For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గర్భిణీ స్త్రీలలో ఎదురయ్యే ఒత్తిడిని నివారించడం ఎలా !

  |

  గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే లక్షణాలలో ఒత్తిడి ఒకటి. గర్భధారణ సమయంలో ఒత్తిడికి దారితీసే అనేక పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతాయి.

  అస్థిరమైన హార్మోన్ స్థాయిలు, భవిష్యత్తు గురించి వ్యథలు, శారీరక అసౌకర్యం మరియు ముందునుండి మానసికంగా కృంగిపోవడం వంటివి గర్భదారణలో ఎదురయ్యే ఒత్తిడికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు.

  మీరు ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పి, ఆకలి మందగించడం, నాడి వేగంగా కొట్టుకోవడం, పిచ్చిపిచ్చి ఆలోచనలతో పరధ్యానంగా ఉండిపోవడం వంటివి కలుగుతాయి. ఈ విధంగా గర్భిణీ నిద్రకు పూర్తిగా దూరం అయ్యేలా చెయ్యబడి, ఆమె తన శ్రేయస్సును కోల్పోతుంది. ఇలా జరగడం వల్ల తర్వాత దశలో అనేక సమస్యలు తలెత్తవచ్చు.

  treat stress in pregnancy

  దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ ఒత్తిడి వల్ల గర్భిణీలలో అధిక-రక్తపోటు మరియు గుండెజబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.

  ఇలా అధికమైన ఒత్తిడి గర్భిణీని ఏ విధంగా ప్రభావితం చేయకపోయినా, దాని యొక్క ప్రభావం మాత్రం శిశువు యొక్క అభివృద్ధిపై పడుతుందని ఒక కొత్త పరిశోధనలో బయటపడింది.

  ఏదేమైనప్పటికీ, ఒత్తిడిని తగ్గించే చికిత్సా విధానాలనేవి మందులపైన ఆధారపడేవిగా ఉన్నవి మాత్రమే కాకుండా, అనేక ఇతర మార్గాలు కూడా చాలానే ఉన్నాయి. అందువల్ల, ఈరోజు వ్యాసంలో గర్భిణీలలో ఎదురయ్యే ఒత్తిడిని పరిష్కరించుకోవడానికి ఉన్న సులభమైన మార్గాల గురించి జాబితాను తయారుచేసి, ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చింది - మీ బోల్డ్ స్కై !

  ఆందోళనను పెంచే విషయాలు :

  మీలో ఆందోళనను పెంచే విషయాలను గూర్చి తెలుసుకొనేందుకు ప్రయత్నించండి. దాని యొక్క మూలాలను గుర్తించడం వల్ల చికిత్స అనేది సులభంగా మారుతుంది. మీ చుట్టూ జరుగుతున్న విషయాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసినట్లయితే, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. "అంతా మనమంచికే" అనే సూత్రాన్ని మీరు సర్వదా పాటిస్తూ ఉండాలి !

  treat stress in pregnancy

  కాస్త విశ్రాంతిని తీసుకోండి :

  గర్భిణీలకు విశ్రాంతి అనేది ముఖ్యం. అలసట (లేదా) సరైన నిద్రను కలిగి ఉండకపోవడం వల్ల ఒత్తిడితో సహా ప్రతికూల భావోద్వేగాలను పెంచుతాయి. కాబట్టి, తగినంత నిద్రను పొందేటట్లుగా నిర్ధారించుకోండి.

  సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి :

  గర్భధారణ సమయంలో మంచి సమతుల్యమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించడమేకాక, గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యంతో పాటు శిశువు యొక్క ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

  treat stress in pregnancy

  వ్యాయామము చేయాలి :

  గర్భధారణలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కార్టిసోల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. కార్టిసాల్ అనేది ఒత్తిడిని మరియు ఆందోళనను కలిగించే ఒక హార్మోన్.

  మెడిటేషన్ చేయాలి :

  ధ్యానం అనేది మెదడుకి ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది కాబట్టి, గర్భధారణ సమయంలో తప్పనిసరిగా మెడిటేషన్ను ఆచరించడం చాలా ఉత్తమం. ధ్యానం చేయడం వల్ల, మెదడులో ఉన్న ఇతర వ్యాపకాలు తీసివేసి - ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రసూతి యోగాను ఆచరించడం వల్ల ఒత్తిడిన దూరంచేస్తుంది. ఒత్తిడిని దూరం చేసి, విశ్రాంతిని కలిగించేలా ఉండే మధురమైన సంగీతాన్ని వినడం చాలా మంచిది.

  English summary

  treat stress in pregnancy

  treat stress in pregnancy,in this article, we at Boldsky will be listing out some of the easy ways to treat stress in pregnancy. Read on
  Story first published: Saturday, March 3, 2018, 14:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more