For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో శిశువు మెదడు చురుకుగా ఉండాలంటే? ఈ చిట్కాలను అనుసరించండి

గర్భధారణ సమయంలో శిశువు మెదడు చురుకుగా ఉండాలంటే? ఈ చిట్కాలను అనుసరించండి

|

గర్భం నుండే ప్రారంభమయ్యే తల్లికి బిడ్డ మద్య ఉండే సంబంధం కంటే తండ్రి కంటే తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. తల్లి నుండి మాత్రమే బొడ్డు తాడు శిశువు యొక్క ప్రతి కదలిక తెలుస్తుంది, మరియు శిశువు యొక్క సందేశాలను తల్లి మాత్రమే తెలుసుకోగలదు.

తల్లి చేసే ప్రతి ఒక్క చర్యలు మరియు కార్యకలాపాలు పిల్లల చురుకుదనం మరియు తెలివితేటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. శిశువు గర్భరంలో ఉన్నప్పటి నుండే బిడ్డకు శిక్షణ ఇవ్వొచ్చు.

కాబట్టి శిశువుకు తెలివితేటలు మరియు చురుకుదనాన్ని పెంచడానికి తల్లి గర్భధారణ సమయంలోనే ఎలా సిద్ధం చేయాలన్న విషయాలు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి ...

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచండి

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచండి

మీకు బిడ్డ పుట్టకముందే మీ తల్లిదండ్రులు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన, పోషకపరమైన ఆహారం, విటమిన్ డైట్ లేదా మాత్రలు తీసుకోవాలి, ఆరోగ్యకరమైన బరువుపై దృష్టి పెట్టండి.

ఎలాంటి ఆహారాలు తినాలి

ఎలాంటి ఆహారాలు తినాలి

గర్భిణీ స్త్రీలు రోజూ వారి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని ఆహారాలు తప్పనిసరి తినాలి అంటే, కొన్ని తిననే కూడదు. శిశువు యొక్క మెదడు బాగా అభివృద్ధి చెందాలంటే పోషక ఆహార ప్రభావవంతంగా ఉండాలి. అందుకోసం ఎక్కువగా పండ్లు, కూరగాయలు, మొలకలను తినండి.

పోషకాహార విటమిన్లు

పోషకాహార విటమిన్లు

గర్భిణీ శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు ఆహారం ద్వారా తీసుకోవడం కష్టం. అందుకే కొన్ని మాత్రలు అందుబాటులో ఉన్నాయి. మీరు డాక్టర్ సలహా ప్రకారం ఈ మాత్రలు తీసుకోవచ్చు.

* విటమిన్ బి 12

* విటమిన్ సి

* విటమిన్ డి

* జింక్

* ఐరన్

* ఫోలిక్ ఆమ్లం

ఫోలిక్ ఆమ్లం

ఫోలిక్ ఆమ్లం

మీరు గర్భవతి కాకముందే ఫోలిక్ యాసిడ్ ప్రారంభించవచ్చు. ఇది ఒక్కటే పిల్లల ఆరోగ్యం మరియు మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ పిల్ తీసుకోవడం వల్ల శిశువుకు ఆటిజం, పుట్టుకతో వచ్చే వ్యాధులు లేదా అవయవ వైఫల్యం రాకుండా నిరోధిస్తుంది.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు

ఇది శిశువు మెదడులో సానుకూల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ మూలకం తరచుగా చేపలలో లభిస్తుంది. కాబట్టి వారానికి రెండు నుండి మూడు లేదా చేప మాత్రలు తీసుకోండి.

ఇతర మాత్రల నుండి దూరంగా ఉండండి

ఇతర మాత్రల నుండి దూరంగా ఉండండి

సాధారణంగా మేము దగ్గు, జలుబు మరియు ఫ్లూకి ఇంట్లో మాత్రలు తీసుకుంటాము. మీరు గర్భవతిగా ఉంటే అలాంటి ప్రయత్నం చేయవద్దు, ఇది నేరుగా శిశువు మెదడును నేరుగా ప్రభావితం చేస్తుంది. డాక్టర్ సలహా లేకుండా ఏలాంటి మాత్రలైనా సరే నిషేధించబడినవి.

ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి

ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి

మీరు గర్భవతిగా ఉంటే బరువు 15-40 పౌండ్లు పెరుగుతుంది, ఇది మీ అసలు బరువుపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ అధికంగా తినడం వల్ల అధిక బరువు పెరగడం మీకు మరియు మీ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం.

వ్యాయామం

వ్యాయామం

వ్యాయామం అనేది శరీరానికి మనసుకు ఎప్పుడూ ఆరోగ్యకరమైనది. వ్యాయామం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో మానసిక స్థితిని పెంచుతుంది, మెదడు సంకోచం మరియు అభిజ్ఞా పనితీరును పెంచుతుంది. ప్రయోజనాలు ఏమిటంటే పిల్లల మెదడు సానుకూలంగా ప్రభావితమవుతుంది. వారానికి 3 నుండి 5 రోజులు వ్యాయామం చేయడం కేవలం 30 నిమిషాల వ్యాయామం చేయడం గర్భిణికి అవసరం మరియు ఆరోగ్యకరం.

ఒత్తిడి తగ్గించుకోండి

ఒత్తిడి తగ్గించుకోండి

జీవితంలో ఒత్తిడి కూడా సాధారణంగా ఉంటుంది. మీరు గర్భవతిగా ఉంటే, ఈ ఒత్తిడి మిమ్మల్ని ప్రభావితం చేస్తే అది శిశువు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం గర్భిణీ స్త్రీలు ఒత్తిడికి గురైతే పుట్టబోయే శిశువు మెదడుపై ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. కాబట్టి ఎంత ఒత్తిడి అయినా ప్రశాంతంగా ఉండండి మరియు విశ్రాంతి తీసుకోండి. మీరు గర్భవతిగా ఉంటే జీవితంలో గణనీయమైన మార్పులు జరగడానికి అనుమతించవద్దు.

పిల్లలతో మాట్లాడండి

పిల్లలతో మాట్లాడండి

మీ పిల్లల తెలివితేటలను ప్రభావితం చేయడానికి మీ పిల్లలతో క్రమం తప్పకుండా మాట్లాడండి. ప్రారంభంలో ఇది మీకు ప్రత్యేకమైనదిగా అనిపించినప్పటికీ, కొన్ని రోజుల తర్వాత శిశువు ప్రతి చర్యకు ప్రతిస్పందిస్తుంది, తద్వారా శిశువు గర్భంలో తల్లి గొంతు మరియు భాషను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఇది చాలా ఆహ్లాదకరమైన మరియు వర్ణించలేని అనుభూతి.

సంగీతం వినండి

సంగీతం వినండి

మీరు సంగీతాన్ని వింటున్నప్పుడు, శిశువు కొత్త శబ్దాన్ని, సంగీతం యొక్క హెచ్చు తగ్గులను మరియు ధ్వనిని ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. ఇది పిల్లలకి ప్రశాంత వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది.

టాక్సిన్స్ నుండి దూరంగా ఉండండి

టాక్సిన్స్ నుండి దూరంగా ఉండండి

వ్యర్థాలు ఎవరికీ ఆరోగ్యకరమైనది కాదు. ఇది శిశువు శారీరకంగా మరియు మానసికంగా పిల్లల పెరుగుదలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. శుభ్రపరిచే ద్రవాలను ఉపయోగించవద్దు, ఇంట్లో తయారుచేసే తాజా ద్రవాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి, ట్రాఫిక్ రద్దీని నివారించండి మరియు విష వాయువులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండకండి.

ధూమపానం మరియు మద్యం చేయకండి

ధూమపానం మరియు మద్యం చేయకండి

గర్భవతిగా ఉంటే ధూమపానం మరియు మద్యం చేయకూడదు. నికోటిన్ కంటెంట్ రక్త నాళాలను అడ్డుకుంటుంది మరియు రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. ఆల్కహాల్ శిశువు యొక్క మెదడు బలహీనంగా మార్చుతుంది.

English summary

Tips To Boost Your Baby Brain Development During Pregnancy

You already know that living a healthy lifestyle while you're expecting helps your baby grow big and strong, but did you know it can make her smarter too? In fact, simple choices that you make every day, from eating a leafy-green salad for lunch to hitting the treadmill for a workout, can help build her brain.
Desktop Bottom Promotion