Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కారం బొరుగులు /మసాలా కారం బొరుగులు స్పైసీగా ఈవెనింగ్ స్నాక్ స్ట్రీట్ స్టైల్లో
పఫ్డ్ రైస్ దీన్నె తెలుగులో బొరుగులు, మరమరాలు అని పిలుస్తుంటారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఈవెనింగ్ స్నాక్ ను వర్షాకాలంలో సాయంత్రంలో టీ తాగడానికి ముందు కారకారంగా ఏదైనా కోరుకుంటారు. అలాంటి స్నాక్ రిసిపిలలో మసాలా బొరుగులు ఒకటి. రుచిగా..కమ్మగా..కారకారంగా తింటుంటే మరికొన్ని తినాలనిపిస్తుంది. ఈ కారం బొరుగుతలను, వేరుశెనగలు, ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి మరియు కరివేపాకులను ఉపయోగించి తయారుచేసిన టీ టైమ్ స్నాక్స్ రిసిపి. ఈ చురుమురి తరిగిన ఉల్లిపాయ, టొమాటో మరియు కొత్తిమీరతో తయారుచేస్తారు.
ఈ బొరుగులు బాగా ప్రజాదరణ పొందినవి. ఈ బొరుగులు ఈవెనింగ్ స్నాక్ మాత్రమే కాదు ట్రావెలింగ్ సమయంలో టైంపాస్ గా కూడా తీసుకెళుతుంటారు. విశ్వవ్యాప్తంగా ఇష్టపడే ఈ క్రీస్పీ క్రంచీ స్నాక్ సాధారణంగా స్ట్రీట్స్ లో బండ్ల మీద అమ్ముతుంటారు. ఇది ఒక కప్పు టీతో సర్వ్ చేస్తే ఇక ఆ ఆహ్లాదకర సాయంత్రం మర్చిపోలేము. దీన్ని కారంగా తీనాలని కోరుకునే వారు అప్పటికప్పుడు తయారుచేసుకుంటే టేస్టీగా ఉంటుంది. వడ్డించే ముందు, మీరు తరిగిన ఉల్లిపాయ, టొమాటో మరియు కొత్తిమీర ఆకులతో పైన వేయవచ్చు. ఈ టేస్టీ మరియు స్పైసీ బొరుగులు తయారు చేయడం చాలా సులభం.
ఇప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఈ రుచికరమైన మరియు సులభమైన స్నాక్స్ సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయం. పిల్లలు తమ సాయంత్రం స్నాక్స్‌గా దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పిల్లలే కాదు.., ఈ మిశ్రమం లేదా స్నాక్స్ అందరికీ నచ్చుతాయి. మీరు ఒకే రకమైన స్నాక్స్ వంటకాల కోసం చూస్తున్నట్లయితే, వెంటనే దీన్ని ట్రై చేయండి కారం మరియు రుచికరమైన బొరుగులు ఎలా తయారుచేయాలి, ఏయే పదార్థాలు కావాలి ఇక్కడ తెలుసుకోండి.
తయారీ సమయం: 10 నిమిషాలు
వంట సమయం: 0 నిమిషాలు
పరిమాణం: 4 మందికి
కావలసిన పదార్థాలు:
బొరుగులు 4 - 6 కప్పులు
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
1 సన్నగా తరిగిన టమోటా
1 చిన్న తురిమిన క్యారెట్
తురిమిన మామిడి 2 టేబుల్ స్పూన్లు
2 టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర ఆకులు
వేయించిన వేరుశెనగ గింజలు 2 టేబుల్ స్పూన్లు
1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి (కావాలనుకుంటే - అదనపు కారం కోసం)
1/2 - 1 టీస్పూన్ కారం పొడి
1/4 టీస్పూన్ పసుపు పొడి
2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె / వంట నూనె (కొబ్బరి నూనె
ప్రాధాన్యత)
రుచికి ఉప్పు
కారం బొరుగులు తయారుచేయు విధానం:
- ఒక పెద్ద గిన్నెలో క్రిస్పీగా ఉండే బొరుగులు తీసుకోండి. బొరుగులకి కరకరలాడకపోతే పాన్ లో వేసి 5 నిముషాలు వేడిచేసుకోండి.
- ఇప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు, కొబ్బరి నూనె వేయాలి.
- బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే రుచికి సరిపడా చిటికెడు చాట్ మసాలా కూడా జోడించవచ్చు.
- వేయించిన వేరుశెనగ గింజలను జోడించండి. మీరు కాంగ్రెస్ వేరుశెనగలు లేదా ఏదైనా వేయించిన పచ్చిశెనగపప్పు మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు.
- సన్నగా తరిగిన ఉల్లిపాయ, తురిమిన క్యారెట్, తురిమిన మామిడి, తరిగిన కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి మరియు టమోటో జోడించండి.
- బాగా మిక్స్ చేయాలి మరియు వెంటనే సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












