తల్లి కాబోతున్నారా, ప్లాస్టిక్ బాటిల్లోని నీళ్ళు తాగితే మీ బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో వాడే మరియు ఆహార,పానీయ క్యానుల లైనింగ్ లకి వాడే రసాయనం గర్భవతిగా ఉన్నప్పుడు,తల్లి నుంచి పిల్లలకి వెళ్ళి వారి చిన్నప్రేగులో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం చూపించవచ్చు.

మీరు తల్లి కాబోతుంటే, ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మీరు ఇలాంటి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ జరిగిన ఉత్పత్తులకి దూరంగా ఉండటమే మంచిదని తేలింది. ఎందుకంటే అందులో వాడే రసాయనం మీ బిడ్డకి సమస్యలు తేగలదు. పెన్న్ స్టేట్ రీసెర్చ్ ప్రకారం, బిస్ఫెనాల్ ఎ (బిపిఎ) అనే రసాయనాన్ని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో మరియు ఆహారపానీయ టిన్నులలో వాడతారు.ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి నుంచి బిడ్డకి వెళ్ళి వారి చిన్నప్రేగులో మంచి బ్యాక్టీరియాపై మార్పులు చేస్తాయి.

గర్భిణీలకు కొబ్బరి బోండాం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు...

Are Plastic Bottles Unhealthy In Pregnancy

గతంలో జరిగిన పరిశోధన ప్రకారం ఫర్నీచర్ మరియు ఇంటి ఉత్పత్తులలో కాలని పదార్థాలలో రసాయనాలకి ప్రెగ్నెన్సీ సమయంలో దూరంగా ఉండాలని, లేకపోతే బిడ్డ ఐక్యూకి ప్రమాదమని సూచించారు. అలాంటి అధ్యయనమే కొన్ని నెలలక్రితం జరిగి ఇలాంటి ప్లాస్టిక్ లో వాడే రసాయనం వలన బేబీలలో అలర్జీతో కూడిన ఆస్తమాకి కారణమవుతుందని తెలిపారు.

Are Plastic Bottles Unhealthy In Pregnancy

కుందేళ్ళపై జరిగిన పరిశోధనలో,శాస్త్రవేత్తలు కడుపుతో ఉన్నప్పుడు బిపిఎ ప్రభావానికి లోనైతే వాటి పిల్లలలో ప్రేగులకి, కాలేయానికి చాలా ఎక్కువ వాపును గుర్తించారు. శాస్త్రవేత్తలు, చిన్నప్రేగు ఎక్కువ ఆహారం తీసేసుకోవడం లేదా లీక్ అయిపోతున్న చిన్నప్రేగుని గుర్తించారు. అక్కడ మంచి బ్యాక్టీరియా తగ్గిపోవటం,వాపు రాకుండా ఆపే చిన్న ఫ్యాటీ యాసిడ్ల వంటి బ్యాక్టీరియల్ మెటబోలైట్’స్ తగ్గిపోతున్నాయని పరిశోధకుడు జైరామ్ కెపి వనమాల వివరించారు.

గర్భిణీ స్త్రీలు జీరా వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

Are Plastic Bottles Unhealthy In Pregnancy

మంచిబ్యాక్టీరియా ప్రేగులలో తగ్గిపోవటం, ప్రేగుకి చిల్లిపడటం ,మెటబోలైట్’స్ గుర్తించడం వంటివి వాపుకి సంబంధించిన దీర్ఘ వ్యాధులను లేదా బయోమార్కర్లుగా గుర్తిస్తారని ఆయన చెప్పారు. పిల్లలు బిపిఎ ప్రభావంకి నేరుగా గురికాకపోయినా తల్లి ద్వారా గర్భాశయం నుంచి, పాల ద్వారా ఈ రసాయనం బారిన పడతారు. ఈ ప్రభావం దీర్ఘకాల అనారోగ్యాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Are Plastic Bottles Unhealthy In Pregnancy

భవిష్యత్తులో, వనమాల ప్రకారం పరిశోధకులు గర్భవతిగా ఉన్న సమయంలో ఎలా డైట్ మరియు పర్యావరణం దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయో పరిశోధిస్తారని తెలిపారు. శాస్త్రవేత్తలు మానవులలాగానే ఎక్కువ గర్భధారణ సమయం ఉన్నందున కుందేళ్ళను ఎంచుకున్నారు. వనమాల ప్రకారం ఎలుకలకి అతితక్కువ గర్భధారణ సమయం ఉన్నది.

Are Plastic Bottles Unhealthy In Pregnancy

భవిష్యత్తులో ఆహార అలర్జీలకి, ప్రేగులలో బ్యాక్టీరియా సంఖ్య తగ్గడానికి సంబంధం ఏంటో కూడా పరిశోధన జరుగుతుందని ఆయన తెలిపారు.

English summary

Moms-to-be, a chemical used in plastic packaging can risk your baby’s health

Moms-to-be, a chemical used in plastic packaging can risk your baby’s health. Read to know more about..
Subscribe Newsletter