For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నడక స్త్రీలలో గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపర్చవచ్చు

నడక స్త్రీలలో గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపర్చవచ్చు

|

ఎన్నో జాగ్రత్తల మధ్య, శాస్త్రవేత్తలు శారీరక శ్రమ మిగతా ప్రవర్తన, జీవనశైలి కారణాలపై ప్రభావం చూపిస్తుందని, ఇంకా శారీరకంగా ఎక్కువ యాక్టివ్ గా ఉండే ఆడవారు శారీరకంగా శ్రమలేని వారికంటే ఎన్నో విధాల్లో తేడాగా ఉంటారని తెలిపారు.

నడక ఆడవాళ్ళలో గర్భాన్ని దాల్చే అవకాశాలు పెంచుతుంది, ముఖ్యంగా ఇదివరకు ప్రెగ్నెన్సీలో సమస్యలున్నవారికి, గర్భం నిలబడనివారికి మరింత మంచిదని ఒక అధ్యయనంలో నిరూపితమైంది. యూఎస్ లోని యూనివర్శిటీ ఆఫ్ మసాచునెట్’స్ అమ్హెరెస్ట్ వారి పరిశోధనలో శారీరక శ్రమ వంటి మార్చుకోగలిగే కారణాలు స్త్రీలలో గర్భం దాల్చే అవకాశాలను పెంచటానికి సాయం చేస్తాయని కనుగొనటం జరిగింది.

Walking may boost women’s chances of pregnancy

యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్’స్ అమ్హెరెస్ట్ నుంచి ఇటీవల పట్టా పొందిన లిండ్సే రుస్సో మాట్లాడుతూ, “ మేం కనుగొన్నవాటిలో ముఖ్యమైనది, చాలారకాల శారీరక శ్రమ ఇంకా ఒకటి లేదా రెండుసార్లు అబార్షన్ ఇదివరకే అయినవారు మళ్ళీ గర్భం దాల్చే అవకాశాలకి మొత్తంమీద ఏ సంబంధం లేకపోయినా, నడకతో మాత్రం ఊబకాయం లేదా అధికబరువు ఉన్నవారు కూడా గర్భం దాల్చే అవకాశాలు మెరుగుపడతాయి.” అని అన్నారు.

“ఈ ఫలితాలకి జీవనశైలితో తప్పక సంబంధం ఉంటూంది ఎందుకంటే వీటి ప్రభావం పరమాణుస్థాయిలో ఉండవచ్చు. మనం ఏం తింటాం, ఏం చేస్తాం అనేవి మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవటం కోసం మార్చుకోవచ్చు.అందుకని ఇలాంటి పరిశోధన ముఖ్యం, ఎందుకంటే ఇది మనం మార్చుకోగలిగే విషయాలపై కొంత సమాచారం ఇవ్వగలదు.” అని ఈ యూనివర్శిటీలోని అసోసియేట్ ప్రొఫెసర్ బ్రయాన్ విట్ కోంబ్ తెలిపారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న 1,214 స్త్రీలలో గర్భం దాల్చే అవకాశాన్ని నడకతో పోల్చినప్పుడు (ఈ స్థితిని ఫికండబులిటీ అంటారు) బాడీ మాస్ ఇండెక్స్ లో స్పష్టమైన మార్పు కన్పించిందని పరిశోధకులు తెలిపారు. బరువు ఎక్కువున్న/స్థూలకాయం ఉన్న ఆడవారిలో కేవలం 10 నిమిషాల నడక కూడా ఫికండబులిటీ మెరుగుపడటంలో సాయపడింది.

Walking may boost women’s chances of pregnancy

ఇంకా, వారానికి నాలుగు గంటల కంటే ఎక్కువ తీవ్ర వ్యాయామం చేసే స్త్రీలలో అసలు చేయని వారికంటే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని పరిశోధకులు కనుక్కొన్నారు. మధ్యమంగా వ్యాయామం చేయటం, కూచోటం లేదా ఇతర వ్యాయామ కేటగిరీలు మొత్తంమీద ఫికండబులిటీ లేదా బిఎంఐ స్ట్రాటిఫైడ్ విశ్లేషణలతో సంబంధం కలిగిలేవని వారు తెలిపారు. తీవ్ర, మధ్యమ, ఇంకా తక్కువ శ్రమ కలిగిన వ్యాయామాలకి, వాటిల్లో మార్పులకి ఈ ఫికండబులిటీకి మధ్య సంబంధ ఫలితం మాత్రం ఇంకా క్లియర్ గా లేదని వారు తెలిపారు.

“ఈ ఫలితాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో ఇంకా తెలీట్లేదు,నడకతో పోలిస్తే ఇతర తీవ్ర శ్రమనిచ్చే వ్యాయామాలకి శరీరంపై వేరే ప్రభావాలు ఉండవచ్చు కానీ మా అధ్యయనం తీవ్ర వ్యాయామాలు ఎందుకు మిగతా స్థాయిల కన్నా వేరేలా పనిచేస్తాయన్నదానికి అంత లోతుగా,స్పష్టంగా జవాబు చెప్పలేదు.” అని విట్ కోంబ్ అన్నారు.

Walking may boost women’s chances of pregnancy

ఎన్నో జాగ్రత్తల మధ్య, శాస్త్రవేత్తలు శారీరక శ్రమ మిగతా ప్రవర్తన, జీవనశైలి కారణాలపై ప్రభావం చూపిస్తుందని, ఇంకా శారీరకంగా ఎక్కువ యాక్టివ్ గా ఉండే ఆడవారు శారీరకంగా శ్రమలేని వారికంటే ఎన్నో విధాల్లో తేడాగా ఉంటారని తెలిపారు.

పరిశోధకులు ఈ అధ్యయనాన్నే పూర్తిగా ప్రామాణికంగా తీసుకోలేమని ఎందుకంటే ఇందులో పరీక్షించిన వ్యక్తులు ఫికండబులిటీకి సంబంధించి సాధారణ ప్రజలను రిప్రెజెంట్ పూర్తిగా చేయలేరు,అలాగే గర్భస్రావానికి ముందు స్త్రీలలో వ్యాయామ అలవాట్లు అసలు లేనివారితో పోలిస్తే వేరేలా ఉండవచ్చు.

Walking may boost women’s chances of pregnancy

“ ఈ ఫలితాలు గర్భం దాల్చాలనుకుంటున్న స్త్రీలలో వ్యాయామం చేయటం వలన కలిగే సానుకూల లాభాల గురించి సమాచారం ఇస్తాయి. ముఖ్యంగా ఎక్కువ బిఎంఐ ఉన్నవారికి నడక ముఖ్యం. గర్భం దాల్చటానికి, నడక, ఇతర తీవ్ర వ్యాయామాలు ఏ పనితీరుతో సాయపడతాయన్నదానికి మరిన్ని పరిశోధనలు అవసరం.” అని పరిశోధకులు తెలిపారు.

English summary

Walking may boost women’s chances of pregnancy

Among a number of cautions, the researchers point to in this work is that physical activity is related to other behaviours and lifestyle factors, and women who are more physically active may be different from women who are less active in many ways.
Desktop Bottom Promotion