గర్భిణీలు జామకాయ తింటే పొందే 14 అద్భుతమైన ప్రయోజనాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

గర్భిణీ మహిళలు జామకాలు తినడం సురక్షితమేనా? గర్భిణీలు జామకాయ తినడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జామకాయలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎ లు గర్భిణీలకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి.

ఏదేమైనా , గర్భిణీస్త్రీలు ఏలాంటి పండ్లు తినాలనుకున్నా, ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే పండ్లలో చాలా వరకూ గర్భిణీలకు హానీ కలిగించే పండ్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లలో నిమ్మ. అలాగే బొప్పాయి, పైనాపిల్ వంటివాటికి గర్భిణీలు దూరంగా ఉండాలి. అయితే జామకాయను నిరభ్యరంతరంగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Amazing Health Benefits Of Eating Guava During Pregnancy,

గర్భాధారణ సమయంలో గర్భిణీలు జామకాయ తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఏ పండ్లు తిన్నా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఏవైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి . మరి గర్భిణీలు జామ కాయను తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. వ్యాదినిరోధకశక్తి పెంచుతుంది:

1. వ్యాదినిరోధకశక్తి పెంచుతుంది:

గర్భిణీ స్త్రీలు జామకాయ తినడం వల్ల ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకశక్తిని పెంచి గర్భధారణ సమయంలో ఎలాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది

 2. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

2. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

గర్భిణీ స్త్రీలో ఎక్కువ హైబ్లడ్ ప్రెజర్ కు గురి అవుతుంటారు . గర్భధారణ సమయంలో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి పండిన జామకాయను తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. దాంతో ప్రీమెచ్యుర్ బర్త్ మరియు గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది.

గర్భిణీకలు ఎక్కువ పోషకాలు అందిస్తుంది:

గర్భిణీకలు ఎక్కువ పోషకాలు అందిస్తుంది:

గర్భిణీస్త్రీలు వారితో పాటు మరియు కడుపులో పెరిగే శిశువుకు కూడా తగినంత పోషకాలు అందివ్వాలి. పిండం పెరుగుదలకు అవసరం అయ్యే పూర్తి పోషకాలు ఈ జామకాలో పుష్కలంగా ఉన్నాయి. మరియు తల్లికి కూడా సరిపడా పోషకాలు అందుతాయి.

మలబద్దకం, హెమరాయిడ్స్ నివారిస్తుంది:

మలబద్దకం, హెమరాయిడ్స్ నివారిస్తుంది:

జామకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దక సమస్యను మరియు హెమరాయిడ్స్ ను నివారిస్తుంది.

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

గర్భిణీ స్త్రీలు అజీర్తికి మరియు జీర్ణ సమస్యలకు గురి అవ్వడం చాలా సాధారణం. అయితే రెగ్యులర్ గా జామకాయను తినడం డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది. దాంతో హార్ట్ బర్న్, వికారం, ఇతర సమస్యలు నివారించుకోవచ్చు.

6. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

6. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

గర్భిణీ స్త్రీలు చాలా సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కు గురి అవుతుంటారు . జామకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ఇంకా లికోపిన్ మరియు విటమిన్ సిలు కూడా శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

7. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

7. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

జామకాయలో ఉండే విటమిన్ ఎ, తల్లి బిడ్డలో బ్లైడ్ నెస్ నివారిస్తుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది.

8. బేబీలో నెర్వస్ సిస్టమ్ :

8. బేబీలో నెర్వస్ సిస్టమ్ :

జామకాయలో ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది . కాబట్టి, దీన్ని ఖచ్చితంగా గర్భధారణ సమయంలో తీసుకోవాలి. ఇవి బేబీలో నాడీవ్యవస్థను మరియు బ్రెయిన్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

9. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

9. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

జామకాయలో విటమిన్ సి, ఇ, కెరోటినాయిడ్స్ , ఐసో ఫ్లెవనాయిడ్స్ , ఫాలీఫినాల్స్ అధికంగా ఉన్నాయి. వీటినే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గా పిలుస్తుంటారు. ఇవి క్రిములు, ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతాయి. అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతుంది.

10. మనస్సును ప్రశాంతపరుస్తుంది:

10. మనస్సును ప్రశాంతపరుస్తుంది:

గర్భధారణ సమయంలో కార్టిసోల్ అనే కంటెంట్ ఉత్పత్తి అవుతుంది . ఇది గర్భాధారణకు చాలా హాని కలిగిస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ జామకాయను తినడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.

12. అనీమియా తగ్గిస్తుంది:

12. అనీమియా తగ్గిస్తుంది:

గర్భిణీ స్త్రీలకు ఐరన్ చాలా అవసరం అవుతుంది, హీమోగ్లోబిన్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచడానికి ఐరన్ అవసరం అవుతుంది కాబట్టి, జామకాయ తినడం ద్వారా ఐరన్ గ్రహించవచ్చు.

13. క్యాల్షియం ఎక్కువ:

13. క్యాల్షియం ఎక్కువ:

గర్భధారణ సమయంలో ఐరన్ తో పాటు క్యాల్షియం కూడా అవసరం అవుతుంది. జామకాయ క్యాల్షియంకు న్యాచురల్ సోర్స్, దీన్ని ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

14. మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:

14. మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:

జామకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది మార్నింగ్ సిక్ నెస్ ను కంట్రోల్ చేస్తుంది. వికారంగా అనిపించినప్పుడు వెంటనే జామకాయను తినడం ప్రారంభించండి.

English summary

Amazing Health Benefits Of Eating Guava During Pregnancy

It doesn’t matter if it is semi-ripe or fully ripe, crunchy, or smooth. A guava is sweet and tasty either way, and those who love the fruit wouldn’t mind having it every day, especially because of its health benefits.