For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కజ్జికాయ తయారీ విధానం – ఇంటివద్దనే మవాగుజియా ఎలా చేయాలి

పండగ సమయాల్లో ఎక్కువచేసుకునే ఈ గుజియా స్వీటు లోపల తీపి పదార్థంతో పైన పిండితో కప్పి, వేయిస్తారు. చిత్రాలు, వీడియోతో దీని తయారీ విధానం మీకోసం.

Posted By: Deepthi
|

దేశవ్యాప్తంగా అన్ని పండగల సమయాల్లో కన్పించే స్వీటు గుజియా లేదా కజ్జికాయ. ఉత్తరభారత సాంప్రదాయ వంటకం గుజియా లోపలి తీపి పదార్థంతో, పైన పిండితో కప్పబడి వేయించబడే స్వీటు.దీన్ని కరంజి అని కూడా అంటారు. ఒక్కటే తేడా లోపల కూరే తీపి పదార్థం. దక్షిణాదిన కూడా గుజియాను కొబ్బరి- బెల్లం ముద్దతో కూరి చేస్తారు. దీన్ని అక్కడ కజ్జికాయలు లేదా కజ్జికాయ అంటారు.

మవాగుజియా పైన పొరలతో వేగినట్టు ఉండి లోపల ఎండుకొబ్బరి, రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్లతో ముద్ద పెట్టబడి ఉంటుంది. ఈ స్వీటు చేయడానికి చాలా సహనం ,సమయం ఉండాలి. ముఖ్యవిషయం పిండి సరిగ్గా కలపాలి. ఇది ఇంట్లో తయారుచేయాలంటే ముందే ఈ పెద్ద పనికి సిద్ధం కావాలి.

ఈ రుచికర వంటకాన్ని ఇంట్లో తయారుచేయాలనుకుంటే, వీడియో చిత్రాలతో కూడిన ఈ తయారీ విధానాన్ని చదవండి.

గుజియా తయారీ వీడియో

గుజియా రెసిపి | మవాగుజియాను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి । మవాకరంజి తయారీ । వేయించిన కొబ్బరి కజ్జికాయ తయారీ
గుజియా రెసిపి | మవాగుజియాను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి । మవాకరంజి తయారీ । వేయించిన కొబ్బరి కజ్జికాయ తయారీ
Prep Time
1 Hours
Cook Time
2H
Total Time
3 Hours

Recipe By: ప్రియాంక త్యాగి

Recipe Type: స్వీట్లు

Serves: 12 కజ్జికాయలు

Ingredients
  • నెయ్యి - 5చెంచాలు

    మైదాపిండి - 2 కప్పులు

    ఉప్పు - 1/2 చెంచా

    బొంబాయి రవ్వ - ½ కప్పు

    ఎండుకొబ్బరి పొడి (ఖోయా లేదా మావా) -200 గ్రాములు

    జీడిపప్పుల ముక్కలు - ½ కప్పు

    బాదం పప్పుల ముక్కలు - ½ కప్పు

    కిస్మిస్ లు - 15-18

    చక్కెరపొడి - 3/4వకప్పు

    ఏలకుల పొడి - 1/2 చెంచా

    నూనె వేయించటానికి

    కజ్జికాయల అచ్చు

How to Prepare
  • 1. పెద్ద గిన్నెలో మైదాపిండిని తీసుకుని, 3 చెంచాల నెయ్యిని కలపండి.

    2. బాగాకలిపి పావు కప్పు నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ, గట్టి ముద్దలాగా కలపండి.

    3. 2-3చుక్కల నెయ్యిని వేసి మళ్ళీ కలపండి.

    4. తడి గుడ్డను ఆ పిండిముద్దపై కప్పి అరగంట సేపు నాననివ్వండి.

    5. అదే సమయంలో రవ్వను వేడి కడాయిలో పోసి, పొడిగా వేయించండి. గోధుమరంగులోకి మారాక ,పక్కకి తీసి ఉంచి చల్లబడనివ్వండి.

    6. తర్వాత వేడి కడాయిలో ఎండుకొబ్బరిని కూడా వేయండి.

    7. అరచెంచా నెయ్యిని వేసి బాగా కలపండి.

    8. మాడిపోకుండా కలుపుతూ గట్టిపడేదాకా ఉంచండి.

    9. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.

    10. వేడిపెనంలో చెంచాడు నెయ్యి వేసి వేడెక్కనివ్వండి

    11. జీడిపప్పులు, బాదం, కిస్మిస్ లను వేయండి.

    12. అవన్నీ వేగేదాకా బాగా కలపండి.

    13. స్టవ్ పై నుండి తీసేసి సరిగ్గా చల్లబడనివ్వండి.

    14. చల్లబడిన ఎండుకొబ్బరిని గిన్నెలో తీసుకుని, వేయించిన రవ్వను కలపండి.

    15. వాటికి వేయించిన డ్రైఫ్రూట్లను, ఏలకుల పొడిని కలపండి.

    16. పంచదారపొడిని కూడా వేసి అన్నిటినీ బాగా కలపండి.

    17. చేతికి కొంచెం నూనె రాసుకుని జిడ్డు చేసుకోండి.

    18. కొంచెం పిండి ముద్దను తీసుకుని, చేతితో ఉండలు చేసి దాన్ని వత్తండి.

    19. అప్పడాల కర్రతో పూరీల్లాగా వాటిని వత్తండి.

    20. గుజియా లేదా కజ్జికాయ అచ్చును ఈ లోపల నూనె రాసి జిడ్డుచేయండి.

    21. ఈ వత్తిన పూరీలాంటి పిండిని ఆ అచ్చులో పెట్టండి.

    22. ఎండుకొబ్బరి మిశ్రమాన్ని దాని లోపల పెట్టి అన్నివైపులా పిండి అతుక్కోడానికి నీటిని రాయండి.

    23. అచ్చును మూసేసి అన్నివైపులా వత్తండి.

    24. బయటకి వచ్చిన మిగిలిన పిండిని తీసేయండి.

    25. అన్నివైపులా సరిగ్గా వత్తి, అచ్చును జాగ్రత్తగా తెరచి కజ్జికాయను బయటకి తీయండి.

    26. దాన్ని గుడ్డతో కప్పండి.

    27. అదే సమయంలో బాండీలో నూనెను మధ్యమంటతో కాగనివ్వండి.

    28. నూనె సరియైన స్థాయిలో మరిగిందో లేదో చూడటానికి కొంచెం పిండిని వేసి చూడవచ్చు. అది వెంటనే పైకి తేలితే నూనె కాగినట్టు.

    29. కొన్ని కజ్జికాయలను నూనెలో మెల్లగా వేయించటానికి వేయండి.

    30. అవి బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేగనివ్వండి, వెనక్కి తిప్పి కూడా వేయించండి. (ఒక్కో కజ్జికాయ వేగటానికి 10-15నిమిషాల సమయం పడుతుంది.)

    31. వేగాక, పళ్ళెంలోకి తీసుకోండి.

Instructions
  • 1. పిండి కలిపేటప్పుడు సరిపడినంత నీరుమాత్రమే కలపండి.మరీ పల్చగా లేదా మరీ గట్టిగా అవకూడదు.
  • 2. పిండి ఎండిపోకుండా తడి గుడ్డతో కప్పటం అవసరం. రవ్వ వాసన పోయేవరకూ దాన్ని వేయించాలి.
  • 3. పిండిని వత్తేటప్పుడు మిగతా పిండిపై తడిగుడ్డతో కప్పివుంచండి. లేకపోతే ఎండిపోతుంది.
  • 4. వత్తిన పిండి, అచ్చు కన్నా ఒక అంగుళం పెద్దగా ఉండాలి. అలా అయితేనే గుజియా ఆకారం సరిగా వస్తుంది.
  • 5. ఎక్కువ లోపలి తీపి పదార్థం వేయకండి. లేకపోతే కజ్జికాయ వేయించేటప్పుడు విచ్చిపోవచ్చు.
  • 6. అచ్చును మూసేటప్పుడు అంచుల్లో నీటిచుక్కలను రాయటం అవసరం. సరిగ్గా మూసుకుపోతుంది.
  • 7. లోపల వేరే పదార్థాలను పెట్టి కూడా ఈ స్వీటు తయారుచేసుకోవచ్చు.
  • 8. వేయించేసాక పంచదార పాకంలో కూడా వేసుకోవచ్చు.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 గుజియా
  • కాలరీలు - 200
  • కొవ్వు - 8గ్రాములు
  • ప్రొటీన్లు - 2గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 30 గ్రాములు
  • చక్కెర - 18 గ్రాములు
  • ఫైబర్ - 1 గ్రాము
  • ఐరన్ - 8 %
  • విటమిన్ ఎ - 2%

స్టెప్ బై స్టెప్ - గుజియా తయారీ ఎలా

1. పెద్ద గిన్నెలో మైదాపిండిని తీసుకుని, 3 చెంచాల నెయ్యిని కలపండి.

2. బాగాకలిపి పావు కప్పు నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ, గట్టి ముద్దలాగా కలపండి.

3. 2-3చుక్కల నెయ్యిని వేసి మళ్ళీ కలపండి.

4. తడి గుడ్డను ఆ పిండిముద్దపై కప్పి అరగంట సేపు నాననివ్వండి.

5. అదే సమయంలో రవ్వను వేడి కడాయిలో పోసి, పొడిగా వేయించండి. గోధుమరంగులోకి మారాక ,పక్కకి తీసి ఉంచి చల్లబడనివ్వండి.

6. తర్వాత వేడి కడాయిలో ఎండుకొబ్బరిని కూడా వేయండి.

7. అరచెంచా నెయ్యిని వేసి బాగా కలపండి.

8. మాడిపోకుండా కలుపుతూ గట్టిపడేదాకా ఉంచండి.

9. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.

10. వేడిపెనంలో చెంచాడు నెయ్యి వేసి వేడెక్కనివ్వండి.

11. జీడిపప్పులు, బాదం, కిస్మిస్ లను వేయండి.

12. అవన్నీ వేగేదాకా బాగా కలపండి.

13. స్టవ్ పై నుండి తీసేసి సరిగ్గా చల్లబడనివ్వండి.

14. చల్లబడిన ఎండుకొబ్బరిని గిన్నెలో తీసుకుని, వేయించిన రవ్వను కలపండి.

15. వాటికి వేయించిన డ్రైఫ్రూట్లను, ఏలకుల పొడిని కలపండి.

16. పంచదారపొడిని కూడా వేసి అన్నిటినీ బాగా కలపండి.

17. చేతికి కొంచెం నూనె రాసుకుని జిడ్డు చేసుకోండి.

18. కొంచెం పిండి ముద్దను తీసుకుని, చేతితో ఉండలు చేసి దాన్ని వత్తండి.

19. అప్పడాల కర్రతో పూరీల్లాగా వాటిని వత్తండి.

20. గుజియా లేదా కజ్జికాయ అచ్చును ఈ లోపల నూనె రాసి జిడ్డుచేయండి.

21. ఈ వత్తిన పూరీలాంటి పిండిని ఆ అచ్చులో పెట్టండి.

22. ఎండుకొబ్బరి మిశ్రమాన్ని దాని లోపల పెట్టి అన్నివైపులా పిండి అతుక్కోడానికి నీటిని రాయండి.

23. అచ్చును మూసేసి అన్నివైపులా వత్తండి.

24. బయటకి వచ్చిన మిగిలిన పిండిని తీసేయండి.

25. అన్నివైపులా సరిగ్గా వత్తి, అచ్చును జాగ్రత్తగా తెరచి కజ్జికాయను బయటకి తీయండి.

26. దాన్ని గుడ్డతో కప్పండి.

27. అదే సమయంలో బాండీలో నూనెను మధ్యమంటతో కాగనివ్వండి.

28. నూనె సరియైన స్థాయిలో మరిగిందో లేదో చూడటానికి కొంచెం పిండిని వేసి చూడవచ్చు. అది వెంటనే పైకి తేలితే నూనె కాగినట్టు.

29. కొన్ని కజ్జికాయలను నూనెలో మెల్లగా వేయించటానికి వేయండి.

30. అవి బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేగనివ్వండి, వెనక్కి తిప్పి కూడా వేయించండి. (ఒక్కో కజ్జికాయ వేగటానికి 10-15నిమిషాల సమయం పడుతుంది.)

31. వేగాక, పళ్ళెంలోకి తీసుకోండి.

[ 5 of 5 - 105 Users]
English summary

గుజియా రెసిపి | మవాగుజియాను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి । మవాకరంజి తయారీ । వేయించిన కొబ్బరి కజ్జికాయ తయారీ

Gujiya is a traditional sweet that is prepared during the festive seasons in all regions of the country. Learn how to make the mawa gujiya.
Desktop Bottom Promotion