విటమిన్-డి ఎక్కువగా ఉండే ఏఏ ఆహార పదార్థాలను, గర్భిణి స్త్రీలు తీసుకోవాలి ?

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

బలమైన ఎముకలను మరియు ఆరోగ్యమైన దంతాలను నిర్మించి, వాటిని అలాగే సంరక్షించడానికి విటమిన్-డి అనేది చాలా అవసరం. అలాగే ఇది మహిళల గర్భధారణ సమయంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. గర్భిణీలు తీసుకునే ఆహారం ద్వారా, వారి కడుపులో ఉన్న శిశువులకు అవసరమైనంత క్యాల్షియమును మరియు మినరల్స్ను, వారి యొక్క శరీరము చేతనే సంగ్రహించేటట్లుగా చేస్తుంది. అందువల్ల, గర్భిణీ స్త్రీలు విటమిన్-డి ను కలిగి ఉన్న ఆహార పదార్థాలను రోజువారీగా తీసుకోవడం చాలా ముఖ్యము.

గర్భిణి స్త్రీల కడుపులో ఉన్న శిశువు బాగా అభివృద్ధి చెంది, ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీగా అవసరమయ్యేంత విటమిన్-డి ను ఆహారంలో ఒక భాగంగా తప్పనిసరిగా తీసుకోవాలి. అవసరమైనంత విటమిన్-డి ను తీసుకోవడం వల్ల తీవ్రమైన పురిటి నొప్పులు మరియు ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరును కలిగి వుండటానికి, ఆరోగ్యమైన కణాలు - విభజన చెందడానికి మరియు ఆరోగ్యవంతమైన ఎముకల కోసం విటమిన్-డి అనేది చాలా అవసరం.

Vitamin D: Foods pregnant women must consume

జీవక్రియ కోసం, మరియు క్యాల్షియం - ఫాస్పరస్లను సంగ్రహించడం కోసం ఇది చాలా అవసరం. విటమిన్ డిని తక్కువ మోతాదులో కలిగి ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, స్వయం ప్రతి రక్షక వ్యాధులు, నరాల వ్యాధి, ఇన్సులిన్ నిరోధకతను మరియు గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆరోగ్యవంతమైన ఎముకల నిర్మాణానికి సహాయం చేయడం ద్వారా, శిశువు యొక్క శ్రేయస్సును కాపాడటంలో విటమిన్-డి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. విటమిన్-డి లోపం ప్రీ-ఎక్లంప్సియాతో సంబంధం కలిగి ఉంటుంది. సూర్యరశ్మి మాత్రమే విటమిన్-డి కి మూలం కాదు. విటమిన్-డి, ఆహార రూపంలో కూడా మనకి అందుబాటులో ఉంది.

ఈ కథనంలో, విటమిన్-డి ఎక్కువగా ఉండే ఏఏ ఆహార పదార్థాలను గర్భిణి స్త్రీలు తీసుకోవాలో అనే విషయం గూర్చి ఆసక్తికరమైన విషయాలను, బోల్డ్-స్కై మీ ముందుకు తీసుకువచ్చింది. ఆ వివరాలను గూర్చి చదివి, తెలుసుకోండి.

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ చాలా బలమైనది, ఒక కప్పు ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్లో 45-IU యూనిట్ల విటమిన్-డి ను అందిస్తుంది. ఈ జ్యూస్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల, మన శరీరంలో విటమిన్-డి యొక్క స్థాయి బాగా పెరుగుతుంది, అలాగే మన పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్లో కూడా పొటాషియం, విటమిన్-సి మరియు ఫోలిక్ ఆమ్లం అనేవి సమృద్ధిగా ఉంటాయి.

క్రొవ్వు చేపలు :

క్రొవ్వు చేపలు :

క్రొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శిశువు యొక్క మెదడు నిర్మాణానికి చాలా అవసరం. ట్రౌట్, హెర్రింగ్ మరియు క్యాట్ వంటి ఆయిలీ (oily) చేపలు, మనకు శక్తినిచ్చే వాటి కన్నా - ఎక్కువగా విటమిన్లనే కలిగి ఉంటాయి.

గుడ్లు :

గుడ్లు :

గర్భధారణ సమయంలో తినే ఆహారాలలో గుడ్లు ఒకటి. గుడ్డులోని పచ్చసొన విటమిన్-డి ను కలిగి ఉంది. విటమిన్-డి ను పొందడానికి ఇది ఒక అనుకూలమైన మార్గంగా ఉంది. మొత్తం గుడ్డులో సుమారు 40-IU యూనిట్ల విటమిన్-డి ని కలిగి ఉంటుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా విటమిన్-డి ను పొందడం కోసం ఒక పూర్తి గుడ్డును తినడం మంచిది.

తృణధాన్యాలు :

తృణధాన్యాలు :

పాలతో కలిపి తృణధాన్యాలను తీసుకోవడం వల్ల, అందులో లభించే విటమిన్-డి అనేది మరింత బలపడతాయి. బలమైన తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్ బి కూడా పుష్కలంగా ఉన్నాయి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పరిపూర్ణమైన ఆహారాలలో ఇది ఒకటి.

పుట్టగొడుగులు :

పుట్టగొడుగులు :

విటమిన్ డి యొక్క మంచి మూలాల్లో పుట్టగొడుగులు ఒకటి. పుట్టగొడుగులో ఉన్న రిబోఫ్లావిన్, గర్భిణీ స్త్రీలు మరియు పిండాలలో ఉన్న ఎర్ర రక్తకణాల క్రియాశీలకమైన చర్యకు కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి అందిస్తుంది. ఈ పుట్టగొడుగులు సూర్యకాంతికి గురైనప్పుడు విటమిన్-డి ను ఉత్పత్తి చేస్తాయి, అందువలన గర్భిణీ స్త్రీల ఆహార జాబితాలో వీటిని చేర్చడం చాలా ఉత్తమం.

English summary

Vitamin D: Foods pregnant women must consume

Vitamin D: Foods pregnant women must consume,In this article, we at Boldsky will be sharing with you some of the vitamin D‑rich foods to be consumed by pregnant women. Read on to know more about it.
Story first published: Monday, February 19, 2018, 15:00 [IST]