Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
టేస్టీ సొరకాయ హల్వా..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
సొరకాయ అనగానే చాలామందికి కూర గుర్తుకు వస్తుంది కానీ, ఈ కూరగాయతో అద్భుతమైన హల్వా కూడా తయారు చేయవచ్చు. సొరకాయ హల్వా కేవలం నోటికి రుచికరమైన తీపి వంటకం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషక సమృద్ధిగల వంటకం కూడా. పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తయారు చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.ఈ హల్వాను తయారు చేయడం చాలా సులభం. సొరకాయ హల్వాను మీ ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సొరకాయ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
-గింజలు లేని లేత సొరకాయ: 1 కిలో
-చిక్కని పాలు: 2 కప్పులు
-చక్కెర: 1.5 కప్పులు
-నెయ్యి: 4-5 టేబుల్ స్పూన్లు
-యాలకుల పొడి: 1 టీ స్పూన్
-బాదం, జీడిపప్పు, పిస్తా: 1/4 కప్పు
-కిస్మిస్ : 2 టేబుల్ స్పూన్లు
-కోవా లేదా పాలు మీగడ: 1/4 కప్పు
-కుంకుమపువ్వు : 1 టేబుల్ స్పూన్
సొరకాయ హల్వా తయారీ విధానం
-సొరకాయను బాగా కడిగి పై తొక్కను చెక్కాలి.
-తొక్క తీసిన సొరకాయను నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసి లోపల ఉన్న గింజలు, మెత్తని భాగాన్ని తొలగించాలి.
-తర్వాత సొరకాయను తురుముకోవాలి.
-ఇప్పుడు ఒక మందపాటి అడుగున్న పెద్ద కడాయి స్టవ్ మీద పెట్టి అందులో సొరకాయ తురుము వేసి అందులో పాలు కలపండి.
-మీడియం మంట మీద సొరకాయ తరుమును పాలలో ఉడికించడం ప్రారంభించండి. సొరకాయ మెత్తగా అయ్యే వరకు, పాలు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి. దీనికి సుమారు 15-20 నిమిషాలు పట్టవచ్చు. మధ్యమధ్యలో అడుగు అంటకుండా కలుపుతుండాలి.
-పాలు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత అందులో నెయ్యిని వేసి బాగా కలపండి. నెయ్యి కరిగి సొరకాయ తురుము నెయ్యిలో కొద్దిగా వేగే వరకు 5-7 నిమిషాలు ఉడికించండి. ఈ సమయంలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు,పిస్తా, కిస్మిస్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు చక్కెర వేసి బాగా కలపండి. పంచదార కరిగి మిశ్రమం చిక్కబడే వరకు, పాన్ నుండి వేరుపడే వరకు ఉడికించాలి. ఇది సుమారు 10-15 నిమిషాలు పడుతుంది.
పోషకాల రాగి హల్వా..రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
-చివరగా యాలకుల పొడిని వేసి బాగా కలపండి. మీరు కోవానువేయాలనుకుంటే ఈ దశలో తురిమిన కోవాను వేసి బాగా కలపండి. కోవా కరిగి హల్వాతో కలిసిపోయే వరకు 2-3 నిమిషాలు ఉడికించండి.
-రంగు కోసం కుంకుమపువ్వును ఉపయోగిస్తుంటే ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని పాలలో కొన్ని కుంకుమపువ్వు రేకులను నానబెట్టి హల్వా చివరలో వేసి కలపవచ్చు. ఇది హల్వాకు మంచి బంగారు రంగును ఇస్తుంది. అంతే సొరకాయ హల్వా రెడీ.
-సొరకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అందువల్ల ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. హల్వా రూపంలో తీసుకున్నప్పుడు కూడా ఈ గుణం ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











