For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం మీగడ పాయసం రెసిపి ; బాదం పాల పాయసం ఎలా తయారుచేయాలి

Written By: DEEPTHI T A S
|

బాదం మీగడ పాయసం మన మనస్సుకి ఎంతో నచ్చే తీపి వంటకం, అంతర్లీనంగా కుంకుమపువ్వు వాసన, బాదంతో నిండిన, ఘుమాయించే భారతీయ దినుసులతో కూడిన ఒక చెంచా అన్నం పరమాన్నం కన్నా రుచిగా ఏముంటుంది?

మనకి పాయసం లేదా పరమాన్నం ప్రతి పండగకీ, ఉత్సవాలకి తప్పనిసరి వంటకంగా మారిపోయింది. అందుకని, ఈ పండగ సమయంలో మనం బాదం మీగడ పాయసాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఈ ప్రత్యేక బాదం మీగడ పాయసం రెసిపి ఏ పండగకైనా బావుంటుంది, దీన్ని వండటానికి కూడా పెద్ద సమయం పట్టదు. హాయిగా చేసుకుని నచ్చినంతసేపు తింటూ ఆనందించండి.

అన్న పరమాన్నాలలో మంచి విషయం ఏంటంటే వాటిని తయారుచేయటం చాలా సులభం, చల్లగా లేదా వేడిగా ఎలా అయినా మీకు నచ్చినట్లు తినవచ్చు. అందుకని ఈ కింద ఇచ్చిన వీడియోను చూడండి లేదా స్టెప్ బై స్టెప్ చిత్రాలను చూస్తూ , ఈ మనస్సుకి, కడుపుకి శాంతినిచ్చే తీపి వంటకంతో పండగ వాతావరణాన్ని మరింత ఆనందకరంగా ఇంట్లోనే సులభంగా మార్చుకోండి.

బాదం మీగడ పాయసం రెసిపి । బాదంపాలతో పాయసం తయారుచేయటం ఎలా । సులభమైన బాదం మీగడ పాయసం రెసిపి । బాదం మీగడ పాయసం స్టెప్ బై స్టెప్ । బాదం మీగడ పాయసం వీడియో
బాదం మీగడ పాయసం రెసిపి । బాదంపాలతో పాయసం తయారుచేయటం ఎలా । సులభమైన బాదం మీగడ పాయసం రెసిపి । బాదం మీగడ పాయసం స్టెప్ బై స్టెప్ । బాదం మీగడ పాయసం వీడియో
Prep Time
15 Mins
Cook Time
15M
Total Time
30 Mins

Recipe By: మీనా భండారి

Recipe Type: తీపి వంటకం

Serves:

Ingredients
  • 1.చక్కెర -1 చెంచా

    2.పొట్టు తీసేసిన బాదం -2 చెంచాలు

    3.బాస్మతి బియ్యం -2 చెంచాలు

    4.ఆకుపచ్చని ఏలకుల పొడి- 1చెంచా

    5.కుంకుమ పువ్వు- కొన్ని రేకులు

    6.పాలు -350గ్రా

    7. గట్టిపడిన పాలు -4 చెంచాలు

How to Prepare
  • 1.ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పోయండి.

    2.నీళ్ళు పోసి 10-15 నిమిషాలు నాననివ్వండి.

    3.ఒక పెనం తీసుకోండి.

    4.పాలు పోసి 5-10నిమిషాలు మరగనివ్వండి.

    5.నానిన బియ్యాన్ని పోసి బాగా కలపండి.

    6.అన్నాన్ని 4-5 నిమిషాలు ఉడకనివ్వండి.

    7. అన్నం మెత్తగా ఉన్నప్పుడు, గట్టిపడిన పాలను అందులో పోయండి.

    8.బాదంపప్పులు, ఆకుపచ్చని ఏలకుల పొడి మరియు చక్కెరను దానిలో వేయండి.

    9.2-3 నిమిషాల పాటు కలపండి.

    10. పెనం దించేసి, అందరికీ వడ్డించేముందు కుంకుమపువ్వుతో అలంకరించండి.

Instructions
  • 1.బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకుంటే త్వరగా ఉడుకుతుంది. 2.పాలు మరుగుతున్నప్పుడు పాయసం గడ్డకట్టకుండా కలుపుతూనే ఉండండి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 బౌల్
  • క్యాలరీలు - 490క్యాలరీలు
  • కొవ్వు - 6గ్రా
  • ప్రొటీన్ - 41గ్రా
  • కార్బొహైడ్రేట్లు - 51గ్రా
  • చక్కెర - 5 గ్రా
  • పీచు పదార్థం - 4గ్రా

స్టెప్ బై స్టెప్ - ఎలా తయారుచేయాలి

1.ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పోయండి.

2.నీళ్ళు పోసి 10-15 నిమిషాలు నాననివ్వండి.

3.ఒక పెనం తీసుకోండి.

4.పాలు పోసి 5-10నిమిషాలు మరగనివ్వండి.

5.నానిన బియ్యాన్ని పోసి బాగా కలపండి.

6.అన్నాన్ని 4-5 నిమిషాలు ఉడకనివ్వండి.

7. అన్నం మెత్తగా ఉన్నప్పుడు, గట్టిపడిన పాలను అందులో పోయండి.

8.బాదంపప్పులు, ఆకుపచ్చని ఏలకుల పొడి మరియు చక్కెరను దానిలో వేయండి.

9.2-3 నిమిషాల పాటు కలపండి.

10. పెనం దించేసి, అందరికీ వడ్డించేముందు కుంకుమపువ్వుతో అలంకరించండి.

[ 4.5 of 5 - 26 Users]
English summary

Almond Malai Kheer Recipe | How To Make Almond Milk Kheer

Almond Malai Kheer is a rich creamy Indian dessert, popular for its dense satiny smooth texture, and the accompaniment of kesar and almonds turns it into an utterly delicious recipe, or a gastronomical equivalent of heaven. On top of all that, this dish can be prepared within half an hour, and hence is the best option for busy festival hours.
Desktop Bottom Promotion