ప్రెగ్నెంట్ లేడీస్ డెఫినెట్ గా తినాల్సిన న్యూట్రీషియన్ ఫుడ్స్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మహిళ జీవితంలో గర్భం పొందడం అంత్యంత ముఖ్యమైన విషయం, పొట్టలో బిడ్డను మోయడానికి మహిళ శరీరానికి తగిన శక్తిసామర్థ్యాలు అవసరమువుతాయి. ఈ సమయంలో న్యూట్రీషియన్ ఫుడ్స్ తినడం తల్లి బిడ్డకు చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అలసట, నీరసం వల్ల గర్భిణీలో తరచూ మూడ్ మారుతుంటుంది. లేదా స్ట్రెస్ ఫీలవుతుంటారు. అందువల్ల రెగ్యులర్ డైట్ లో మినిరల్స్, విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది బేబీని హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

రెగ్యులర్ డైట్ లో చేర్చుకునే ఆహారాలు, ఎక్స్ ట్రా క్యాలరీలను కలిగి ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు తీసుకునే ఆహారంలో పూర్తి పోషకాలుండే విధంగా చూసుకోవాలి. గర్భిణీల డైట్ స్పెషల్ గా ఉండాల్సిన అవసరం లేదు కానీ, వివిధ రకాల వైరటీ ఫుడ్స్ ను తీసుకోవాలి. అటువంటి హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా..

పండ్లు , వెజిటేబుల్స్ :

పండ్లు , వెజిటేబుల్స్ :

గర్భిణీలు తాజా పండ్లు, కూరలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇవి తల్లి బిడ్డకు అన్ని రకాల విటమిన్స్, మినిరల్స్ ను అందిస్తాయి. ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ శక్తి ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. అరటిపండ్లు తినడం వల్ల అలసటను నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే కూరగాయలు పచ్చివి కాకుండా బాగా ఉడికించినవి, లేదా ఆవిరి మీద ఉడికించినవి తినాలి. ఏవి తిన్నా బాగా శుభ్రం చేసి తీసుకోవాలి.

డైరీ ఫుడ్స్ :

డైరీ ఫుడ్స్ :

గర్భిణీలు ప్యాచ్యురైజ్ చేసిన డ్రైడీ ప్రొడక్ట్స్ తీసుకోవడం చాలా సురక్షితం. పెరుగులో విటమిన్ బి , ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి తల్లి బిడ్డకు చాలా మేలు చేస్తుంది. ఇవి బేబీ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి. డైరీ ప్రొడక్ట్స్ లో ఐయోడిన్ అధికంగా ఉంటుంది. ఇది బేబీ డెవలప్ మెంట్ కు చాలా అవసరం. అలాగే ఉడికించిన సాప్ట్ చీజ్ ను తినడం వల్ల కూడా ఎక్కువ పోషకాలను పొందుతారు.

చేపలు:

చేపలు:

గర్భధారణ సమయంలో మితంగా చేపలను తినడం మంచిదే. గర్భధారణ సమయంలో మార్లిన్, స్వార్డ్ ఫిష్, మరియు షార్క్ వంటి చేపలను బాగా ఉడికించి తినాలి. అలాగే లాబ్ స్టర్, ముసెల్స్, ప్రాన్స్, క్రాబ్స్, వంటివి కూడా తినొచ్చు. పచ్చిగా ఉన్న షెల్ ఫిష్ ను తినకూడదు. వీటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి బేబీ డెవలప్ మెంట్ కు హాని కలిగిస్తాయి. సాల్మన్ తినొచ్చు. చేపలు ఏవి తిన్నా మితంగా తీసుకోవడం తల్లి బిడ్డకు క్షేమం.

పీనట్స్ :

పీనట్స్ :

అలర్జీ సమస్యలు లేకపోతే, పీనట్స్, పీనట్ బటర్ ను గర్భిణీలు సురక్షితంగా తినవచ్చు.హెల్తీ పీనట్ బటర్ సాండ్విచ్ ను తినాలి. అలాగే పీనట్ రోస్ట్ చేసిన స్నాక్స్ కూడా తినవచ్చు. అందులో కొద్దిగా నిమ్మరసం, పెప్పర్ పౌడర్ జోడించి తీసుకోవచ్చు.

సెరెల్స్, త్రుణధాన్యాలు:

సెరెల్స్, త్రుణధాన్యాలు:

సెరెల్స్ , త్రుణధాన్యాల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భధారణలో అత్యంత అవసరమైనవి.రోజుకు రెండు మూడు కప్పులు సెరల్స్ తినడం వల్ల అందులో ఫొల్లెట్ మరియు విటమిన్ బి అవసరమైనంత పొందుతారు. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల మరింత ఆరోగ్యకరం మరియు పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో ఫొల్లెట్ , ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి, ఇవి తల్లి బిడ్డకు క్షేమం, వీటిని స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఈవెనింగ్ స్నాక్ గా కొద్దిగా నిమ్మనసం, సాల్ట్ జోడించి తినవచ్చు. ఇది పొటాటోలోని స్వీట్ నెస్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

గుడ్డు :

గుడ్డు :

గర్భిణీలు గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా క్షేమం, రోజుకు ఒకటి రెండు గుడ్లు తినడం మంచిదిజ . కొలెస్ట్రాల్ అవసరమైతే ఉడికించిన గుడ్డును తినడం వల్ల పొట్ట ఫుల్ చేస్తుంది.శరీరానికి కావల్సిన న్యూటీషియన్స్ ను అందిస్తుంది. గుడ్డు బాగా ఉడికించి తినాలి, హాఫ్ బాయిల్డ్ తినకూడదు.సరిగా ఉడికించకపోవడం వల్ల వాంతులు, డయోరియాకు గురిచేస్తుంది.

క్యాల్సియం :

క్యాల్సియం :

గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల తల్లికి అవసరమయ్యే ప్రోటీన్స్ ను అధికంగా పొందుతారు. ఇది గర్భధారణ సమయంలో తల్లికి కావల్సిన క్యాల్షియంను అందివ్వడానికి అవసరమయ్యే బెస్ట్ న్యూట్రీషియన్ ఫుడ్ . తల్లి, బిడ్డలో ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

ఐరన్:

ఐరన్:

గర్భిణీలకు తప్పనిసరిగా ఐరన్ అవసరం అవుతుంది, లీన్ మీట్స్ తినడం వల్ల ఫుల్ ఫిల్ అవుతుంది. ఐరన్ శరీరంలో నిల్వ చేరి , మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది.గర్భిణీలు ఫ్యాట్ ఫ్రీ రెడ్ మీట్ ను తీసుకోవచ్చు.అలాగే బాగా ఉడికించిన మాంసాహారాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

డ్రైడ్ బీన్స్ మరియు లెంటిల్స్ :

డ్రైడ్ బీన్స్ మరియు లెంటిల్స్ :

గర్భిణీలకు 10గ్రాముల అదనపు ప్రోటీన్స్ అవసరం అవుతాయి. అవి బీన్స్, లెంటిల్స్ లో పుష్కలంగా ఉంటాయి, కాబట్టి, రెగ్యులర్ డైట్ లో వీటిని తీసుకోవడం చాలా అవసరం. బ్లాక్ బీన్స్, పింటో బీన్స్, చిక్ పీస్, సలాడ్స్, రూపంలో తీసుకోవచ్చు.

English summary

Nutrition Tips To Follow During Pregnancy

During pregnancy it is important to follow a rich nutrition chart as it can help to make your foetus grow. The food you consume when pregnant will help in the foetus's growth, which is why following this nutrition chart is a must.
Subscribe Newsletter