For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వ్యాయామం చేస్తే బోలెడ ప్రయోజనాలు, ఐతే తీసుకోవల్సిన జాగ్రత్తలు..

గర్భధారణ సమయంలో వ్యాయామం చేస్తే బోలెడ ప్రయోజనాలు, ఐతే తీసుకోవల్సిన జాగ్రత్తలు..

|

పెళ్ళై ప్రతి జంట ఆశించేది పిల్లలు. సంతానం పొందడానికి స్త్రీ శారీరకంగా మానసింగా సిద్దంగా ఉండాలి. అలాగే సంతానం పొందిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మానసిక శారీరక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అటువంటి సమయంలో గర్భణీలకు భర్త నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి తగిన మద్దతు చాలా అవసరం. గర్భిణీలు ఎక్కువగా అలసటకు గురి అవుతుంటారు. అటువంటి సమయం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మానసికంగా కంటే శారీరకంగా కూడా మార్పులు వస్తాయి. గర్భిణీలలో డీప్ వీన్ త్రోంభోసిస్ (కాళ్ళలో నరాల వాపు, రక్తం గడ్డకట్టడం ), ఊబకాయం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఊబకాయం వల్ల ఇతర సమస్యలైన ట్యూబ్ లోపాలు, గర్భధారణ సమయంలో డయాబెటిస్, నిద్రలేమి, ప్రీక్లాంప్సియా, ప్రీమెచ్యూర్ బర్త్, (గర్భధారణ సమయం కంటే ముందుగానే ప్రసవించడం) సమస్యలు వస్తాయి.

Exercising During Pregnancy: Benefits, Exercises To Do, Avoid And Tips To Follow

గర్భదారణ సమయంలో ఇటువంటి మానసిక శారీరక సమస్యల నుండి బయట పడటానికి, కేవలం 40శాతం మంది మాత్రమే వ్యాయామం చేస్తున్నట్లు పరిశోధలు జరిగాయి. గర్భిణీలు వ్యాయామం చేయడం వల్ల వెన్ను నొప్పి, గర్భాధారణ డయాబెటిస్, ప్రీక్లాంప్సియా, సిజేరియన్ డిలివరీ, పెల్విక్ పెయిన్, యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గర్భధారణ సమయంలో వ్యాయామం ఎందుకు చేయాలి?

గర్భధారణ సమయంలో వ్యాయామం ఎందుకు చేయాలి?

గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి

గర్భధారణ సమయంలో ఎక్కువ బరువు పెరగకుండా నివారిస్తుంది.

బాగా నిద్రపడుతుంది.

మానసిక ప్రశాంత ఏర్పడుతుంది, ఎనర్జీ లెవల్స్ పెరుగుతుంది.

వెన్ను నొప్పి , మలబద్దకం, కడుపు ఉబ్బరం మరియు వాపులు తగ్గిస్తాయి.

శరీరానికి బలాన్నిస్తుంది, వీక్ నెస్ తగ్గిస్తుంది.

గర్భాధారణ సమయంలో కొంత మంది స్త్రీలలో మధుమేహం వస్తుంది. ఈ సమస్యను తగ్గిస్తుంది.

సుఖంగా ప్రసవించడం కోసం శరీరాన్ని సిద్దం చేయాడానికి వ్యాయామం సహాయపడుతుంది.

హార్ట్ రేటు మరియు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంచుతుంది.

ప్రీటర్మ్ రిస్క్ తగ్గిస్తుంది లేదా సిజేరియన్ డెలివరీని రిస్క్ తగ్గిస్తుంది.

ప్రసవం తర్వాత ఎలాంటి మందులు అవసరం లేకుండా నొప్పులను నివారిస్తుంది.

ప్రసవం తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

అంతే కాదు రెగ్యులర్ వ్యాయామం వల్ల తల్లికి మాత్రమే కాదు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రయోజనాలున్నాయి పరిశోధనల్లో తేలింది. పిండంలో ఫ్యాట్ ఏర్పడకుండా, ఒత్తిడి పెరగకుండా, నాడీవ్యవస్థను అభివ్రుద్ది చేస్తుంది.

 గర్భాధారణ సమయంలో ఎలాంటి వ్యాయామం సురక్షితం ?

గర్భాధారణ సమయంలో ఎలాంటి వ్యాయామం సురక్షితం ?

ఏరోబిక్ వ్యాయామం, అలాగే కార్డియో వ్యాస్కులర్ వ్యాయామం సురక్షితం మరియు వీటితో పాటు వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్ డ్యాన్స్, యోగా, మెట్లు ఎక్కడం చేయొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి

ఇంకా గర్భిణీ స్త్రీలు వారంలో కనీసం 5 రోజుల పాటు 20 నుండి 30 నిముషాల తప్పనిసరిగా వ్యాయామం చేయాలని వెల్లడించారు . గర్భాధారణకు మందు ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నారో వాటితో పాటు కొన్ని మార్పులు చేసుకుని వ్యాయామం చేయడం వల్ల అటు గర్భాదారణకు మరియు ప్రసవంను సులభం చేస్తుంది. గర్భాధారణకు ముందు చురుకుగా లేని వారు కూడా రోజుకు 5 నిముషాలు వ్యాయామం మొదలు పెట్టి, 5-10 నిముషాలు పెంచుకుంటా ప్రతి వారం వ్యాయం చేయాలి.

గర్భధారణ సమయంలో చేయకూడని వ్యాయామాలు

గర్భధారణ సమయంలో చేయకూడని వ్యాయామాలు

బోర్లా పడుకుని, వెల్లకిలా పడుకుని చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

టెన్నీస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ మరియు కిగ్ బాక్సింగ్ వంటి స్పోర్ట్ ఎక్సర్ సైజ్ చేయకూడదు.

గుర్రపు స్వారి మరియు జిమ్నాస్టిక్స్ కు దూరంగా ఉండాలి.

క్యూబా డైవింగ్, స్కింగ్, స్కై డైవింగ్ కు దూరంగా ఉండాలి.

ఊపిరి బిగబట్టే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

జప్పింగ్, స్కిప్పింగ్, రన్నింగ్ వ్యాయామాలను దూరంగా ఉండాలి

నిలబడి నడుము తిప్పడం వంటి వ్యాయామాలు చేయకూడదు.

ప్రెగ్నెన్సీ సమయం ఎవరు వ్యాయామం చేయకూడదు

ప్రెగ్నెన్సీ సమయం ఎవరు వ్యాయామం చేయకూడదు

ఎలాంటి వ్యాయామమైనా ప్రారంభించడానికి ముందు గర్భిణీ స్త్రీలు వారి డాక్టర్ ను సంప్రదించాలి. గైనకాలజిస్ట్ గర్భిణీకలు ప్రత్యేకమైన వ్యాయామాలు సూచిస్తారు. గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలు, ప్రీక్లాస్పియా, అనీమియా , స్కర్విక్స్ బలహీనంగా ఉండటం, ప్లీసాంటా సమస్యలున్నప్పుడు వ్యాయమాలు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు

గర్భాధారణ సమయంలో వ్యాయామ చేయడానికి చిట్కాలు

గర్భాధారణ సమయంలో వ్యాయామ చేయడానికి చిట్కాలు

వ్యాయామం చేయడానికి మందు 5 నిముషాలు శరీరంను వామ్ అప్ చేయడం , స్ట్రెచ్చింగ్ చేయాలి. గర్భాధారణ సమయంలో వ్యాయామం చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

బాగా వదులుగా , సౌకర్యంగా ఉండే దుస్తులు మరియు సరైన సైజున్న లోదుస్లు వేసుకోవాలి.

కాళ్ళకు సరిపోయే షూలు ధరించాలి ముఖ్యంగా వ్యాయామం సమసయంలో గాయాలను నివారించడానికి ఇవి సహాయపడుతాయి.

చదునుగా ఉండే నేల మీద వ్యాయామం చేయడం వల్ల ప్రమాదం మరియు గాయాలు తగలకుండా ఉంటుంది.

వ్యాయామం చేసే సమయంలో శరీరం ఎక్కువ వేడెక్కకుండా చూసుకోవాలి.

వ్యాయామం చేయడానికి కనీసం ఒక గంట ముందు భోజనం చేయాలి.

వ్యాయామంకు ముందు, తర్వాత, మరియు మద్యలో కూడా నీరు తాగాలి. శరీరంను హైడ్రేషన్ లో ఉంచాలి.

కొన్ని ఫ్లోర్ వ్యాయామాలు చేసిన తర్వాత నిధానంగా పైకి లేవాలి. కళ్ళు తిరగకుండా చూసుకోవాలి

సాధ్యమైనంత వరకు శారీరకంగా యాక్టివ్ గా ఉండాలి. అరగంట వ్యాయామం చాలు ఆరోగ్యానికి .

గర్భధారణ సమయంలో వ్యాయామం ఎప్పుడు ఆపేయాలి?

గర్భధారణ సమయంలో వ్యాయామం ఎప్పుడు ఆపేయాలి?

ఈ క్రింది ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వ్యాయామం చేయడం ఆపేసి, వెంటనే వైద్యులను సంప్రదించాలి:

ఛాతీలో నొప్పి

కండరాల పట్టివేత లేదా నొప్పి

ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది

తలనొప్పి మరియు తలతిరగడం

దగ్గు నొప్పి, వాపు మరియు ఎర్రగా మారడం

వికారం మరియు వాంతులు

వైజినల్ బ్లీడింగ్

అకస్మాత్ గా పాదాలు , చేతులు లేదా ముఖం వాపులు

శివు కదలికలేనప్పుడు

హార్ట్ బీట్ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నా

ఉమ్మనీరు లీకవుతుంటే

నడవడంలో ఇబ్బంది ఉంటే

యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు

గర్భాధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే మార్పులు ఏంటి?

గర్భాధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే మార్పులు ఏంటి?

గర్భాధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా చాలా మార్పులు జరుగుతాయి. ఇది గుర్తుంచుకుని శరీరాన్ని గమనిస్తూ దానికి తగిన విధంగా వ్యాయామంలో మార్పులు చేసుకోవాలి

కడుపులో పెరిగే బిడ్డకు మరియు శరీరంలో అవయావాలకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. కండరాల బలహీనత తగ్గుతుంది, వ్యాయామం వల్ల శరీరం ఎక్కువ ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటుంది. శ్వాస పెరుగుతుంది. శ్వాసక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో మద్యమద్యలో కొంత విశ్రాంతి తీసుకోవాలి

వ్యాయామం వల్ల గర్భాధారణ సమయంలో విశ్రాంతి కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి కీళ్ళు గాయాలు కాకుండా చేస్తుంది

గర్భాధరణ ప్రొగ్రెస్ ప్రకారం, గర్భిణీలు క్రమంగా బరువు పెరుగుతారు, కాబట్టి, వ్యాయామం శరీరంలో మార్పు తీసుకొస్తుంది, గర్భధారణలో కూడా శరీరంలో ఆకరం, సరైన బరువు ను మెయింటైన్ చేయవచ్చు. అదనపు బరువు కీళ్ళు మరియు కండరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది.

రెండవ త్రైమాసికంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి ఒకేసారి వ్యాయామంలో మార్పులు చేయడం మానుకోండి.

English summary

Exercising During Pregnancy: Benefits, Exercises To Do, Avoid And Tips To Follow

Exercising During Pregnancy: Benefits, Exercises To Do, Avoid And Tips To Follow
Story first published:Saturday, July 24, 2021, 7:42 [IST]
Desktop Bottom Promotion