For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!

బాదం చట్నీతో మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

బాదం పప్పుతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. వీటిని మనం రెగ్యులర్ నేరుగా తినడం లేదా ఏదైనా స్వీట్ రెసిపీలో వేసి తినడం వంటివి చేస్తూ ఉంటాం.

How to making alomond chutney in Telugu

అయితే బాదం పప్పుతో చట్నీ తయారు చేస్తారని మీకు తెలుసా... బాదంపప్పుతో చట్నీ ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది.. చూస్తున్నది నిజమే.. బాదంతో చట్నీ కూడా చేయొచ్చు.

How to making alomond chutney in Telugu

అంతేకాదు ఈ చలికాలంలో బాదంపప్పుతో చట్నీ రెసిపీ చేసుకుంటే బోలెడన్నీ లాభాలున్నాయంట. ఇంతకీ బాదం పప్పుతో చట్నీ ఎలా తయారు చేయాలి.. దీని కోసం ఏయే పదార్థాలు కావాలి.. దీనికి ఎంత సమయం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

బాడీలో వేడి పెరిగేందుకు..

బాడీలో వేడి పెరిగేందుకు..

బాదం పప్పు గురించి భారతదేశంలో తెలియని వారుండరు. అలాగే తినని వారు కూడా ఎవ్వరూ ఉండదు. ఇవి ఎప్పుడు తిన్న తియ్యగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నిషీయం, ఐరన్, కాల్షియంతో పాటు అనేక పోషక విలువు ఉన్నాయి. ఇవి మనలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అంతేకాదండోయ్ మన బాడీలో వేడిని కూడా బాగా పెంచుతాయి.

కావాల్సిన పదార్థాలు..

కావాల్సిన పదార్థాలు..

ఇప్పుడు బాదంపప్పు చట్నీకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం.

- బాదం - అర కప్పు

- కొత్తిమీర - ఒక కట్ట

- పుదీనా - ఒక కట్ట

- పచ్చిమిరప - నాలుగైదు లేదా రుచికి తగినట్టు

- వెల్లుల్లి - రెండు లేదా మూడు రెమ్మలు

- అల్లం - చిన్నముక్క

- చింతపండు పులుసు - రెండు స్పూన్లు

- నల్ల ఉప్పు, పంచదార - తగినంత

- చాట్ మసాలా - అవసరమైతే

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా బాదం పప్పును బాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత దానిలో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి మంచి పేస్ట్ లా మార్చుకోవాలి. అవసరాన్ని బట్టి నీరు లేదా పెరుగు కలుపుకోవచ్చు. ఆ తర్వాత చింతపండు పులుసు లేదా నిమ్మరసం వేసి కలపండి. నల్ల ఉప్పు, పంచదార, చాట్ మసాలా ను కూడా వేసి బాగా కలపండి.

బాదం చట్నీ రెడీ..

బాదం చట్నీ రెడీ..

అంతే మీరు కోరుకున్న బాదం చట్నీ రెడీ అయిపోతుంది. ఈ బాదం పప్పు చట్నీని పరోటాలతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. లేదా చపాతి, పుల్కాలతో అయినా కలిపి తినొచ్చు.

చర్మం పొడిబారకుండా..

చర్మం పొడిబారకుండా..

బాదంపప్పు చట్నీని చలికాలంలో తీసుకుంటే.. మన చర్మం పొడిబారకుండా ఉంటుంది. వీటిలో చర్మానికి మేలు చేసే పోషకాలేన్నో ఉన్నాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదండోయ్ వీటిలో ఉండే విటమిన్ వల్ల మీ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

బాదం పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయగలుగుతాయి. ఇవి ఇమ్యూనిటీని బలంగా మారుస్తాయి. చలికాలంలో వచ్చే జలుబు, ముక్కుదిబ్బడ, జ్వరం వంటి వాటిని రక్షణ కల్పిస్తాయి.

English summary

Badam Chutney Recipe | How to Make Almond Chutney in Telugu

Here we talking about the how to making almond chutney in Telugu. Read on
Desktop Bottom Promotion