మీ నోటికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం వెజిటబుల్ దోస!

Posted By:

మీ రోజు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా మరియు అద్భుతంగా ఉండాలంటే ఏమి చేయాలి? మీ అల్పాహారం రుచికరంగా ఉండాలి. మరియు ప్రత్యేకంగా ఉండాలి. రోజంతా కార్యకలాపాలకు ఉదయం అల్పాహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.కాబట్టి, మీ రోజంతా చాలా త్వరగా ఉండాలంటే, మీరు ఇక్కడ ఇచ్చిన సింపుల్ రెసిపీని తప్పక ప్రయత్నించండి.ఆరోగ్యకరమైన ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం వల్ల పోషకాహారం మెరుగుపడుతుంది. అయితే కొంతమందికి కూరగాయలు తినడం ఇష్టం ఉండదు. వారు ఖచ్చితంగా ఈ రెసిపీని ఇష్టపడతారు. దోసెలో కూరగాయలు వేస్తే రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

ఈరోజు బోల్డ్ స్కై మీతో ఒక రుచికరమైన వంటకాన్ని షేర్ చేస్తోంది. అదే వెజిటబుల్ దోసె. ఈ క్రిస్పీ దోసె మీ రుచి స్థాయిని పెంచుతుంది. దానికి కావలసింది రకరకాల కూరగాయలు మరియు దోసె పిండి. కూరగాయలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి మరియు ఈ కూరగాయలను దోస పైన ఉంచి రుచికరమైన దోసె తయారుచేసుకోవచ్చు.

పరిమాణం: 1
తయారీ సమయం: 15 నిమిషాలు
వంట సమయం: 5 నిమిషాలు

కావలసినవి:
* దోస పిండి - 1 కప్పు
*ఆవాలు - 1/2 స్పూన్
* బీన్స్ - 1 కప్పు
*క్యారెట్ -1కప్పు (తరిగినవి)
* బెల్ పెప్పర్(క్యాప్సికమ్) - 1/2కప్పు (తరిగిన)
* పచ్చిబఠానీ - పిడికిలి పరిమాణం
*టమోటో - 1/2 (తరిగినవి)
* పచ్చిమిర్చి - 2 (తరిగినవి)
*ఉల్లిపాయ - 1(తరిగినవి)
*నూనె - 1 స్పూన్
*కరివేపాకు - 2 స్పూన్లు (తరిగినవి)
*ఉప్పు - రుచి ప్రకారం

తయారు చేసే విధానం:
* ముందుగా కూరగాయలను ఉడికించాలి; బఠానీలు కుక్కర్‌లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి
* కూరగాయల నుండి నీటిని తీసివేయండి
*పాన్‌లో 1/2 tsp నూనె వేడి చేసి అందులో ఆవాలు మరియు పచ్చిమిర్చి వేయాలి.
*ఈ మిశ్రమానికి కూరగాయలను వేసి బాగా కలపాలి
* దీన్ని దోసె పిండిలో కలపండి. టొమాటోలు, ఉల్లిపాయల మరియు కరివేపాకులను పిండిలో వేసి కలపండి.
* దోస పాన్ స్టౌ మీద పెట్టి, వేడి అయ్యాక దోసె పిండి పోసి దోసె వేసుకోవాలి
*దోస కర్రతో పాన్ నుండి దోసను తిప్పండి. రెండు వైపులా కాల్చిన తర్వాత వేడి గా సర్వ్ చేయండి.
*వెజిటేబుల్ దోసెను వెజిటేబుల్స్ పచ్చిగా కూడా అలాగే దోసె మీద చిలకరించుకోవచ్చు

దోసెను సాంబార్ చట్నీ లేదా కెచప్‌తో సర్వ్ చేయండి. ఇది మీకు రుచికరమైన అల్పాహారం అనడంలో సందేహం లేదు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion