Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Weekend special recipe :హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ..ఇలా చేసుకుంటే ప్లేట్ నాకేస్తారంతే
బిర్యానీ అంటే హైదరాబాద్..హైదరాబాద్ అంటే బిర్యానీ పేరు గుర్తుకువస్తది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లి బిర్యానీ తిన్నా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ రాదు. అందుకే ఈ భూమ్మీద బిర్యానీ అత్యంత టేస్టీగా ఉండేది ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పేస్తారు ఏ దేశంలో అయినా. అంత ఫేమస్ మన బిర్యానీ. అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్లలో వచ్చే టేస్ట్ మాదిరి ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. హైదరాబాద్ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
హైదరాబాద్ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ తయారీకి
కావాల్సినవి
-బాస్మతి బియ్యం
-క్యారెట్
-బీన్స్
-బంగాళదుంప
-పచ్చిమిర్చి
-నెయ్యి
-పచ్చి బఠానీ
-ఫ్రైడ్ ఆనియన్
-పచ్చిమిర్చి చీలికలు
-దాల్చిన చెక్క
-యాలకలు
-షాజీరా
-బిర్యానీ ఆకు
-లవంగాలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కొత్తిమీర
-పుదీనా
-కారం
-పసుపు
-ఉప్పు
-ధనియాల పొడి
-వేయించిన జీలకర్ర పొడి
-గరం మసాలా
-నిమ్మకార రసం
-పెరుగు
-పచ్చి బఠానీ
-కుంకుమ పువ్వు
-వేడిపాలు
-అనాస పువ్వు
హైదరాబాద్ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కప్పు అంటే 325 గ్రాముల బాస్మతి బియ్యంని గంట పాటు నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి.
-మరుగుతున్న నీళ్లల్లో చెక్కు తీసిన 1 బంగాళదుంప ముక్కలు,6 ఫ్రెంచ్ బీన్స్, 1 క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు కొన్ని, చిటికెడు పసుపు,కొంచెం ఉప్పు వేసి ఉడికించండి.
-70 శాతం వరకు ఉడికిన తర్వాత అంటే 5 నిమిషాల్లో పూర్తిగా ఉడుకుతాయి అనుకున్నప్పుడు వీటన్నింటిని బాండీలోనుంచి ఓ బౌల్ లోకి తీసుకొని వాటిమీద కొన్ని చన్నీళ్లు పోసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో ఈ ఉడికించినవన్నీ వేసేయండి. ఇందులోనే అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టిన పిడికెడు పచ్చి బఠానీ, పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్,2 పచ్చిమిర్చి చీలికలు, 1 ఇంచు దాల్చిన చెక్క,5 యాలకలు, 1 టీస్పూన్ షాజీరా,1 బిర్యానీ ఆకు,4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా,1 టేబుల్ స్పూన్ కారం, పావు చెంచా పసుపు,తగినంత ఉప్పు,1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరం మసాలా,నిమ్మకార రసం కొంచెం వేసి అన్నీ కలిసేటట్లు బాగా కలపండి.
-తర్వాత అందులోనే అరకప్పు మీగడతో ఉన్న పెరుగు వేసి కలిపి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలిపి గిన్నెను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మరో పెద్ద గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో 2 లీటర్ల నీళ్లు పోసి అవి కొంచెం వేడయ్యాక అందులో 6 లవంగాలు, 6 దంచిన యాలకలు, 1 నల్ల యాలక, 1 టీస్పూన్ షాజీరా,1 బిర్యానీ ఆకు,1 అనాస పువ్వు,2 టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్,ఇందులో ఉండే ఉప్పే రైస్ కి పడుతుంది కాబట్టి సరిపడా ఉప్పు వేసి నీరుని తెర్లకాగనివ్వండి.
-నీళ్లు తెర్లకాగుతున్నప్పుడు అందులో గంటపాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఇందులోనే 1 పచ్చిమిర్చి చీలిక, అర చెక్క నిమ్మరసం పిండుకోండి.
-70 శాతం వరకు అంటే పట్టుకుంటే సగంపైన ఉడికి ఇంకా కొంచెం పలుకు ఉండేట్లు ఉన్నప్పుడు రైస్ ని కొద్ది తీసి మసాలలన్నీ కలిపి ఉంచిన వెజిటేబుల్స్ మీద రెండు లేయర్స్ గా వేసుకోండి. తర్వాత 80 శాతం వరకు ఉడికిన రైస్ ని మరో లేయర్ గా, 90 శాతం ఉడికిన రైస్ ని మరో లేయర్ గా వేజిటేబుల్స్ మీద వేసుకోవాలి.
-ఇప్పుడు బిర్యానీ గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో అంచుల వెంట రైస్ ఉడికించుకున్న నీళ్లు కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి,వేడి పాలల్లో చిటికెడు నానబెట్టిన కుంకుమ పువ్వు,పవు చెంచా గరం మసాలా,2 టేబుల్ స్పూన్ వేయించిన ఆనియన్,1 టీస్పూన్ కొత్తిమీర చల్లి మూతపెట్టేసి 15 నిమిషాలు లో ప్లేమ్ మీద ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆపేసి మరో 15 నిమిషాలు వదిలేసేయండి.
-ఇంతే హైదరాబాదీ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












