గర్భిణీ స్త్రీల చర్మ సమస్యలు, నివారించే హోం రెమెడీస్!

Posted By:
Subscribe to Boldsky

మహిళ గర్భం పొందడం ఒక వరం. అయితే గర్భం పొందిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గర్భంతో పాటు సమస్యలు కూడా అంతే వేగంగా వస్తాయి. మహిళలు గర్భం పొందిన తర్వాత చర్మంలో మంచి గ్లో వస్తుంది. గర్భధారణ సమయంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు చర్మ సమస్యలు ఎదుర్కొంటారు.

ఈ చర్మ సమస్యలకు అనేక కారణాలున్నాయి. శరీరంలో ఈస్ట్రోజెన్, మరియు ప్రొజెస్టెరాన్ లు విపరీతంగా పెరగడం వల్ల ఇవి శరీరంలోని అన్ని అవయావల మీద, వాటి పనితీరు మీద ప్రభావం చూపుతాయి. చర్మంతో సహా ప్రభావం చూపుతాయి.

శరీరంలో అనేక రసాయాణాలు, బయలాజికల్ మార్పులు జరగడం వల్ల చర్మ సమస్యలకు దారితీస్తుంది. గర్భిణీలు సాధారణంగా వచ్చే చర్మ సమస్యల్లో ఎగ్జిమా, పోరియోసిస్, మొటిమలు వంటి సమస్యలు గర్భిణీలకు అత్యంత చీకాకు కలిగించే సమస్యలు. వీటితో పాటు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఆందోళన కలిగిస్తాయి. మహిళ గర్భం పొందిన తర్వాత సహజంగా వచ్చే చర్మ సమస్యలు, నివారణ, హోం రెమెడీస్ కొన్ని..

1. మొటిమలు :

1. మొటిమలు :

మహిళ గర్భం పొందిన తర్వాత అత్యంత సాధారణంగా వచ్చే సమస్యల్లో ఒకటి మొటిమలు, మొటిమలు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇన్ఫ్లమేషన్ కు గురి కావడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. మహిళ శరీరంలో ఆండ్రోజెన్స్ హార్మోన్స్ అధికమవ్వడం వల్ల సెబాసియస్ గ్రంథులు పెరుగుతాయి. దాంతో ఎక్కువ సెబెమ్ పెరుగుతుంది. ఈ సెబమ్ డెడ్ స్కిన్ సెల్ తో చేరి మొటిమలను, బ్యాక్టీరియల్ గ్రోత్ ను పెంచుతుంది.

నివారణ:

మొటిమలను నివారించుకోవడానికి క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఒక అద్భుతమైన మంత్రం.

మైల్డ్ సోప్ లేదా సోపుతో ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది. స్క్రబ్బింగ్ చేయడం మానేయాలి. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, వాటర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలి.

మొటిమలు- హోం రెమెడీ :

మొటిమలు- హోం రెమెడీ :

పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

2. హీట్ రాషెస్ :

2. హీట్ రాషెస్ :

ప్రిక్లీ హీట్ వల్ల హీట్ రాషెస్ గర్భాధారణ సమయంలో చాలా సాధారణం. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కూడా హీట్ పెరుగుతుంది. హీట్ వల్ల అసౌకర్యం, దురద కలుగుతుంది. వేడి వల్ల చర్మంలో రాషెస్ బ్రెస్ట్ క్రింద, తొడల వద్ద ఏర్పడుతాయి.

నివారణ : గోరువెచ్చని నీటితో స్నానం, మరీ వేడిగా లేకుండా గోరువెచ్చగా స్నానం చేయాలి. ఫెర్ఫ్యూమ్స్, లోషన్స్ , హానికరమైన సోపులను వాడటం నివారించాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

 హీట్ రాషెస్ -రెమెడీస్ :

హీట్ రాషెస్ -రెమెడీస్ :

ఇన్ఫెక్షన్ అయిన ప్రదేశంలో కూల్ గా ఉండే కంప్రెసర్ ను అప్లై చేయాలి. అలాగే కాలమైన్ లోషన్ కూడా అప్లై చేసుకోవచ్చు.

3. దురద:

3. దురద:

ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గటం వలన చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఎక్కువగా చేతులు, చర్మం మీద, దురద ఎక్కువగా ఉంటుంది. డెర్మటైటిస్ వల్ల దురద ఎక్కువగా ఉంటుంది.

నివారణ:

చర్మాన్ని క్రీములు రాయటం ద్వారా తేమగా వుంచండి. రోజుకు రెండు సార్లు ఈ క్రీములు రాస్తే దద్దుర్లు తగ్గుతాయి. చర్మంలో తేమ నిలువచేయటానికిగాను సరళమైన హెర్బల్ సోప్ వాడండి.

దురద-రెమెడీస్ :

దురద-రెమెడీస్ :

రెగ్యులర్ డైట్ లో వర్జిన్ ఆలివ్ ఆయిల్ చేర్చుకోవాలి. విటమిన్ ఎ, డి, లినోలిక్ యాసిడ్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. బీట్ రూట్ , డ్యాండలైన్ వంటివి లివర్ ను శుభ్రం చేస్తుంది. అలోవెర జెల్, ఎమోలింట్స్, వంటివి అప్లై చేయాలి.

4. మెలసోమా :

4. మెలసోమా :

దీన్ని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా పిలుస్తారు. చర్మం గ్రే కలర్ లో లేదా బ్రౌన్ ప్యాచెస్ లా డార్క్ గా మార్చుతుంది. ముఖ్యంగా ఫోర్ హెడ్, బుగ్గలు, గడ్డం మీద చర్మం డార్క్ గా మారుతుంది. హార్మోనుల మార్పుల వల్ల ఈ మెలస్మా పెరుగుతుంది.

నివారణ :

మద్యహ్నా సమయంలో బయటకు వెళ్లడం నివారించాలి

ఎస్ఎఫ్ ఫి కలిగిన సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి.

మెలసోమా -రెమెడీస్ :

మెలసోమా -రెమెడీస్ :

కొబ్బరి పాలు, పసుపు మిక్స్ చేసి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత వేడినీళ్లతో కడిగేయాలి.

హెర్బల్ స్ర్కబ్ తో ఎక్సఫ్లోయేట్ చేయాలి.

5. స్కిన్ ట్యాగ్స్ :

5. స్కిన్ ట్యాగ్స్ :

స్కిన్ ట్యాగ్స్ (పులిపుర్లు)ఇవి చర్మానికి అతుక్కొని ఉంటాయి. ఇవి ఎక్కువగా చెస్ట్, మెడ, బ్రెస్ట్ ప్రదేశంలో ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో ఎక్కువగా బయటకు కనబడుతాయి.. దీనికి ముఖ్య కారణం హార్మోనల్ యాక్టివిటీస్ మరియు ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ వల్లకూడా వస్తాయి.

స్కిన్ ట్యాగ్స్-రెమెడీస్ :

స్కిన్ ట్యాగ్స్-రెమెడీస్ :

స్కిన్ ట్యాగ్స్ (పిలిపిర్లు) ఉన్న ప్రదేశంలో టీట్రీ ఆయిల్ అప్లై చేసి చేయడం వల్ల స్కిన్ ట్యాగ్స్ ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

నిమ్మరసం కూడా అప్లై చేయవచ్చు.

6. స్ట్రెచ్ మార్క్స్ :

6. స్ట్రెచ్ మార్క్స్ :

స్ట్రెచ్ మార్క్స్ ఎర్రగా, పర్పుల్ కలర్లో, పింక్, లేదా వైట్ కలర్లో ఉంటాయి. పొట్టలో బేబి క్రమంగా పెరగడం వల్ల పొట్ట ఉదరంలో చర్మం క్రింది భాగంలో చర్మ కణాలు స్ట్రెచ్ అవ్వడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

స్ట్రెచ్ మార్క్స్ -రెమెడీస్:

స్ట్రెచ్ మార్క్స్ -రెమెడీస్:

విటమిన్ ఇ ఆయిల్ తో మసాజ్ చేయడం, ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం, ఎగ్ వైట్ అప్లై చేయడం, నిమ్మరసం అప్లై చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవచ్చు.

7. వీర్ కోస్ వీన్స్ :

7. వీర్ కోస్ వీన్స్ :

వీర్ కోస్ వీన్స్. చర్మం క్రింది భాగంలో నరాలు పెద్దగా అవ్వడం వల్ల, నరాలు ఉబ్బడం వల్ల వీర్ కోస్ వీన్స్ సమస్య ఏర్పడుతుంది. ఇవి చాలా చిన్నగా , అసౌకర్యంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీర్ కోస్ వీన్స్ ఉన్న ప్రదేశంలో దురద కలుగుతుంది. దాంతో పాదాల చాలా బరువుగా, నొప్పిగా ఉంటాయి.

నివారణ :

ఎక్కువ బరువులు ఎత్తడం, రోజువారి వ్యాయామాలు చేయడం మానేయాలి.

అలాగే ఎక్కువ సమయాలు కూర్చోకుండా సాధ్యమైనంత వరకూ ఇటు అటు తిరగడం కూడా మంచిదే.

కూర్చొన్నప్పుడు కాళ్లు, మడిమలు, పాదాలను క్రాస్ గా ఉంచుకోకూడదు.

కాళ్ళను మరియు పాదాలను కొంచెం ఎత్తులో ఉంచుకోవడం, పడుకొన్నప్పుడు దిండును సపోర్టివ్ గా ఉంచుకోవడం మంచిది.

 వీర్ కోస్ వీన్స్ -రెమెడీస్ :

వీర్ కోస్ వీన్స్ -రెమెడీస్ :

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల యూట్రస్ బరువు వీన్స్ మీద పడకుండా ఉంటుంది. కాళ్లు, పాదాలలోని వీన్స్ మీద ప్రెజర్ తగ్గుతుంది. డాక్టర్ సలహాతో స్ట్రాకిన్స్ ధరించడం వల్ల కాళ్లలోని రక్త నాళాలకు రక్త ప్రసరణ మెరుగుపరడుతుంది. దాంతో కాళ్ళు , పాదాల వాపు తగ్గుతుంది.

English summary

Common Skin Problems During Pregnancy with Remedies

During pregnancy, a lot of changes may take place in a woman's body. Skin problems are the most obvious changes that happen during pregnancy.
Story first published: Tuesday, June 20, 2017, 18:32 [IST]
Subscribe Newsletter