For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ను ఎలా నివారించాలి ?

|

గర్భధారణ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడటమనేది చాలా బాధాకరమైన అనుభవము. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైనది, బాధాకరమైనది (లేదా) కొన్నిసార్లు ఇది చాలా మొండిదైనది కూడా కావచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి గల సంకేతాలు ఎరుపుదనం, వాపు, దురదలు, మంటలు & వైట్ డిస్చార్జ్ అవ్వడం.

కారణమేదైనా గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్ మీకు & మీ శిశువుకు ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి మీ డెలివరీకి ముందుగా దీనికి చికిత్సను అందించడమనేది చాలా ముఖ్యం. లేకపోతే, మీ శిశువు దాని చేత ప్రభావితమవుతుంది. మీ గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కు తగిన చికిత్స మార్గాలను ఈ క్రింద సూచించడం జరిగింది.

How to treat fungal infection during pregnancy

ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించగలిగే ఇంటి చికిత్సా మార్గాలు !

1. చమోమిలే :

1. చమోమిలే :

కాండిడా (ఈతకల్లు) కు కారణమైన ఫంగస్ పెరుగుదలను నివారించడంలో చమోమిలే అధికమైన పనితీరును కలిగి ఉంటుంది. ఇది మీ గర్భానికి పూర్తి సురక్షితంగానూ, మృదువైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు చమోమిలే సమ్మేళనాలను కలిగిన పదార్థాలను తీసుకోవచ్చు (లేదా) ఒక కప్పు చమోమిలే టీని కూడా తాగవచ్చు. మీ గర్భధారణ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించగలిగే అత్యంత ప్రభావవంతమైన ఇంటి చికిత్సలలో ఇది ఒకటి.

2. వెల్లుల్లి :

2. వెల్లుల్లి :

ఇది కేవలం మసాలాగా ఉపయోగించే ఒక పదార్థం మాత్రమే కాదు, దానిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా ఇది చాలా ప్రసిద్ధి పొందింది. వెల్లుల్లిలో ఉండే యాంటీ-ఫంగల్ లక్షణాల కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణ చికిత్సలో బాగా ఉపయోగిస్తారు. వెల్లుల్లి అనేది ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా పోరాడే సహజసిద్ధమైన పదార్థంగా ఉండటమే కాకుండా, మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది కూడా కాండిడా (ఈతకల్లు) కు కారణమైన ఫంగస్ పెరుగుదలను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది.

మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించిన వెంటనే, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దానిపై తొక్కను తొలగించి, ఇన్ఫెక్షన్కు గురైన యోని ప్రాంతంలో దీనిని ఉంచండి. ఈ విధంగా మీరు రాత్రివేళల్లో పడుకునే ముందు చేసి, మరుసటి రోజు ఉదయాన్నే దానిని తొలగించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురైన ప్రారంభ దశలోనే మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని సత్వరంగా నివారించే వీలుంటుంది. ఈ పద్ధతిని 1-2 రాత్రుల వరకూ రిపీట్ చేయండి. పచ్చి వెల్లుల్లి వాసనను అసహ్యించుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఉండే వెల్లుల్లి సప్లిమెంట్స్ను ఉపయోగించవచ్చు.

3. యోగర్ట్ (పెరుగు) :

3. యోగర్ట్ (పెరుగు) :

యోగర్ట్లో లాక్టోబాసిల్లస్ అసిడోఫైలస్ అని పిలవబడే ఒక బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సిద్ధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ను చికిత్స చేయడంలో బాగా సహాయపడుతుంది. మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ను దూరంగా ఉంచడానికి మీ ఆహారంలో భాగంగా యోగర్ట్ను ఉంచండి. మరొక పద్ధతిలో కొద్ది మొత్తంలో పెరుగును టాంపోన్లోకి తీసుకొని, దానిని మీ యోని లోనికి చేర్చండి చాలు. మరి కొంతమంది స్త్రీలు పెరుగును ఒక సిరంజిలోకి సేకరించి, దానిని వారి యోనిలోనికి ప్రవేశపెట్టడం చేస్తారు.

గర్భధారణ సమయంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అరికట్టేందుకు ఉత్తమమైన, సురక్షితమైన పద్ధతి ఏమిటంటే, మీ యోనిలోకి పెరుగును పంపించడానికి సులభంగా చొప్పించగల సన్నని పైప్సిల్స్ తయారు చేయాలి. ఇలా గడ్డకట్టుకున్న పైప్సిల్స్ మీ యోనిని ఉపశమనపరచి, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వాపులను & చికాకుల నుంచి పూర్తిగా ఉపశమనమును కలిగిస్తుంది. అందుకోసం మీరు సాధారణమైన పెరుగును మాత్రమే వాడాలి. తియ్యగా & ఫ్లవర్స్ కలిసిన పెరుగును ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి మీ వాపులను & ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క పెరుగుదలను పెంచుతాయి.

4. ఆపిల్ సైడర్ వినెగర్ :

4. ఆపిల్ సైడర్ వినెగర్ :

మీరు నిరంతరము ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే ఆపిల్ సైడర్ వినెగర్ ఉత్తమమైన చికిత్స మార్గంగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ ఒక యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, & యాంటీ వైరల్ ఏజెంట్గా ఉంటూ, ఒక స్పాంజ్ వలె పనిచేస్తూ, సమీపంలోని కణజాలాల నుండి విడుదల కాబడే విష వ్యర్ధాలను & జెర్మ్స్ను పీల్చి సేకరిస్తుంది. ఆపిల్ సైడర్లో ఎసిటోలిసిస్ను ప్రేరేపించే లక్షణాలను కూడా కలిగి ఉంది, ఇది ప్రమాదకారిగా ఉన్న అన్ని విషక్రిములను విచ్ఛిన్నం చేసి, మిమ్మల్ని మరింతగా రక్షిస్తాయి.

ఒక చిన్న పెరి బాటిల్ను తీసుకొని, 2 టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వినెగర్ను తీసుకోండి. మిగిలిన బాటిల్ను నీటితో పూర్తిగా నింపండి. మీ బాత్రూంలో ఈ బాటిల్ను ఉంచండి. ఇన్ఫెక్షన్కు గురైన ప్రాంతాలను బాగా తుడిచిన తర్వాత, మీ యోని వెలుపల ఈ వెనిగర్ను వెదచల్లడం చాలా మంచిది. ఆ ప్రాంతం మొత్తం పొడిగా మారేలా చూసుకోండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు పూర్తిగా తగ్గేంతవరకు కనీసం 1 - 2 వారాల పాటు ఈ పరిష్కార మార్గాన్ని అనుసరించండి.

5. కొబ్బరినూనె :

5. కొబ్బరినూనె :

కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్, కాప్రిలిక్ ఆమ్లం & కాప్రిక్ యాసిడ్ ఉన్నాయి; వీటిలో యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ది చెందిన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్నాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ను నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాలు మీ శరీర కణాలపై ఉండే రక్షిత పొరల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి, అలా ప్రవేశించిన వీటివల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ, ఈ కొవ్వు ఆమ్లాలు అలా ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురైన కణము యొక్క పొర ద్వారా కణాన్ని చేరుకుని, కణాలను మరింత బలహీనంగా మరెలా చేసి, పూర్తిగా కణాన్ని నశింపజేస్తుంది, ఇలా ఇది దెబ్బతిన్న కణాలను క్లియర్ చెయ్యడానికి ఆ ప్రాంతంలో తెల్ల రక్త కణాలు ఏర్పడతాయి.

అందువలన, మీరు గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయాలనుకున్నప్పుడు, మీరు వండే ఆహార పదార్థాలలో కొబ్బరినూనెను ఉపయోగించడం చాలా ఉత్తమమైన మార్గం. మరొక ప్రత్యామ్నాయం కాప్రిలిక్ యాసిడ్ను కలిగి ఉండే క్యాప్సూల్స్ను తీసుకోవడమే. అయితే, మీ గర్భధారణ సమయంలో ఏదైనా ఔషధాలను వాడే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

6. షుగర్ వినియోగాన్ని తగ్గించండి :

6. షుగర్ వినియోగాన్ని తగ్గించండి :

సహజమైన మార్గంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను చికిత్స చేయడం కోసం మీరు షుగర్ తీసుకోవడాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు చక్కెరను కలిగిన పదార్ధాలను తినేటప్పుడు మీరు కాండిడాకు కారణమైన ఫంగస్ను ఆహ్వానిస్తున్నారని అర్థం. అందువలన, మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే, మీ చక్కెర వినియోగాన్ని తగ్గించడం చాలా అవసరం.

English summary

How to treat fungal infection during pregnancy

Pregnant women tend to contract fungal infection during pregnancy. This can, however, be treated with home remedies. One of them is chamomile. Chamomile is supposed to have the quality to slay the overgrowth of candida. It is completely safe in your pregnancy and it also has a very soothing effect. Other remedies include yogurt, garlic, coconut oil, etc.
Story first published: Wednesday, July 11, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more