For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేసన్ లడ్డూ రెసిపి

Posted By: Lekhaka
|

అన్ని పండగలకు చేసుకునే సెనగ లడ్డూ ఉత్తరాది వారి ప్రత్యేక వంటకం. దీన్ని సెనగపిండిని నేతిలో వేయించి, అందులో చక్కెర, ఏలకుల పొడిని, డ్రైఫ్రూట్లను కలిపి చేస్తారు.

సెనగలడ్డూలను తమిళంలో కడలై మావు ఉరుండై అని అంటారు. ఇంట్లో ఫంక్షన్లకి చేసుకోదగ్గ ఈ వంటకం చాలా సులువైనది, అస్సలు శ్రమలేనిది. అందుకే పార్టీలకి ఇది ప్రసిద్ధమైనది.

నెయ్యి వలన కొంచెం మెరుస్తూ ఉండే ఈ లడ్డూ, సెనగపిండి వాసన వల్ల మీరు మరింత అడుగుతూ తింటారు.మీరు దీన్ని ఇంట్లో తయారుచేసుకోవాలనుకుంటే, ఈ చిత్రాలు, వీడియోతో కూడిన వ్యాసాన్ని చదివి తయారీవిధానం నేర్చుకోండి.

బేసన్ లడ్డూ రెసిపి । సెనగపిండి లడ్డూ తయారీ ఎలా । సెనగ లడ్డూ తయారీ విధానం
బేసన్ లడ్డూ రెసిపి । సెనగపిండి లడ్డూ తయారీ ఎలా । సెనగ లడ్డూ తయారీ విధానం
Prep Time
5 Mins
Cook Time
30M
Total Time
35 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: 8 లడ్డూలు

Ingredients
  • పంచదార పొడి - 1కప్పు

    సెనగపిండి - 2 కప్పులు

    నెయ్యి - ¾ కప్పు

    నీళ్ళు - 3 చెంచాలు

    ఏలకుల పొడి - చిటికెడు

    తరిగిన బాదం - 1 చెంచా + అలంకరణకి

    తరిగిన పిస్తాపప్పు - 1 చెంచా + అలంకరణకి

How to Prepare
  • 1. వేడిపెనంలో నెయ్యి వేయండి.

    2. సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి.

    3. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.

    4. నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు.

    5. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి.

    6. గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.

    7.పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి.

    8. ఏలకుల పొడిన్ వేసి కలపండి.

    9. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి.

    10.ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.

    11. సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి.

    12.ఈ లడ్డూలను తరిగిన బాదం, పిస్తాపప్పులతో అలంకరించండి.

Instructions
  • 1. నెయ్యి, సెనగపిండిల నిష్పత్తి సరిగ్గా ఉండాలి.
  • 2. లడ్డూ మిశ్రమంలో ఏలకుల పొడిని కలిపినప్పుడు కొంత తీసుకుని మీ అరచేతుల మధ్యలో రాసుకోండి. మీకు నెయ్యి తగిలితే ఇక అది పూర్తయ్యినట్టే.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1లడ్డూ
  • క్యాలరీలు - 135 క్యాలరీలు
  • కొవ్వు - 7గ్రాములు
  • ప్రోటీన్ - 7గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 29గ్రాములు
  • చక్కెర - 12 గ్రాములు
  • ఫైబర్ - 6గ్రాములు

స్టెప్ బై స్టెప్ - సెనగపిండి లడ్డూ తయారుచెయ్యటం ఎలా

1. వేడిపెనంలో నెయ్యి వేయండి.

2. సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి.

3. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.

4. నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు.

5. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి.

6. గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.

7.పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి.

8. ఏలకుల పొడిన్ వేసి కలపండి.

9. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి.

10.ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.

11. సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి.

12.ఈ లడ్డూలను తరిగిన బాదం, పిస్తాపప్పులతో అలంకరించండి.

[ 4 of 5 - 43 Users]
English summary

Besan Ladoo Recipe | How To Make Besan Ke Ladoo | Homemade Besan Laddu Recipe | Kadalai Maavu Ladoo

Besan ladoo is a popular North Indian sweet that is prepared for almost all festivals. Watch the recipe video and learn how to make besan ladoo at home.
Desktop Bottom Promotion