For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రైడ్ ఆకుకూర-చికెన్ రిసిపి: మాన్ సూన్ స్పెషల్

|

క్రిస్పీ స్పినాచ్ చికెన్ ...పేరు వింటేనే నోరూరిచే చికెన్ ఇది . ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగించే ఆహారపదార్థాలు. ఎందుకంటే వీటిలో అత్యధికంగా న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మరియు ఈ సీజన్ లో ఎక్కువగా మనకు అందుబాటులో ఉండేది ఇది . ఆకు కూరలో 65గ్రాముల ప్రోటీన్స్ మరియు 10 గ్రాముల ఫ్యాట్ కలిగి ఉంటుంది.

READ MORE: ఆకుకూర చికెన్ కర్రీ: హెల్తీ నాన్ వెజ్ రిసిపి

ఈ లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువ విటమిన్స్ కలిగి ఉండే వ్యాధినిరోధకతను పెంచుతాయి. అందువల్ల ఈ వర్షకాలంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలు చేర్చుకోవాల్సింది. వీటితో పాటు కాస్త వెరైటీగా నాన్ వెజ్ ప్రియులు చికెన్ జోడించి తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ ను అందివ్వ వచ్చు. మరియు క్యాలరీలు కూడా తగ్గించుకోవచ్చు. మరి ఈ స్పెషల్ మాన్ సూన్ ట్రీట్ ఎలా తయారుచేయాలో చూద్దాం....

Crispy Spinach Chicken Recipe: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ ఫ్రైడ్ చికెన్ - 6 పీస్
ఆకుకూర - 4 cups
నూనె - ఫ్రై చేసుకోవడానికి
వెల్లుల్లి - 4 tsp (సన్నగా కట్ చేసుకోవాలి)
నువ్వులు - 3 tsp
ఉప్పు రుచికి సరిపడా
పంచదార- 2 tbsp

READ MORE: స్పైసి పెప్పర్ క్యాప్సికమ్ చికెన్ రిసిపి

తయారుచేయ విధానం :
1. డీప్ ప్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో స్ట్రెయినర్(జల్లు గరిట వంటిది)తీసుకొని అందులో శుభ్రం చేసుకొన్న ఆకుకూరలు వేసి 5 నిముషాలు డీఫ్రై చేసుకోవాలి.
2. క్రిస్పీగా తయారు అయిన తర్వాత స్ట్రెయినర్ తో తీసి ఒక ప్లేట్ లో వేసి పెట్టుకోవాలి.
3. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో కొద్ది నూనె వేసి, వేడి అయ్యాక అందులో వెల్లుల్లి మరియు నువ్వులు వేయాలి .
4. నువ్వులు వేగిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకొన్న ఆకు కూర, పంచదార మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

READ MORE: ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్

6. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో ఫ్రై చేసిన బోల్ లెస్ చికెన్ ను తీసుకొని ప్లేట్ మద్యలో పెట్టి, దాని మీద ఫ్రైచేసి, పోపు పెట్టిన క్రిస్పీ ఆకుకూరను గార్నిష్ గా వేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్రిస్పీ స్పినాచ్ చికెన్ రిసిపి రెడీ...

English summary

Crispy Spinach Chicken Recipe: Telugu Vantalu

Crispy spinach chicken - the name itself sounds like a treat to the ears. Spinach is one of the best ingredients since it is highly nutritious. One serving of spinach contains 65 gms of protein and 10 gms of fat.
Story first published: Tuesday, June 23, 2015, 13:02 [IST]
Desktop Bottom Promotion