏర్పడుతారు.

ఫ్యామిలీ హిస్టరీ:

ఫ్యామిలీ హిస్టరీ:

కుటుంబంలో ఎవరికైన ఇదివరకే కవలలు పుట్టినట్లైతే, లేదా రక్తసంబందీకుల్లో అలా జరిగినా, ఇలా ఇద్దురు కవలపిల్లలు పుట్టే అవకాశం ఉంది.

ఏజ్డ్ ఉమెన్

ఏజ్డ్ ఉమెన్

35ఏళ్ల వయస్సు దాటిన మహిళల్లో కూడా కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. యంగ్ గా ఉండే మహిళల కంటే వయస్సైన మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువ అని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

ఐవిఎఫ్ ట్రీట్మెంట్

ఐవిఎఫ్ ట్రీట్మెంట్

ఐవిఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ట్రీట్మెంట్ తీసుకునే వారిలో కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి చికిత్సల్లో మహిళ గర్భంలోకి వీర్యకణాలను లేదా ప్రత్యుత్పత్తి జరిగినేఎగ్స్ ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అక్కడ కనుకు వీర్యకణం ప్రత్యుత్పత్తి జరిపి, పిండం ఏర్పడటం ప్రారంభిస్తే కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హెల్తీ ఉమెన్ :

హెల్తీ ఉమెన్ :

పొడవుగా మరియు ఆరోగ్యం ఉన్న స్త్రీలలో కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా ఎక్కువ బరువు ఉన్నవారిలో కూడా కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువ.

యామ్స్ తినే వారిలో

యామ్స్ తినే వారిలో

మహిళల్లో ఎవరైతే ఎక్కువగా యామ్స్ తింటారు వారిలో కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువ . అయితే కవలలు పుట్టడానికి ఎంత యామ్స్ తినాలన్నది తెలుసుకోవాలి.

నివసించే వాతావరణ పరిస్థితిని బట్టి

నివసించే వాతావరణ పరిస్థితిని బట్టి

మహిళలు జీవించే వాతావరణ పరిస్థితులను బట్టి కవలలు పుట్టే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు ఆఫ్రికాలోని మహిళలకు కవలలు పుట్టే చాన్సెస్ ఎక్కువ.

English summary

Surprising Things Which Increase Chances Of Giving Birth To Twins

Most women have a desire to give birth to twins. Having twins will be a one time shot for two deliveries at a time. This is good if you don't want to suffer from another labour pains or a cesarean section.
Story first published: Wednesday, July 20, 2016, 18:33 [IST]
Desktop Bottom Promotion