జీరా వాటర్ తయారీ మరియు గర్భధారణ సమయంలో దాని వల్ల కలిగే ప్రయోజనాలు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

గర్భధారణ అనేది జీవితంలోనే ఒక అద్భుతమైన దశ. అలాంటిది మీ శరీరంలోనే ఒక నూతనమైన ఆత్మను కలిగి ఉన్నారనే భావన అనేది ఎంతో సంతోషభరితమైనది.

గర్భధారణ అనేది ఒక దీర్ఘకాల ప్రయాణముగా ఉంటుంది. మన శరీరము - ఒక శిశువు పెంపకమును కలిగియుండి, మరియు జన్మనిచ్చేటంత విస్తృతమైనదిగా వున్నది. అందువల్ల, మన శరీరానికి సరైన పోషకాహారాలను అందజేయటం చాలా ముఖ్యం. దానివల్ల మన శరీరం లోపల ఉన్న బిడ్డ సంతోషంగానూ, ఆరోగ్యంగానూ ఉంటుంది.

గర్భధారణ సమయంలో మీరు తీసుకొనే ఆహారం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారమును తీసుకోవడంపై నియంత్రణను కలిగి ఉన్నందువల్ల మరింత ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. మీరు అనుసరించవలసిన ఆహారం గురించి మీ గైనకాలజిస్ట్ ఒక చార్ట్ను ఇవ్వవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలను దృష్టిలో ఉంచుకొని ఈ చార్ట్ ను రూపొందించబడినది.

How to prepare Jeera Water and it’s Benefits During Pregnancy

ఒక మహిళ యొక్క శరీరము గర్భధారణ సమయంలో చాలా రకాల మార్పులకు గురవుతుంది. ఇలాంటి సమయంలోనే వికారము, మానసిక కల్లోలం, ఉబ్బరం, మలబద్ధకం వంటి ఇతర సమస్యలు ఎదురవుతాయి. రక్తహీనత, రక్తహీనత, గర్భాశయ మధుమేహం, రక్తపోటు మొదలైనవి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.

ఇలా ఒకసారిగా ఎదురయ్యే అనేక విషయాలను, మందుల ద్వారా నియంత్రించడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే, ఇవి శిశువు పైన ,ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి.

గర్భధారణ సమయంలో తలెత్తే అనేక సమస్యలను నయం చేయగల శక్తిని కేవలం ఆయుర్వేద చికిత్సలకు మాత్రమే ఉంటాయి. ఈ చికిత్స వల్ల తల్లి మరియు బిడ్డ ఇద్దరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారు, అలాగే వారి యొక్క ఆరోగ్యం పూర్తిగా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో (ఆయుర్వేద చికిత్స ప్రకారం) విస్తృతంగా ఉపయోగించే పదార్ధం "జీలకర్ర".

How to prepare Jeera Water and it’s Benefits During Pregnancy

మనదేశంలో "జీలకర్రకు" చాలా ప్రాముఖ్యత ఉంది.

గర్భధారణ సమస్యలనుండి తల్లికి ఉపశమనం కలిగించేందుకు ఈ జీలకర్ర విత్తనాలు ఒక మేజిక్ లా పనిచేస్తాయి.

జీరావాటర్ లో తేనె కలిపి తీసుకోవడం వల్ల.. పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

పూర్తి గర్భధారణ సమయంలో 'జీరా-పానీయమును' తరచుగా తీసుకోవాలని, తల్లులకు చాలా మంది సలహా ఇస్తారు. గర్భధారణ సమయంలో జీరా-పానీయమును త్రాగే వారికి కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

రక్తహీనతను తగ్గిస్తుంది :

రక్తహీనతను తగ్గిస్తుంది :

ఈ కాలంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. జీలకర్ర, ఐరన్ యొక్క గొప్ప మూల పదార్థం, ఇది శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. హిమోగ్లోబిన్ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ఆక్సిజన్ను శరీరంలోని కణాలకు చేరవేస్తుంది. ప్రతిరోజూ జీరా-పానీయమును తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది మరియు బిడ్డ యొక్క ఆరోగ్య పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అసిడిటీని తగ్గిస్తుంది :

అసిడిటీని తగ్గిస్తుంది :

గర్భధారణ సమయంలో అసిడిటీని (ఆమ్లత్వం) అనేది ఒక పెద్ద సమస్య. గర్భాశయము, కడుపు ద్వారా అసిడిటీని పంపు చేస్తుంది మరియు ప్రేగులకు ఈ అదనపు వాయువు చేరి, ఉబ్బరం కలిగించేదిగా చేస్తుంది. జీరా-పానీయము ఈ సమస్యలన్నింటికి ఉపశమనమును కలిగించి, జీర్ణక్రియలో సహాయపడుతుంది.

రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది :

రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది :

గర్భధారణ సమయంలో, గర్భధారణ-మధుమేహం అనేది సర్వసాధారణం మరియు దానిని అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో ఉండే అదనపు చక్కెర శిశువుకి హానిని కలిగించవచ్చు. జీరా-పానీయము శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలను తగ్గిస్తున్నందుకు అది సహజమైన నివారిణిగా ఉన్నది.

జీలకర్ర-ధనియాలు-సోంపు కాంబినేసన్ టీ రొటీన్ గా తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు

రక్తపోటు అదుపులో ఉంచుతుంది :

రక్తపోటు అదుపులో ఉంచుతుంది :

గర్భధారణ సమయంలో ఉండే ఒత్తిడి రక్తపోటును పెంచేందుకు కారణమవుతుంది, ఇది వృద్ధి చెందుతున్న శిశువుకు చాలా హానికరం. అధిక రక్తపోటు పిండం యొక్క పెరుగుదలను ఆగిపోయేలా చేస్తుంది.

అందువల్లే మహిళలు వారి రక్తపోటును నిరంతరం పర్యవేక్షించాలని సలహా ఇస్తారు. జీరా-పానీయమును ఉపయోగించడం వల్ల రక్తపోటును తనిఖీ చేస్తూ ఉంటుంది మరియు ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మలబద్ధకం మరియు ఇతర సమస్యలను నిరోధిస్తుంది:

మలబద్ధకం మరియు ఇతర సమస్యలను నిరోధిస్తుంది:

గర్భిణీ స్త్రీలు ఎదుర్కొన్న మరొక సమస్య మలబద్ధకము. పెరుగుతున్న గర్భాశయము, ప్రేగులను తోస్తూ ఉండటం వల్ల మలబద్ధకానికి దారితీస్తుంది.

ఈ కారణంగానే కడుపు ఉబ్బరమునకు మరియు కడుపు నొప్పికి కారణమవుతుంది, ఈ పరిస్థితిని గర్భిణీ స్త్రీలచే నిర్వహించడానికి కష్టంగా ఉంటుంది. జీరా-పానీయము ఈ వాయువు నుండి ఉపశమనమును కలుగ చేస్తుంది, శరీరంలో ద్రవ పదార్ధాలను భర్తీ చేస్తూ - శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయం చేస్తుంది.

ఇది గర్భిణీ స్త్రీలు నిరంతరం కలిగి ఉండే వికారమును, వాంతులు వచ్చేలా ఉండటము వంటి ఇతర సాధారణ గర్భ సమస్యలను కూడా నివారిస్తుంది.

జీరా-పానీయమును తయారుచేసే పద్ధతి :

జీరా-పానీయమును తయారుచేసే పద్ధతి :

ఇది చాలా రకాల ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల, ఆహారంలో ఈ పానీయాన్ని చేర్చడానికి మీరు ఖచ్చితంగా ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక్కడ జీరా-పానీయమును తయారుచేసే పూర్తి పద్ధతిని చూపబడినది. రోజంతా ఈ నీటిని కొద్ది కొద్దిగా త్రాగుతూ ఉండటంవల్ల, అన్ని గర్భ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

కావలసినవి:

కావలసినవి:

3 టేబుల్ స్పూన్ల - జీలకర్ర

1 & 1/2 లీటర్ల నీరు

తయారీ విధానం:

తయారీ విధానం:

1) జీలకర్ర గింజలతో 5 నిముషాల పాటు నీటి మరిగించాలి.

2) ఈ మిశ్రమమును వడకట్టి, చల్లార్చాలి.

3) ఒక సీసాలో ఈ నీటిని నిల్వ చేసి, రోజు అంతటా త్రాగుతూ ఉండాలి.

4) ఇలా రోజువారీ తాజాగా తయారు చేసుకోవడం చాలా ఉత్తమమని సూచించబడింది.

English summary

How to prepare Jeera Water and it’s Benefits During Pregnancy

How to prepare Jeera Water and it’s Benefits During Pregnancy,Drinking jeera water during pregnancy has several benefits. So read to know how to prepare jeera water.
Story first published: Monday, November 27, 2017, 15:30 [IST]