గర్భధారణ సమయంలో ప్రసూతి కి ముందు విటమిన్లను వాడటం ఖచ్చితంగా అవసరమా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సాధారణంగా గర్భం ధరించిన స్త్రీలు, తమ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఉత్తమమైన పోషకాలను అందించాలని భావిస్తారు. అందుకోసం సమతుల్యమైన ఆహారాన్ని కూడా తీసుకుంటారు. అవసరమైన విటమిన్లను, ఖనిజాలను మరియు ప్రోటీన్లను తీసుకొని హానికరమైన ఆహారాలకు దూరంగా ఉండి, ఇలా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ గర్భధారణ స్త్రీలు ఆహారాన్ని తినటం జరుగుతుంది. ఆ తొమ్మిది నెలల పాటు తల్లి మరియు వారి యొక్క కుటుంబం, కడుపులో పెరుగుతున్న బిడ్డకు సాధ్యమైనంత మేర అన్ని పోషకాలను తల్లి ద్వారానే అందజేయాలని భావిస్తారు. ఇలా చేయడం ద్వారా శక్తివంతమైన మరియు ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడం జరుగుతుంది.

వీటికి తోడుగా గర్భిణులు ప్రసూతి ముందు విటమిన్ల మాత్రలను తీసుకోవచ్చు. ఇవి, తీసుకోవాల్సిన ఆహారానికి ప్రత్యామ్యాయం కాదు. కానీ, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కొన్ని అదనపు పోషకాలను అందించడానికి మరియు బిడ్డకు అవసరమైన పోషక విలువలను పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటినే ఆంగ్లంలో ప్రినాటల్ విటమిన్స్ అని అంటారు. ఈ ప్రసూతి విటమిన్ల మాత్రలను గర్భానికి ముందు మరియు గర్భధారణ సమయంలో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా బిడ్డపుట్టిన తర్వాత పాలు ఇచ్చే సమయంలో కూడా వీటిని తీసుకోవచ్చు.

prenatal vitamins during pregnancy care

ఈ ప్రసూతి విటమిన్ మాత్రలు సాధారణ విటమిన్ మాత్రలకు పోలినట్లుగా ఉంటాయి. కాకపోతే, ఇందులో నిర్దిష్టమైన పోషకాలు ఏవైతే గర్భవతి అయిన స్త్రీకి మరియు ఇంకా జన్మించనటువంటి బిడ్డకు కావాలో అవి కూడా ఇందులో ఉంటాయి. కానీ, చాలామందికి వీటి గురించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రసూతి విటమిన్లను గర్భధారణ సమయంలో వేసుకోవచ్చా ? మరియు ఒకవేళ వేసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు ఏమైనా ప్రమాదమా ? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి.

గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుస్తుంది:

గర్భం ధరించే స్త్రీలకు చిట్కాలు చెప్పాల్సి వస్తే, అందులో భాగంగా గర్భం దాల్చాలనుకుంటే అందుకోసం ఈ ప్రసూతి విటమిన్ మాత్రలు వాడమని చెబుతూ ఉంటారు. ఈ విటమిన్లు ఏవైనా పోషకాలు తక్కువగా ఉంటే, వాటిని శరీరానికి అందిస్తాయి మరియు గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుస్తాయి.

ప్రత్యేకంగా గర్భం దాల్చే సమయంలో :

తీసుకోవాల్సిన ఆహారంలో భాగంగా గర్భం దాల్చిన స్త్రీలు ప్రసూతి విటమిన్లను వాడాల్సిందిగా చిట్కాల్లో చెబుతుంటారు. ఎందుకంటే, ఇవి అదనపు పోషకాలను అందించడంలో ఉపయోగపడతాయి మరియు పుట్టబోయే పెరుగుతున్న బిడ్డతో పాటు, ఆ బిడ్డను మోస్తున్న తల్లికి కావాల్సిన పోషక విలువలు కూడా అందిస్తాయి.

కీలకమైన పోషకాలు :

ప్రసూతి విటమిన్ మాత్రల్లో అతి ముఖ్యమైన ఫోలిక్ ఆమ్లం మరియు ఇనుము లాంటి పోషకాలు ఉంటాయి. గర్భం దాల్చిన స్త్రీలు ఈ విటమిన్ మాత్రలను వాడాలని చాలామంది సలహా ఇస్తుంటారు. ఎందుకంటే, గర్భం దాల్చే స్త్రీలు తీసుకున్న ఆహారంలో అవసరమైన మేర ఇనుము మరియు ఫోలిక్ ఆమ్లం లభించదు.

ఆహార నిబంధనలు :

ప్రసూతి విటమిన్ మాత్రలను గర్భధారణ సమయంలో వాడటం వల్ల స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే, శాకాహారం మాత్రమే తింటారో మరియు పాల ఉత్పత్తలు పెద్దగా పడవో అటువంటి వారికి ఈ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా ఆహారంలో ఎటువంటి పోషకాలు అయితే అందుతాయో, ఆ పోషకాలన్నింటిని ఈ మాత్రలు అందించడం జరుగుతుంది.

కవల పిల్లల సమస్య :

మీకు గనుక ఒకే కాన్పులో కవలా పిల్లలు లేదా అంతకు మించి పుడుతుంటే, అటువంటి సమయంలో ఈ ప్రసూతి మాత్రలు గర్భం ధరించిన సమయంలో వేసుకోవడం మంచిది అని సలహా ఇస్తున్నారు. కడుపులో పెరుగుతున్న రెండు పిండాలకు సరైన మోతాదులో మీరు తీసుకున్న ఆహారం ద్వారా పోషకాలు అందించడం కష్టతరం అవుతుంది మరియు ఇలాంటి సమయంలో ఈ ప్రసూతి మాత్రలను దేవుడే పంపాడేమో అని అనిపిస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార మోతాదులో ఎంపికలు :

గర్భధారణ సమయంలో ఈ ప్రసూతి మాత్రలు ఎంపిక చేసి మోతాదుకు అనుగుణంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద మాత్రలను మింగాలంటే, చాలామంది స్త్రీలు గర్భధారణ సమయంలో విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇవి ద్రవరూపంలో గాని లేదా నమిలే మాత్రల రూపంలో గాని ఇవి లభిస్తాయి.

మీకు ఏమి లభించదు :

గర్భధారణ సమయంలో వాడే ప్రసూతి మాత్రలు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి అని మాత్రం అనుకోవద్దు. అసలు నిజం ఏమిటంటే, ఆ మాత్రల్లో క్యాల్షియం, విటమిన్ డి మరియు ఫాటీ యాసిడ్లు, గర్భ ధారణ సమయంలో అవసరమైన మేర ఇవి సమకూర్చలేవు.

వైద్యుడ్ని సంప్రదించండి :

గర్భధారణ సమయంలో మీరు గనుక ఈ ప్రసూతి మాత్రలను వాడాలి అని అనుకున్నట్లైతే, ఒకసారి మీ వైద్యుడ్ని సంప్రదించి వారి యొక్క సలహాలను మరియు సూచనలను తీసుకోండి. ఇవే కాకుండా గర్భధారణ సమయంలో ఏ ఇతర మందుని తీసుకోవాలని మీరు భావించిన అటువంటి సమయంలో ఖచ్చితంగా డాక్టర్ రాసిన చీటీని తీసుకెళ్లి మందులు కొనుక్కోవడం మంచిది.

English summary

Prenatal Vitamins During Pregnancy | Pregnancy Tips For Women | Vitamins In Pregnancy

A pregnant woman tries to give the growing child in her womb the best of nutrients through her own diet. She gives great care to eat all the required vitamins, minerals and proteins while avoiding foods that are harmful. For those nine months she and her family run around trying to provide everything to the baby through its mother, which will ensure a strong and healthy child.