మండుటెండల్లో ప్రాణం లేచిరావాలా? ఈ సమ్మర్‌ లో బెల్లం కోల్డ్ కాఫీ ట్రై చేయండి!

Posted By:

భానుడి ప్రతాపంతో మండుతున్న వేసవి ఎండల్లో అలిసిపోయి ఇంటికి రాగానే.. ఒక గ్లాసు చల్లటి కోల్డ్ కాఫీ గొంతులో పడితే ఆ కిక్కే వేరు. శరీరాన్ని, మనసును ఏకకాలంలో సేదతీర్చే అద్భుతమైన డ్రింక్ ఇది. కానీ మీరు ప్రాణంగా ప్రేమించే మీ కాఫీకి ఏనాడైనా ఒక ఆరోగ్యకరమైన ట్విస్ట్ ఇవ్వాలని ఆలోచించారా?

ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిట్‌ నెస్ ప్రియుల మధ్య విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంటున్న దేశీ డ్రింక్ బెల్లం కోల్డ్ కాఫీ. తెల్ల చక్కెర శరీరానికి కేవలం క్యాలరీలను మాత్రమే అందిస్తుంది, దాని వల్ల ఎలాంటి పోషక విలువలూ ఉండవు. కానీ మన సాంప్రదాయ తీపి పదార్థమైన బెల్లం పోషకాల గని.

Ditch the Sugar Try This Healthy Jaggery Cold Coffee Recipe This Summer

వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, చల్లబరచడంలో,నీరసాన్ని తరిమికొట్టి తక్షణ శక్తిని అందించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కేఫ్‌ ను మించిన రుచితో, ఆరోగ్యంతో కూడిన బెల్లం కోల్డ్ కాఫీని ఇంట్లోనే ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

బెల్లం కోల్డ్ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు

కాఫీ పొడి - 1 టేబుల్ స్పూన్
బెల్లం - 2 టేబుల్ స్పూన్లు
బాగా చల్లబరిచిన పాలు - 1 పెద్ద కప్పు
ఐస్ క్యూబ్స్ - 3
గోరువెచ్చని నీరు - ఒకటి లేదా రెండు టీస్పూన్లు

బెల్లం కోల్డ్ కాఫీ తయారీ విధానం

-ముందుగా ఒక చిన్న కప్పు లేదా గ్లాసు తీసుకోండి. అందులో కాఫీ పొడి, బెల్లం పొడి,కొద్దిగా గోరువెచ్చని నీటిని వేయండి.

-ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని, బెల్లం పూర్తిగా కరిగి, మిశ్రమం చక్కటి నురుగు వచ్చే వరకు బాగా గిలకొట్టండి.

-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని, అందులో చల్లటి పాలు, ముందుగా రెడీ చేసుకున్న కాఫీ-బెల్లం డికాషన్, ఐస్ క్యూబ్స్ వేయండి. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చిక్కటి, మృదువైన నురుగు పైకి తేలే వరకు బాగా బ్లెండ్ చేయండి.

-అంతే ఎంతో ఆరోగ్యకరమైన, కమ్మని రుచితో కూడిన బెల్లం కోల్డ్ కాఫీ రెడీ. దీన్ని ఒక పొడవైన గ్లాసులో పోసి, పైన గార్నిష్ కోసం కొద్దిగా కాఫీ పొడి చల్లుకొని తాగుతుంటే ఆ మజానే వేరు.

-రెగ్యులర్ చక్కెర కాఫీతో పోలిస్తే దీని రుచి కొంచెం భిన్నంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బెల్లంలోని సహజమైన తీపి, కాఫీలోని చేదును అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధి లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల తీపికి దూరంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.

[ of 5 - Users]
Story first published: Thursday, March 26, 2026, 13:06 [IST]
Desktop Bottom Promotion