కొన్ని రోజుల్లోనే శరీరంలో అద్భుతాలు చేసే జొన్న దిబ్బ రొట్టె..షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు,ఎలా చేయాలంటే

Posted By:

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన, రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం జొన్న దిబ్బరొట్టె. ఇది జొన్నలతో తయారుచేసే ఒక రకమైన మందపాటి రొట్టె. బియ్యం,గోధుమలతో పోలిస్తే జొన్నలు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల ఈ దిబ్బరెట్టెను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రుచికరమైన జొన్న దిబ్బరొట్టెను ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. జొన్న దిబ్బరొట్టె తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

జొన్న దిబ్బరొట్టె తయారుచేయడానికి కావలసిన పదార్థాలు

జొన్న పిండి- 2 కప్పులు
మినప పిండి- 1/2 కప్పు
బియ్యం రవ్వ లేదా ఇడ్లీ రవ్వ- 1/2 కప్పు
ఉల్లిపాయ- 1 చిన్నది
పచ్చిమిర్చి - 2-3
కొత్తిమీర- కొద్దిగా
జీలకర్ర- 1/2 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1/2 టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి- కాల్చడానికి తగినంత
నీరు - పిండి కలుపుకోవడానికి తగినంత

జొన్న దిబ్బరొట్టె తయారీ విధానం

-ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి,మినప పిండి వేసుకోవాలి. మీరు మినపప్పును నానబెట్టి రుబ్బుకుని వేసుకుంటుంటే ముందుగా దానిని మెత్తగా రుబ్బుకుని ఈ పిండిలో కలపాలి.

-మీరు బియ్యం రవ్వ లేదా ఇడ్లీ రవ్వను ఉపయోగిస్తుంటే వాటిని కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఇది దిబ్బరెట్టెకు కొంచెం గట్టిదనం, క్రిస్పీనెస్ ఇస్తుంది.

-తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

-రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి బాగా కలపాలి.

-కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా బాగా కలపడం ముఖ్యం.

-కలిపిన పిండిని కనీసం 15-20 నిమిషాలు నాననివ్వాలి. దీనివల్ల పిండి బాగా కలిసి దిబ్బరెట్టె మెత్తగా వస్తుంది.

-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి పెనం లేదా నాన్ స్టిక్ పాన్ పెట్టి వేడి చేయాలి.

-పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనం మీద కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో మందపాటిగా వేయాలి. దీనిని దోశలాగా పలుచగా రుద్దకూడదు. సుమారు 1/2 నుంచి 3/4 అంగుళం మందంలో ఉండేలా చూసుకోవాలి.

-దిబ్బరెట్టె చుట్టూ, పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి.

-పెనం మీద మూత పెట్టి 5-7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. దీనివల్ల లోపల పిండి బాగా ఉడుకుతుంది.

Healthy breakfast: ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ కు ఇది చాలు..ఈ దోశ తింటే డాక్టర్ అవసరం లేదు,ఎలా చేయాలంటే

-తర్వాత మూత తీసి దిబ్బరెట్టెను నెమ్మదిగా తిప్పి మరోవైపు కూడా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు.

-రెండు వైపులా బాగా కాలిన తర్వాత దిబ్బరెట్టెను ప్లేట్‌లోకి తీసుకొని మీకు ఇష్టమైన పచ్చడి, పెరుగు లేదా సాంబార్‌తో వేడి వేడిగా తింటే నోట్లో బ్లాస్టే

[ of 5 - Users]
Story first published: Sunday, April 6, 2025, 23:22 [IST]
Desktop Bottom Promotion