Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఓట్స్‌తో ఓట్స్ ఇడ్లీలు.. టేస్టీగా సాఫ్ట్‌గా మెత్తగా వుంటాయ్.. బరువు కూడా తగ్గుతారు..!
ఓట్స్‌లో ఇడ్లీని కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్‌గా టేస్టీగా వుంటుంది. రుచి మాత్రమే కాదు, ఈ ఇడ్లీలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.ఓట్స్‌తో చేసిన ఇడ్లీలు చాలా స్పాంజీగా కూడా వుంటాయ్. ఇంట్లో వున్న పదార్ధాలతోనే ఈ ఓట్స్ ఇడ్లీని రెడీ చేసుకోవచ్చు. మార్కెట్ నుంచి ప్రత్యేకంగా వంట సామాగ్రి తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.
ఓట్స్ ఇడ్లీలను తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి :
1 కప్పు సఫోలా ఓట్స్
అర కప్పు బొంబాయ్ రవ్వ
అరకప్పు పెరుగు
రుచికి సరిపడ ఉప్పు
ముప్పావు టీస్పూన్ వంట సోడా లేదా ఇనో పౌడర్
రెండు పచ్చిమిరపకాయ ముక్కలు
అరటీస్పూన్ అల్లం ముక్కలు
రెండు టీ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు
2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు
కొంచెం కొత్తిమీర ఆకులు
12 జీడి పప్పులు
1. ముందుగా 1 కప్పు సఫోలా ఓట్స్‌ను తీసుకొని ఒక ప్యాన్‌లో బాగా వేయించాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్ చాలా ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఓట్స్ ఆరోగయానికి చాలా మంచిది.
2. ఫ్రై చేసిన ఓట్స్‌ను ఒక ప్లేటులోకి తీసుకొని వాటిని చల్లార్చాలి. ఇప్పుడు ప్యాన్‌లో అర కప్పు బొంబాయ్ రవ్వ వేసుకొని 3 నిమిశాల పాటు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వను కూడా ప్లేటులోకి తీసుకొని చల్లార్చాలి.
3. మిక్సర్ జార్‌లోకి వేపిన ఓట్స్‌ను తీసుకొని బరకగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి, అదే బౌల్లో బొంబాయ్ రవ్వను యాడ్ చేసుకోవాలి. అరకప్పు పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరానికి సరిపడ నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండిలా వచ్చేంతవరకు కలుపుకోవాలి.
4. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పును, ముప్పావు టీస్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాాలి. వంటసోడాకు బదులుగా ఇనో పౌడర్‌ను కూడా వేసుకోవచ్చు. దీని వల్ల ఇడ్లీలు చాలా సాప్ట్‌గా అవుతాయ్.
5. ఇడ్లీపిండిలో సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలను, అరటీస్పూన్ అల్లం ముక్కలను, రెండు టీ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలను, కొంచెం కొత్తిమీర ఆకులను తీసుకొని బాగా కలుపుకోవాలి.
6. ఇడ్లీ ప్లేటులను తీసుకొని వాటికి కొంచం నెయ్యిని రాయాలి. ఒక్కో ఇడ్లీ వేసే ప్లేటులో ఒక్కో జీడిపప్పును వేసుకవాలి. తరువాత ఇడ్లి పిండితో వాటిని ఫిల్ చేయాలి. మనం కలుపుకున్న పిండిని బట్టి 12 ఇడ్లీల వరకు వేసుకోవచ్చు.
7. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒక బౌల్ నీళ్లు పోసుకొని ఈ ఇడ్లీ ప్లేటులను అందులో వుంచి 15 నిమిశాల వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మీకు ఇడ్లీ ఓట్స్ ఇడ్లీ రెడీ అయినట్టే. కొబ్బరి, టమాట చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












