For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గర్భధారణ సమయంలో నిద్రలేమికి గల కారణాలు !

  |

  గర్భిణీ స్త్రీలు వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి, మరియు సన్నిహితుల నుండి అందుకునే అత్యంత సాధారణమైన సలహా ఏమిటంటే, ఆమెన్ వీలైనంత త్వరగా నిద్రపోమ్మని చెబుతారు. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

  ఎందుకంటే, మీ గర్భధారణ సమయంలో మీ శరీరంలో చోటుచేసుకునే మార్పుల యొక్క భయానక పరిణామాలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇది మీ కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యకరంగా పెరుగుదలను కలగ చెయ్యడమే కాక మరియు ఒత్తిడి నుండి మీకు ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడుతుంది. అలాగే, మీ శిశువు ఈ లోకంలోకి అడుగుపెట్టిన తర్వాత, రాత్రిపూట మంచి నిద్రావస్థకు మీరు "గుడ్ బై" చెప్పాలి.

  sleep problems during pregnancy | reasons why women don't sleep properly during pregnancy

  గర్భధారణ సమయంలో ఎక్కువగా నిద్రించడమనేది చాలా మంచిదని అందరు ఇచ్చే సలహాలను, పాటించడం చాలా సులభం. ఒక గర్భిణి సమయంలో చాలా హాయిగా నిద్రించగలిగినట్లైతే, ఆమె చాలా అదృష్టవంతురాలని చెప్పవచ్చు. కానీ గర్భిణీలు అలాంటి సమయంలోనే మంచి నిద్ర వర్తన పొందడానికి చాలా రకాల సమస్యలను కలిగి ఉంటారు. అందువల్ల వారు సుఖంగా నిద్రపోలేరు.

  ఈరోజు మనం, గర్భిణీ స్త్రీలు నిద్రపోయేటప్పుడు వారికి ఎదురయ్యే వివిధ రకాల సమస్యలను గూర్చి చర్చించబోతున్నాము. ఈ సమస్యలు "గుండెలో మంట" నుంచి ప్రారంభమయి - "స్లీప్ అప్నియా" వరకూ ఉంటాయి. ఇలా ఎదురైన సమస్యలను ఎలా అధిగమించాలో అనే విషయాల గురించి మనము చర్చించుకోబోతున్నాము.

  1) మూత్రవిసర్జన ఎక్కువగా అవుతుంది :

  1) మూత్రవిసర్జన ఎక్కువగా అవుతుంది :

  మీరు గర్భవతిగా ఉంటే, తరచుగా సంభవించే మూత్రవిసర్జనకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది గర్భిణి యొక్క మూడవ త్రైమాసికంలో చాలా సాధారణంగా ఎదురయ్యే పరిస్థితిగా కనిపిస్తుంది.

  గర్భవతులలో, hCG హార్మోన్ చాలా అధికమైన స్థాయిలో ప్రేరేపించబడటంతో వారు ఎక్కువగా మూత్ర విసర్జనను కలిగి ఉంటారు. వీరు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా బాత్రూంను వాడవలసిన ఉంటుంది.

  వీరు ఈ విధంగా అధిక మూత్ర విసర్జనను కలిగి ఉండటానికి మరొక కారణం, మూత్రపిండాలు సాధారణ స్థాయికన్నా 50 శాతం ఎక్కువగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కాబట్టి వీరిలో మూత్రవిసర్జన అనేది రెండింతలుగా ఉంటుంది.

  మహిళల్లో గర్భం అనేది అభివృద్ధి చెందుతున్నప్పుడు, పెరుగుతున్న గర్భాశయం కారణంగా మూత్రమును నిల్వచేసే మూత్రాశయాన్ని మరింత చిన్నదిగా కుదించబడుతుంది. దీని వల్ల మూత్రాశయంలో మూత్రమును నిల్వ చేయడానికి చాలా తక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మీరు తరచుగా మూత్రవిసర్జనను చెయ్యాల్సి వస్తుంది.

  ఈ సమస్యను పరిష్కరించడం ఎలా :-

  గర్భిణులు ఎక్కువగా తీసుకుని ద్రవపదార్ధాలను రోజులో సగభాగం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రుళ్లు నిద్రించే ముందు తక్కువ ద్రవపదార్థాలను తీసుకోవాలి. అయినప్పటికీ, మీరు రాత్రివేళల్లో కనీసం రెండుసార్లు బాత్రూంకి వెళ్ళాల్సి వస్తుంది.

  మీ బాత్రూమ్లో తక్కువ కాంతిని కలిగి ఉండే బల్బును అమర్చండి, దీనివల్ల మీరు గాయపడకుండా ఉండగలరు. మీ బాత్రూమ్లో సాధారణమైన లైట్ను అమర్చడం వల్ల తిరిగి మీరు నిద్ర పోవడానికి ఇబ్బందిని కలిగిస్తాయి.

  2) అసౌకర్యంగా ఉండటం :

  2) అసౌకర్యంగా ఉండటం :

  అసౌకర్యం అనేది గర్భిణీ స్త్రీలు అనుభూతి చెందే ఒక స్థిరమైన భావనగా ఉంది. ఇది గర్భధారణ జరిగిన 2వ - 3వ త్రైమాసికాలలో ప్రత్యేకంగా వర్తిస్తుంది.

  గర్భిణీ స్త్రీలకు నిద్రపోయేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి వేరొక మార్గము లేదు. వీపును మంచానికి ఆన్చి పడుకునే వారికి ఇచ్చే సలహా ఏమిటంటే, గర్భిణీలు ఎల్లప్పుడూ కూడా ఎడమచేతి వైపు తిరిగి నిద్రించడం చాలా మంచిది. ఈ రకమైన స్థితిలో పడుకోవటం గర్భిణులకు చాలా కషుకోవటం గర్భిణులకు చాలా కష్టంగా ఉంటుంది.

  గర్భిణులు వెనుకవైపుగా నిద్రపోవడం అనేది చాలా హానికరంగా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి స్థితిలో నిద్రించడం వల్ల, గర్భం మరియు శిశువు మీ శరీరంపై ఒక్కసారిగా ఒత్తిడిని పెంచుతుంది, దీని వల్ల రక్తాన్ని సరఫరా చేసే సిరలపై భారం ఏర్పడి, శరీర కింద భాగం నుండి గుండెకు ప్రసరించే రక్తములో ఆటంకం ఏర్పడుతుంది.

  ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలా :-

  మీరు ఓ పక్క వైపుకు తిరిగి నిద్ర పోవటం వల్ల మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల మీ యొక్క ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ఈ స్థితిలో పడుకోవటం మీ శిశువుకు కూడా చాలా సురక్షితంగా ఉంటుంది.

  మీరు ఈ విధంగా నిద్రిస్తే, మీరు తక్కువ శ్వాసక్రియను కలిగి ఉండటాన్ని నిర్థారిస్తుంది, అలాగే మీ మూత్రపిండాలు కూడా చాలా సాధారణంగా పనిచేస్తాయి. మీరు మరింత సౌకర్యవంతంగా పడుకోవటం కోసం దిండ్లను కూడా ఉపయోగించవచ్చు.

  3) ఛాతిలో మంట :

  3) ఛాతిలో మంట :

  ఛాతిలో మంటను కలిగి వుండటమనేది, చాలామంది గర్భిణీ స్త్రీలు అనుభవిస్తున్న ఒక సాధారణమైన విషయం. ఇది రోజులో ఎపుడైనా మీకు ఎదురవ్వచ్చు, కానీ రాత్రి వేళల్లో మాత్రం ఇది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సమాంతరంగా పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అనేది తిరిగి మీకు రిఫ్లెక్ట్ అవుతోంది.

  గర్భధారణ సమయంలో విడుదలైన హార్మోన్లు - కడుపు లోపల ఉన్న స్ఫింకర్ కండరాలకు విశ్రాంతిని కలుగ చేయటం వల్ల ఇది జరుగుతుంది. ఇది కడుపులోని ఆమ్లాలను ఎక్కువగా ప్రేరేపించడం వల్ల అది మీ ఛాతిలో-మంటకు దారితీస్తుంది.

  ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలా :-

  ఎక్కువ ఆయిల్ను కలిగిన, కారంగా మరియు జిడ్డుగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడాన్ని తగ్గించండి. రోజంతా మీరు మిత-ఆహారాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. మీరు రాత్రిళ్లు నిద్రించడానికి 2 గంటల ముందే, రోజులో మీ చివరి భోజనాన్ని పూర్తి చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు దిండులను ఉపయోగించుకోండి. మీకు ఇంకా సమస్యగాని ఉన్నట్లయితే, త్వరగా మీ డాక్టర్ను సంప్రదించి, వారు సూచించిన మందులను వాడండి. అవి ఛాతీలో-మంట నుండి మిమ్మల్ని మరింత సురక్షితంగా ఉంచుతుంది.

  4) నిద్రలేమి సమస్య :

  4) నిద్రలేమి సమస్య :

  నిద్రలేమి అనేది మీకు ఏ సమయంలోనైనా ఎదురుకావచ్చు. గర్భధారణ సమయంలో మీ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు వల్ల గానీ, లేదా, ఆందోళన వల్ల గానీ నిద్రలేమి అనేది సంభవించవచ్చు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు మరియు ఇతర గర్భధారణ సమస్యలతో మీరు ఈ అదే స్థితిని ఎదుర్కొన్నప్పుడు మాత్రం మీకు చాలా విసుగును తెప్పిస్తుంది.

  ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలా :-

  మీరు నిద్రపోయే ముందు సరైన నియమావళిని కలిగి ఉండండి, రోజు ముగిసే చివరిలో అది మీకు సహాయం చేస్తుంది. ఆరోగ్యవంతమైన నిద్రను కలిగి ఉండటం వల్ల, అది మిమ్మల్ని మరింత ఆరోగ్యవంతులుగా చేస్తుంది. మీరు చాలా కాలం నుండి సరైన నిద్రను కలిగి ఉండకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించి, తగిన మందులను వాడి మీరు మరింత మెరుగైన నిద్రను పొందండి.

  5) కాళ్ళ తిమ్మిర్లు :

  5) కాళ్ళ తిమ్మిర్లు :

  చాలామంది గర్భిణీ స్త్రీలు 2వ - 3వ త్రైమాసికాలలో కాళ్ళ తిమ్మిరి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తిమ్మిర్లు ఎదురవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, అది కాళ్లల్లో ఉన్న రక్తనాళాలు సంపీడనానికి గురవుతోందని గ్రహించారు. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు అదనంగా ఉన్న బరువు కారణంగా ఇది సాధ్యపడవచ్చు. పగటిపూట కన్నా రాత్రి వేళ్ళలోనే ఇది సాధారణంగా గుర్తించబడుతుంది.

  ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలా :-

  కాల్షియం మరియు మెగ్నీషియంలో ఉన్న ఆహారమును తీసుకోవడం వల్ల, కాళ్ళకు వచ్చే తిమ్మిర్ల స్వభావాన్ని తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పాలు, పెరుగు, సోయ్ బీన్స్ మరియు అరటి వంటి ఆహారాలను తప్పక తీసుకోండి. మీకు మందులు గాని అవసరమైతే డాక్టర్ను అడగండి.

  నీటిని ఎక్కువగా త్రాగడం వల్ల, మీకు చాలా సహాయపడుతుంది. కొన్నిరకాల మందులు కూడా మీ కాళ్ళ తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. కాళ్ళ తిమ్మిర్లు మీకు తరచుగా గానీ సంభవించినట్లయితే, మీ డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించి నిర్థారించుకోండి, ఎందుకంటే, ఈ కాళ్ళల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు.

  English summary

  sleep problems during pregnancy | reasons why women don't sleep properly during pregnancy

  One of the most common advices that a pregnant woman receives from friends and family is that she must get as much sleep as possible. It helps them cope with the astounding amount of changes that the body undergoes during pregnancy. However, they may face problems like heartburn, insomnia, leg cramps, sleep apnoea and so on.
  Story first published: Wednesday, February 28, 2018, 13:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more