For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నికృష్ణుడికి ఇష్టమైన వంటకాలేంటో తెలుసా...

కృష్ణాష్టమి ఎలాంటి నైవేద్యాలను ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Posted By:
|

శ్రీకృష్ణుడి జన్మదినం రోజున మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శనగపప్పు వంటి వాటిని కూడా నివేదన చేస్తారు.

ఇవి మాత్రమే కాకుండా సొంటితో తయారుచేసి కట్టెకారం, చక్కెర కలిపిన మినప్పిండిని కూడా ప్రసాదంగా సమర్పించుకుంటారు.

ఈ రెండూ ఆహారాలను చిన్నారుల తల్లులకు పెట్టేవి కావడం విశేషం. ఎందుకంటే చిన్నికృష్ణుడు అప్పుడే జన్మించాడు. అంటే ఆయనకు జన్మనిచ్చిన దేవకీ మాత, ఆడబిడ్డకు జన్మనిచ్చిన యశోదా దేవి ఇద్దరూ బాలింతలుగా ఉంటారు.

అందుకే ఇలాంటి ఆహారం పెడుతుంటారని.. ఇది ఒక కారణమని పెద్దలు చెబుతుంటారు. అయితే కృష్ణాష్టమి నాడు చిన్నికృష్ణుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూతో పాటు కొన్ని రకాల ప్రసాదాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Krishna Janmashtami 2020: ఈ పనులు చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయట...!

కొబ్బరి లడ్డూ..

కొబ్బరి లడ్డూ..

కావాల్సినవి : కొబ్బరికాయ-1

పాలు - ఒక లీటరు

బొంబాయి రవ్వ - అరకప్పు

చక్కెర - తగినంత

యాలకుల పొడి కొద్దిగా..

నెయ్యి - తగినంత

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా కొబ్బరికాయను నీటిగా పగులగొట్టి దాని యొక్క తురుము తీసుకుని పక్కనపెట్టుకోవాలి. బొంబాయి రవ్వలో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఒక పాత్రలో నీరు కలపని పచ్చిపాలు, కొబ్బరి తురుము, చక్కెరను వేసి మరగనివ్వాలి. ఆ మిశ్రమం చిక్కబడే సమయంలో బొంబాయి రవ్వ, యాలకుల పౌడర్ ను వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల తర్వాత ఆ పాత్రను గ్యాస్ మీద నుండి తీసి చల్లారిన తర్వాత లడ్డూలుగా తయారు చేసుకుంటే సరిపోతుంది.

శనగపప్పు పాయసం..

శనగపప్పు పాయసం..

కావాల్సినవి : శనగపప్పు - ఒక కప్పు, బెల్లం పౌడర్ - తగినంత, పాలు-ఒక కప్పు, నెయ్యి-టేబుల్ స్పూన్, యాలకుల పౌడర్-తగినంత, కాజు, బాదంపప్పు - కొంచెం

Krishna Janmashtami 2020 : శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారంటే...

తయారీ విధానం..

తయారీ విధానం..

కుక్కర్లో ఒకటికన్నర కప్పు నీరు వేసి, దానిలో శనగపప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఈలోపు బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. దీని కోసం పాత్రలో పావు కప్పు నీరు పోసి గ్యాస్ స్టవ్ పై పెట్టాలి. దీనిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి సన్నని మంటపై నీరు ఇంకేదాకా మరగించాలి.

అటుకులు, బెల్లం లడ్డు

అటుకులు, బెల్లం లడ్డు

కావాల్సినవి : రెండు కప్పుల అటుకులు, అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు, అరకప్పు పల్లిలు, ఒక కప్పు బెల్లం పౌడర్, వేడిపాలు తగినంత

తయారీ విధానం..

తయారీ విధానం..

అటుకులు, కొబ్బరిముక్కలు, పల్లిలను వేర్వేరుగా తీసుకుని మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారు చేసుకోవాలి. ఓ పాత్రలో వీటన్నింటినీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అదే మిశ్రమంలో కొంచెం పాలు వేసి కలుపుతూ గుండ్రంగా ఉండే ఉండల్లాగా చేసుకోవాలి.

[ of 5 - Users]
English summary

Janmashtami Special: Easy Recipe Of Coconut Laddu In Telugu

Here we talking about janmashtami special : easy recipe of coconut laddu in telugu. Read on
Desktop Bottom Promotion