For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిలేబీ రెసిపీ: ఇంట్లో స్వయంగా.. సులభంగా జిలేబి ఎలా తయారుచేయాలి

Posted By: Lekhaka
|

జిలేబి ప్రసిద్ధి చెందిన ఉత్తర భారతీయ తీపి వంటకం. ఇది దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జిలేబిని పండుగలు మరియు శుభకార్యాల్లో తయారుచేస్తారు. జిలేబి చక్కర పాకంలో ముంచి తయారుచేసే కరకరలాడే తీపి వంటకం.

జిలేబి పిండిని 6 నుంచి 8 గంటల పాటు పులియ బెడతారు. అందువల్ల జిలేబి కొంచెం పులుపు రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు త్వరగా రెడీ అయ్యే విధంగా జిలేబి రెసిపీ తయారీని చెప్పుతున్నాం.

ఇంటిలో తయారుచేసుకునే జిలేబి రుచి బయట కొనుకోలు చేసిన జిలేబి రుచినే కలిగి ఉంటుంది. ఇక్కడ మేము జిలేబి రుచి పులుపు కోసం ఎటువంటి పదార్ధాన్ని కలపటం లేదు. అయితే జిలేబి కొంచెం పుల్లగా ఉండాలని అనుకుంటే పిండికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి.

జిలేబి సాధారణ మరియు త్వరగా తయారయ్యే రెసిపీ. జిలేబి తయారీలో పిండిని సరైన పాళ్లల్లో కలపాలి. జిలేబి త్వరగా ఎలా తయారుచేయాలో ఈ వీడియోలో చూడండి. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రక్రియను ఫోటోలలో చూడండి.

జిలేబి వీడియో రెసిపీ

జిలేబి రెసిపీ | ఇంటిలో త్వరగా జిలేబి ఎలా తయారుచేయాలి | హోమ్ మెడ్ జిలేబి రెసిపీ | ఇన్ స్టెంట్ జిలేబి రెసిపీ
జిలేబి రెసిపీ | ఇంటిలో త్వరగా జిలేబి ఎలా తయారుచేయాలి | హోమ్ మెడ్ జిలేబి రెసిపీ | ఇన్ స్టెంట్ జిలేబి రెసిపీ
Prep Time
15 Mins
Cook Time
25M
Total Time
40 Mins

Recipe By: మీనా భండారీ

Recipe Type: స్వీట్

Serves: 10-12 ముక్కలు

Ingredients
  • మైదా - 1 కప్పు

    శనగ పిండి - 1 టేబుల్ స్పూన్

    తాజా పెరుగు - 1 కప్పు

    చక్కెర - 1 కప్పు

    నీరు - 4 కప్పులు

    కుంకుమ పువ్వు - 4-5 రేకలు

    ఫ్రూట్ సాల్ట్ - చిటికెడు

    కుంకుమ పువ్వు రంగు - చిటికెడు

    నెయ్యి - 1 కప్పు

How to Prepare
  • 1. బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి.

    2. దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి.

    3. ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి.

    4. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.

    5. ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.

    6. పంచదారలో నీరు పోయాలి.

    7. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.

    8. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి.

    9. తక్కువ మంట మీద బాగా కలపాలి.

    10. పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలపాలి.

    11.ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.

    12. బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.

    13. పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిముషాలు వేడి చేయాలి.

    14. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్ తీసుకొని బాటిల్ ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి.

    15. జిలేబి రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి.

    16. రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి.

    17. బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

    18. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.

    19. వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి.

Instructions
  • 1. పెరుగు పుల్లగా లేకుండా తాజాగా ఉండాలి.
  • 2. జిలేబి పుల్లగా కావాలని అనుకుంటే పిండిని 6 నుంచి 7 గంటలు పులియబెట్టాలి.
  • 3. పుల్లని జిలేబి త్వరగా కావాలంటే జిలేబి పిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి.
  • 4. మైదా పరిమాణం పంచదార పరిమాణం రెండు సమానంగా ఉండాలి.
  • 5. జిలేబిలు వేగించినప్పుడు ఉబ్బాలంటే ఫ్రూట్ సాల్ట్ ఉపయోగించాలి.
Nutritional Information
  • సర్వింగ్ సైజ్ - 1 ముక్క
  • కేలరీలు - 310 కేలరీలు
  • కొవ్వు - 10 గగ్రాములు
  • ప్రోటీన్ - 2 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు - 54 గ్రాములు
  • షుగర్ - 20 గ్రాములు

స్టెప్ బై స్టెప్

1. బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి.

2. దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి.

3. ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి.

4. కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.

5. ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి.

6. పంచదారలో నీరు పోయాలి.

7. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.

8. కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి.

9. తక్కువ మంట మీద బాగా కలపాలి.

10. పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలపాలి.

11.ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.

12. బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి.

13. పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిముషాలు వేడి చేయాలి.

14. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్ తీసుకొని బాటిల్ ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి.

15. జిలేబి రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి.

16. రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి.

17. బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

18. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.

19. వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి.

[ of 5 - Users]
English summary

Jalebi Recipe | How To Make Instant Jalebi At Home | Homemade Jalebi Recipe | Instant Jalebi Recipe | జిలేబి రిసిపి | ఇంట్లోనే స్వయంగా తయారుచేయడం ఎలా | హోం మేడ్ జిలేబి రిసిపి | ఇన్ స్టాంట్ జిలేబి రిసిపి

Jalebi is a traditional and popular North Indian sweet that is prepared during festivals. Watch the video recipe and also follow the step-by-step procedure
Story first published: Tuesday, October 17, 2017, 11:52 [IST]
Desktop Bottom Promotion