For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఖచ్చితంగా ఈ విటమిన్స్ ను తీసుకోవాలి!

By Staff
|

శరీర ఆరోగ్యానికి విటమిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్స్ తోనే ఆరోగ్యకరమైన శరీరాన్ని మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా గర్భిణీలలో ఆరోగ్యకరమైన శరీరం మెయింటైన్ చేయడాన్ని తేలికగా అంచనా వేయకూడదు.

ఎందుకంటే సరైన పోషకాలు మరియు ఆహార నియమాలు కేవలం గర్భిణీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, కడుపులో పెరిగే పిండం అభివ్రుద్దికి కూడా చాలా అవసరం. మహిళ గర్బం పొందిన తర్వాత ఆమె శరీరంలో జరిగే మార్పులు, పిండం

గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సినటువంటి విటమిన్ D-రిచ్ ఫుడ్స్గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సినటువంటి విటమిన్ D-రిచ్ ఫుడ్స్

అభివృద్ధి చెందడానికి జరిగే ప్రక్రియలో ఎక్కువ విటమన్స్ అవసరం అవుతాయి. అది ఒక్కో మహిళలలో ఒక్కో విధంగా అవసరం అవుతాయి.

గర్భిణీలకు తప్పనిసరిగా అవసరమయ్యే కొన్ని విటమిన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

విటమిన్ బి12:

విటమిన్ బి12:

నిపుణుల ప్రకారం, గర్భిణీకలు 2.5mcg ల విటమిన్ బి12 శరీరానికి అవసరం అవుతుంది. తల్లి, బిడ్డ క్షమంగా ఉండటానికి సరిపడా విటమిన్ బి12 అందుతున్నదో లేదో తెలుసుకుంటారు. కాబోయే తల్లుల్లు కూడా విటమిన్ బి12 సప్లిమెంట్ ను రోజూ తీసుకోవడం మంచిది. కనీసం మూడు నెలల ముందు నుండీ తీసుకుంటే మంచిది. అయితే వీటిని స్వయంగా తీసుకోకుండా డాక్టర్స్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది.

ఐయోడిన్:

ఐయోడిన్:

గర్భిణీలకు అయోడిన్ కూడా ముఖ్యమే. ఐయోడిన్ ఐక్యును పెంచుతుంది. నిపుణుల ప్రకారం1/3 మహిళలు ఐయోడిన్ లోపంతో బాధపడుతున్నారు. ఇది పుట్టబోయే బిడ్డలో ఏకాగ్రత, నేర్పరి తనాన్ని పెంచుతుంది. నిపుణుల సూచన ప్రకారం , గర్భిణీకి 250mcgఐయోడిన్ అవసరం అవుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

గర్భిణీల కొరకు టాప్ 10 విటమిన్ ఫుడ్స్గర్భిణీల కొరకు టాప్ 10 విటమిన్ ఫుడ్స్

మెగ్నీషియం:

మెగ్నీషియం:

నిపుణుల సూచన ప్రకారం, గర్భిణీ స్త్రీకి 270mg ల మెగ్నీషియం అవసరం. పాలిచ్చే తల్లులకు 320mg మెగ్నీషియం అవసరం అవుతుంది. గర్భిణీలలో కణజాలాలను రిపేర్ చేయడానికి మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. పిండానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఫోలిక్ యాసిడ్:

ఫోలిక్ యాసిడ్:

నిపుణుల సూచన ప్రకారం గర్భిణీలకు 600mcg ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. ట్యూబ్ బర్త్ ను నివారిస్తుంది.

ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు లేదా పిల్లలకోసం ప్రయత్నించే వారు, 200mcgల ఫోలిక్ యాసిడ్ ను తీసుకోవడం మంచిది. వీటితో పాటు, ఆకు కూరలు, పండ్లు, బంగాళదుంపలు, గుడ్డు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఫోలిక్ యాసిడ్ ను పొందుతారు.

ఐరన్:

ఐరన్:

ప్రతి మహిళకు 14.8 mg ల ఐరన్ అవసరం అవుతుంది. శరీరంలో అదనపు రక్తం ఏర్పడుటకు అవసరం అవుతుంది. ఐరన్ లోపం వల్ల గర్భిణీలు అనేక సమస్యలు వస్తాయి. 30శాతం కంటే ఎక్కువగానే గర్భిణీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అందువల్ల గర్భిణీలు రెగ్యులర్ గా ఐరన్ సప్లిమెంట్ ను తీసుకోవడం మంచిది. సప్లిమెంట్ తో పాటు, ఆకుకూరలు, ఎండు ఫలాలు, మాంసం, ధాన్యాలు వంటివి రోజువారి ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి.

విటమిన్ డి:

విటమిన్ డి:

గర్భిణీలకు రోజుకు 10mcg ల విటమిన్ డి అవసరం అవుతుంది. విటమిన్ డి బేబీ కావల్సిన శక్తిని, పోషణను అందిస్తుంది. ముఖ్యంగా మొదటి మూడు నెలలు అవసరం అవుతుంది. విటమిన్ డి పొందడానికి రోజువారి ఆహారంలో ఆయిల్ ఫిష్, ఫోర్టిఫైడ్ మీల్స్, గుడ్డు చేర్చుకోవాలి. అలాగే రోజూ ఉదయం 15 నిముషాలు ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి పొందుతారు.

సెలీనియం:

సెలీనియం:

నిపుణుల సూచన ప్రకారం గర్భిణీలకు సెలీనియం రోజుకు 60mcg అవసరం అవుతుంది. పాలిచ్చే తల్లులకు 75mcgలు అవసరం. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం సెలీనియం లోపం వల్ల గర్భస్రావం జరిగే అవకాశలున్నట్లు సూచిస్తున్నారు. అందుకు రోజు వారి ఆహారాల్లో గుప్పెడు బ్రాజిల్ నట్స్ ను తీసుకోవడం మంచిది. గర్భిణీలకు అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన విటమిన్స్...

• 3 mg థైయమిన్ గర్భిణీలకు చాలా అవసరం.

• 20 mg నియాసిన్ చాలా అవసరం

• 10 mg విటమిన్ ఇ

• 15 mg జింక్

• 2 mg రిభోఫ్లోవిన్

English summary

Essential Vitamins For A Pregnant Woman

The importance of vitamins in maintaining a healthy body cannot be underestimated, especially in the case of a pregnant woman.
Desktop Bottom Promotion