For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాశయంలో బేబీ.. చేసే ఆశ్చర్యకర విషయాలు

By Swathi
|

మొదటిసారి ప్రెగ్నంట్ అయ్యారా ? అయితే ఆ మధురానుభూతులను మరింత ఆనందంగా ఎంజాయ్ చేయాలి. మరో కొత్త ప్రాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వరం మహిళలది. పొట్టలో బిడ్డను మోస్తున్నప్పుడు ఆ తల్లికి కలిగే ఆనందం వర్ణించలేనిది. అయితే పెరుగుతున్న శిశువు తన గర్భాశయంలో ఏం చేస్తున్నాడో ? అన్న ఆలోచనలు ప్రతి గర్భిణీ స్త్రీని ప్రశ్నిస్తుంటాయి.

అసలు బేబీ పొట్టలో ఏం చేస్తుంటాడు ? గర్భాశయంలో శిశువు ఏ సందర్భంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ పెడతారు ? కడుపులో ఉండే బుజ్జి పాపాయి కదలికలు ఎలా ఉంటాయి ? అనేవి చాలా ఆసక్తికర విషయాలు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఉంది. గర్భాశయంలో బేబీ కేవలం వేళ్లు, కాలి వేళ్లు, చేతులు కదిలించడం మాత్రమే కాదు.. వాళ్లు రకరకాలుగా రియాక్ట్ అవుతుంటారని నిపుణులు చెబుతున్నారు.

ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకున్నప్పుడు గర్భాశయంలో కదులుతున్న శిశువును చూసి మురిసిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో బేబీ కదలికల వల్ల పొట్టను తన్నినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ గర్భిణీ స్త్రీకి అత్యంత అద్భుతమైన అనుభవాలు. అయితే కదలికలు, తన్నడం వంటివి మాత్రమే కాదు.. గర్భాశయంలో బిడ్డ.. చేసే ఆశ్చర్యకర విషయాలు.. మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా..

ఏడవడం

ఏడవడం

గర్భాశయంలో బేబీ ఏడుస్తాడా ? అంటే నిజమే అంటున్నారు నిపుణులు. ఆల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు గర్భాశయంలో ఏడుస్తూ ఉంటారట.

బంధాన్ని ఏర్పరచుకోవడం

బంధాన్ని ఏర్పరచుకోవడం

ఒకవేళ మీకు కవలలు పుట్టేలా ఉంటే.. వాళ్లిద్దరూ గర్భాశయంలోనే బంధం ఏర్పరచుకుంటారు. ఈ బంధం తల్లితో కూడా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చివరి 10 వారాల గర్భధారణ సమయంలో.. కడుపులోని బిడ్డ తమ తల్లి మాటలు, స్వరం వింటూ ఉంటారట.

ఎక్కిళ్లు

ఎక్కిళ్లు

ఫస్ట్ ట్రైమ్ స్టర్ అంటే మొదటి మూడునెలల సమయంలోనే బేబీకి ఎక్కిళ్లు మొదలవుతాయి. కాకపోతే వాటిని గుర్తించడం కష్టం. అయితే డెలివరీకి దగ్గరపడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లైతే.. కడుపులో శిశువుకి ఎక్కిళ్లు వస్తున్నట్లు గమనించవచ్చు.

నవ్వడం

నవ్వడం

ప్రెగ్నెన్సీ 26వ వారంలో ఉండగా.. గర్భాశయం నుంచే బేబీ చాలా విషయాలకు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే పొట్టలోనే చాలా ముద్దుగా నవ్వుతూ ఉంటాడు. వింటుంటే.. చాలా వండర్ గా ఉంది కదూ..

ఆవలించడం

ఆవలించడం

వావ్.. అనిపిస్తోందా ? నిజమే.. మీ బిడ్డ గర్భాశయంలోనే ఆవలిస్తూ ఉంటాడు. ఎందుకంటే.. గర్భాశయంలో బేబీ ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటాడు. దీనివల్ల తరచుగా ఆవలింతలు వస్తూ ఉంటాయి.

యూరిన్

యూరిన్

మీకు తెలుసా ? పొట్టలో ఉండగానే బేబీ యూరిన్ కూడా చేస్తారని. ఫస్ట్ ట్రైమ్ స్ట్రర్ చివరి దశలో గర్భాశయంలో యూరిన్ చేయడం మొదలుపెడతారు శిశువు. అప్పటి నుంచే.. యూరిన్ ఉత్పత్తి చేస్తాడు.

కళ్లు తెరవడం

కళ్లు తెరవడం

28వ వారంలో గర్భం ఉండగా.. బేబీ కళ్లు తెరవడం మొదలుపెడతారు. అప్పటి నుంచే.. బ్రైట్ గా ఉండే లైట్ కి రియాక్ట్ అవడం మొదలవుతుంది. దీనికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. కళ్లు తెరిచినా.. మళ్లీ వెంటనే మూసుకుంటూ ఉంటారు.

డిన్నర్ రుచి చూడటం

డిన్నర్ రుచి చూడటం

ఎలాంటి ఫుడ్ మీరు తీసుకున్నా.. ఆ ఆహారం రుచి ఖచ్చితంగా మీ పొట్టలోని బిడ్డకు ఫ్లూయిడ్ రూపంలో చేరుతుంది. 15వ వారంలో గర్భం ఉన్నప్పుడు స్వీట్ ఫ్లేవర్స్ ఇష్టపడటం మొదలవుతుంది.

English summary

What Does The Baby Do Inside The Womb?

What Does The Baby Do Inside The Womb? There are a lot of women who often wonder what their baby is doing inside their womb, Many surprising things the foetus does in a womb.
Desktop Bottom Promotion