Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఉల్లి వడియాలు ఎప్పుడైనా తిన్నారా? కరకరలాడుతూ భలే రుచి,ఎలా చేసుకోవాలో చూడండి
డియాల తయారీలో అనేక రకాలు ఉన్నాయి. బియ్యం, సగ్గుబియ్యం, పెసర, మినప, రవ్వతో పాటు అనేక ఇతర పిండి వడియాలు ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా ఉల్లి వడియాలు తిన్నారా? ఉల్లి వడియాలు ఆంధ్ర, తెలంగాణా వంటకాలలో ఒక ముఖ్యమైన భాగం. ఉల్లి వడియాలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని తయారు చేయడం చాలా సులువు..అలాగే వీటిని నిల్వ చేయడం కూడా సులభం. ఉల్లి వడియాలను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
ఉల్లి వడియాలను నేరుగా స్నాక్స్ గా తినవచ్చు లేదా పప్పు, సాంబారు, కూరలలో కలిపి తినవచ్చు. ఉల్లి వడియాలను చట్నీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లి వడియాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఉల్లి వడియాల తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఉల్లి వడియాల తయారీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు: 1 కేజీ
నూనె: వేయించడానికి తగినంత
మినపప్పు: 1/2 కేజజీ
జీలకర్ర: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
ఉల్లి వడియాల తయారీ విధానం
-ఉల్లి వడియాలను తయారుచేయడం కోసం ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి కనీసం 4-5 గంటల పాటు నానబెట్టాలి.
-ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా తరగాలి.
-తర్వాత నానబెట్టిన మినపప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
-రుబ్బిన మినపప్పులో తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడియాలుగా చేసి ఒక కాటన్ వస్త్రంపై ఆరబెట్టాలి. ఉల్లి వడియాలను ఎండలో ఆరబెడితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
-వడియాలు పూర్తిగా ఆరిన తర్వాత నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వడియాలను వేయించేటప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాతే వేయించాలి,లేదంటే అవి నూనెను పీల్చుకుంటాయి.
-వేయించిన వడియాలను చల్లారనిచ్చి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వేయించిన వడియాలను చల్లారనిచ్చాకే డబ్బాలో నిల్వ చేయాలి, లేదంటే అవి మెత్తబడతాయి.
ఉప్పు చేప పప్పు చారు..రుచిలో దీనికి సాటి మరొకటి లేదు,ఎలా చేసుకోవాలంటే
ఉల్లి వడియాల ప్రయోజనాలు
ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఉల్లిపాయలు.. రక్తపోటును నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తాయి. మినపప్పులో.. ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మినపప్పు ఎముకలను బలోపేతం చేయడంలో, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












