For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఒత్తిడిని మరియు ఆందోళనను నియంత్రించటం ఎలా ?

|

మహిళలు ఈ రోజుల్లో చాలా రకాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వారి యొక్క ఇంటి బాధ్యతలతో పాటు, ఇటు ఉద్యోగ బాధ్యతను చాలా తేలికగా నిర్వహిస్తున్నారు. వాటి ఫలితంగా మహిళలు చాలా ఒత్తిడితో కూడిన జీవనశైలిని కలిగి వున్నారు. కానీ గర్భధారణ సమయంలో ఒత్తిడిని కలిగి ఉండటం వల్ల, కడుపులో ఉన్న పిండానికి హానిని కలిగించవచ్చు.

ముఖ్యంగా మొదటి సారి తల్లికాబోతున్న మహిళలకు గర్భధారణ అనేది చాలా ఆనందకరమైన దశ. ఇది మహిళలలో ఒక సంతోషకరమైన భావనను కూడా కలిగిస్తుంది. ఇది వారి జీవితంలో ఎదురయ్యే మరొక దశ మరియు వారి జీవితంపై సుమారుగా 20 సంవత్సరాల వరకు పూర్తి ఆధారపడే ఉన్న ఒక యువకుడి కి వచ్చి చాలా జాగ్రత్తగా మసలుకోవడం అనేది అధికంగా ఉంటుంది.

పూర్తిస్థాయిలో తల్లిగా ఉండటమనేది సంతృప్తికరమైన స్థాయి కలిగిన ఉద్యోగమని చెప్పవచ్చు. మీ చిన్నోడు మొదటిసారిగా మిమ్మల్ని "అమ్మ" అని పిలిస్తే కలిగే సంతోషాన్ని వేరే దేనితోనూ పోల్చలేము, అలాగే గందరగోళ పరిస్థితుల మధ్య వాళ్ళు నిద్రపోతున్న తీరుని చూస్తే మీ మనసుకి కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. కానీ మీరు ఇలాంటి అనుభూతులను పొందాలనుకుంటే, మీ గర్భధారణ యొక్క చిట్టచివరి దశ వరకూ వెళ్ళాలి.

How To Manage Stress And Anxiety During Pregnancy

ప్రతి స్త్రీ ఒక్కొక్క భిన్నమైన రీతిలో గర్భధారణ అనుభవాన్ని కలిగి ఉంటుంది. కానీ వారు ఈ సమయంలోనే అధికమైన ఒత్తిడిని మరియు ఆందోళనను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలామంది మహిళలు, ఒత్తిడికి గురయ్యారన్న వాస్తవాన్ని పట్టించుకోరు. అయితే, గర్భధారణ సమయంలో అధికంగా ఉన్న ఒత్తిడి, పిండంపై తీవ్ర ప్రభావం చూపగలదని పరిశోధకులు తెలియజేసారు.

గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి చాలా సాధారణమైనదిగా ఉంటుంది కానీ, అది నియంత్రణలో ఉండాల్సిన అవసరం ఉంది. గర్భిణీ స్త్రీలు అనేక కారణాల వలన ఒత్తిడికి గురౌతారు. త్వరలో వారు కొత్తగా చేపట్టే మాతృత్వ బాధ్యతలు కోసం ఎదురుచూస్తూ ఉండటము (లేదా) ఇంట్లో నిరంతరంగా ఉండే సమస్యలు కావచ్చు.

కొంతమంది మహిళల్లో పుట్టబోయే బిడ్డ గురించి మరియు ఎదుర్కోబోయే పురిటి నొప్పులు గురించి కొంత ఒత్తిడిని కలిగి ఉంటారు. మీరు గర్భధారణ సమయంలో కూడా కార్యాలయంలో పని చేస్తే, కలిగే ఒత్తిడి మీ పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపవచ్చు.

మీరు అధికమైన ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం నుండి హార్మోన్లు అనేవి ఎక్కువ ప్రభావానికి లోనవుతాయి, ఇవి ముందస్తు గర్భస్రావాన్ని కూడా ప్రేరేపించేవిగా ఉంటాయి.

మితిమీరిన ఒత్తిడి మీ యొక్క రక్త స్థాయిలను అసాధారణమైన రీతిలో ఉంచుతుంది, దీనివల్ల మీ కడుపులో ఉన్న పిండం భారీ ప్రమాదానికి గురికావచ్చు. మందులు గానీ మీ రక్తపోటును తగ్గించటంలో సహాయపడకపోతే, మీ శిశువు యొక్క జీవితానికి పెద్ద ప్రమాదంగా మారి, సిజేరియన్కు దారితీస్తుంది.

ఇవన్నీ కూడా గర్భధారణ సమయంలో మీరు అధికమైన ఒత్తిడి మరియు ఆందోళనలకు గురవటం వల్ల జరుగుతుంది, అలాంటి పరిస్థితుల్లో, మీరు సరైన రీతిలో వ్యవహరించడం చాలా ముఖ్యం.

దీని ఎదుర్కొంటున్నారా లేదా అనేది మీకు తెలియకపోతే, ఇక్కడ సూచించబడిన కొన్ని గమనికలు ఒత్తిడి మరియు ఆందోళనలను గుర్తించడంలో మీకు సహాయ పడతాయి. అవేమిటంటే,

నిద్రను మరియు ఆకలిని కోల్పోవడం,

తరచుగా తలనొప్పి రావడం,

అధికమైన బద్ధకం,

ఇబ్బందికరమైన మానసిక స్థితిలో ఉండటం,

ఆత్మన్యూన్యతతో బాధపడటం.

ఈ లక్షణాలలో కొన్నింటిని మీరు ఎదుర్కొంటుంటే, వాటన్నింటిని వదిలివేసి, విశ్రాంతిని తీసుకోవాలి. ఎల్

గర్భధారణ సమయంలో ఎదురైనా ఒత్తిడిని మరియు ఆందోళనను నియంత్రించడానికి క్రింద తెలిపిన ఈ మార్గాలను అనుసరించాలి. అవి

1) మీకు నచ్చే విషయాలను ఎక్కువగా చెయ్యాలి :

1) మీకు నచ్చే విషయాలను ఎక్కువగా చెయ్యాలి :

మీరు మీ ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్న వ్యక్తిగానీ అయితే, మీ గర్భధారణ సమయంలో వెనకవైపు సాగి కూర్చుని, సంగీతాన్ని వినడం (లేదా) పుస్తకాన్ని చదువుతూ విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరంలోని సంతోషకరమైన హార్మోన్ను పెంచుతుంది, ఇది మీ శిశువుకు మరియు మీకు కూడా చాలా మంచిది.

2) ధ్యానం చేయండి:

2) ధ్యానం చేయండి:

గర్భధారణ సమయంలో ధ్యానం చేయడం వల్ల, మీ శరీరంలో ఉన్న ఒత్తిడి స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది అలాగే హృదయ స్పందనను మరియు రక్తపోటును కూడా స్థిరమైనదిగా చేస్తుంది. చాలా చీకటి ఉన్న గదిలో, ప్రతిరోజు కనీసం అరగంట వరకూ ధ్యానం చేయండి. ఇది జననానికి-సంబంధించిన ఇతర సమస్యలను 90% పైగా తగ్గిస్తుంది.

3) మీ శరీరాన్ని అంగీకరించండి:

3) మీ శరీరాన్ని అంగీకరించండి:

చాలామంది మహిళలు వారి శరీరంలో జరుగుతున్న మార్పులను, అనగా వారు తీవ్రంగా పొందుతున్న బరువు గురించి, మరియు వారి యొక్క ఆకారాన్ని గూర్చి చింతిస్తూ, మళ్లీ తిరిగి సాధారణమైన స్థితికి ఎప్పుడు చేరుకుంటామో అని ఆలోచిస్తూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. గర్భధారణ అనేది మీ శరీరంలో చాలా రకాల ఒత్తిడిలను ఉంచుతుంది. డెలివరీ తర్వాత మీరు ఖచ్చితంగా మీ అసాధారణమైన బరువును కోల్పోతారు, అయితే మీరు ఇలా గర్భధారణకు ముందుగానే అంచనా వేయడం చాలా పెద్ద తప్పు.

ఈ వాస్తవాన్ని మీరు గ్రహించినట్లయితే, మీ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ బిడ్డ దృష్టిలో మీరే చాలా అందమైన వ్యక్తిగా ఉంటారు.

4) మీరు ఒమేగా-3 ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి:

4) మీరు ఒమేగా-3 ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి:

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహారం మీలో చురుకుదనాన్ని పెంచుతోంది. ఇది శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగపడే ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లాన్ని ఎక్కువ స్థాయిలో పెంచుతుంది. ఈ హార్మోన్ మీరు మంచిగా నిద్రించేలా చేసి, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి దోహదపడుతుంది.

5) మీ భావాలను పంచుకోండి:

5) మీ భావాలను పంచుకోండి:

మీ భర్తతో గాని, స్నేహితులతో గానీ, మీ భావాలను పంచుకోవడం వల్ల, మీకు మరింత విశ్రాంతిని కలుగజేయడంలో సహాయపడగలదు, మీరు ఏ విధమైన ఆలోచనను చేస్తున్నారో అని అంచనా వేయడంలో మీ వాళ్లకు ఇది సహాయపడుతుంది. అలా వారు మీలో విశ్వాసాన్ని పెంచి, మీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడానికి ఇది బాగా సహాయపడుతుంది.

6) ఎక్కువగా నిద్రించండి:

6) ఎక్కువగా నిద్రించండి:

నిద్రించడం వల్ల, ఒత్తిడి స్థాయిలను తగ్గించే హార్మోన్లను మీ శరీరం సృష్టిస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచూ అలసిపోయి, నిద్రిస్తుంటారు. మీ శరీరం నిద్రకు ఉపక్రమించినట్లయితే, మీరు దానినే అనుసరించండి. నిద్ర అనేది మిమ్మల్ని ఉత్తేజపరచి, మీకు కావలసిన శక్తిని అందిస్తుంది.

7) మీ శిశువుతో మాట్లాడండి :

7) మీ శిశువుతో మాట్లాడండి :

మీ శిశువు, 23 వారం నుండి మీరు చెప్పే విషయాలను వింటుందని మీకు తెలుసా ? అవును, అది నిజమే ! మీరు ఆహ్లాదభరితమైన సంగీతాన్ని వినడం (లేదా) మీ శిశువుతో మాట్లాడటం వంటివి చెయ్యడం వల్ల, మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. కడుపులో ఉన్న మీ శిశువు యొక్క కదలికలు మీకు విశ్రాంతిని కలుగజేస్తూ, ఒత్తిడితో కూడిన ఆలోచనలకు దూరంగా వుంచుతూ, మీ బిడ్డపైనే ప్రత్యేకమైన దృష్టిని ఉంచేలా చేస్తుంది.

8) పనిని వదిలేయండి:

8) పనిని వదిలేయండి:

మీరు చాలా ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని కలిగి ఉంటే, గర్భధారణ సమయంలో దానిని వదిలేయాలని మీ డాక్టర్ సలహా ఇస్తారు, ఎందుకంటే ఉద్యోగం వల్ల కలిగే ఒత్తిడి మీ శిశువు పైన మరియు మీపైన చాలా తీవ్రంగా పడుతుంది కాబట్టి. ముఖ్యంగా చెప్పాలంటే, మీకు మీ శిశువు కంటే ఏదీ ముఖ్యమైనది కాదు.

9) నిజాలను తెలుసుకోండి:

9) నిజాలను తెలుసుకోండి:

పురిటి నొప్పులకు సంబంధించి ఇతరులు చెప్పే కథనాలను వినడం (లేదా) గర్భధారణ సమయంలో ఎదురయ్యే పరిస్థితుల గూర్చి ఇతరులు చెప్పే విషయాలను తెలుసుకోవడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురి కాగలరు. ఇతరులు చెప్పే బాధాకరమైన అనుభవాలను వినడానికి బదులుగా, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమాచారాన్ని వెతికి చదవండి. ఎలాంటి నొప్పి లేకుండా డెలివరీ జరగదు అనే విషయాన్ని ముందుగా తెలుసుకొని, మీ డాక్టర్ తో సంప్రదింపులు జరపడం వల్ల మీ మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.

10) సహాయం పొందండి:

10) సహాయం పొందండి:

వారికి జన్మించిన పిల్లల పట్ల - జాగ్రత్తలను వహించే విషయంలో చాలామంది తల్లులు ఒత్తిడికి గురవుతారు. అలాంటి సందర్భంలో, మీ నవజాత శిశువును జాగ్రత్తగా చూసుకోవటానికి, ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి యొక్క సహాయం మీకు కావాలి. ఇది మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీకు మరియు మీ శిశువుకు మధ్య ఉన్న సమతుల్యతను బాగా నిర్ధారిస్తుంది. మీ శరీరం కూడా డెలివరీ తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా సమయం అవసరమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి, కాబట్టి మీకు కావలసిన అన్ని రకాల సహాయములను ఇతరుల నుంచి తప్పక పొందండి.

English summary

How To Manage Stress And Anxiety During Pregnancy

Stress during pregnancy is common but it needs to be kept under control. Pregnant women experience stress for a number of reasons. It can be because of the new role of motherhood that is soon awaiting them or some issues at home. Learn these simple tricks to keep stress under control during pregnancy
Desktop Bottom Promotion