For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్మనీ అండ్ టేస్టీ చికెన్ వ్రాప్ రిసిపి..

|

అమ్మ వంటను మిస్ అవుతున్నారా? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, బయటక ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారా? బయట ఆహారాలతో బోరుకొడుతున్నాదా? ఇవే మీ సమస్యలైతే మీకు కోసం ఒక సింపుల్ అండ్ వెరైటీ రిసిపిని పరిచయం చేస్తున్నాము.

చాలా సింపుల్ గా తయారుచేసుకోగల చికెన్ వాప్ రిసిపిని మీకు అందిస్తున్నాయి. దీన్ని చిటికెలో తయారుచేసుకోవచ్చు . దీన్ని రోజులో ఎప్పుడైనా తయారుచేసుకుని తినొచ్చు. రోజంతా బిజీగా ఉండి, వంటచేయలేని పరిస్థితిలో ఇలాంటి సింపుల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవచ్చు .

భోజనం మానేయడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. మరుసటి రోజు చురుకుగా ఉండలేరు, చురుకుగా పనిచేయాలేరు కాబట్టి, అల్పాహారమైనా సరే పూర్తి పోషకాలతో ఉండే ఆహారాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అలాంటి వాటిలో చికెన్ వ్రాప్ ఒకటి . మీరు వెజిటేరియన్స్ అయితే పొటాటోతో పాటు మరికొన్ని వెజిటేబుల్స్ జోడించి వ్రాప్ తయారుచేసుకోవచ్చు. మరి నాన్ వెజ్ ప్రియులు ఎంజాయ్ చేయడానికి ఒక చికెన్ వ్రాప్ రిసిపి...ః

Quick And Tasty Chicken Wrap Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ - 200 g
ఉల్లిపాయలు - 1 cup (chopped)
టమోటోలు- 1 cup (chopped)
క్యాప్సికమ్ - 1 cup (chopped)
మొయోనైజ్ - 2 teaspoons
గ్రీన్ చిల్లీస్ - 5 to 6
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 teaspoon
కొత్తిమీర - 1 cup
పెప్పర్ - 1 teaspoon
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

చపాతీ పిండికోసం :
గోధుమపిండి - 2 cups
మైదా - 1 cup
ఉప్పు: 1/2tsp
నూనె: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, అందులో ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే క్యారెట్, క్యాప్సికప్, మరియు బోలెన్స్ చికెన్ ఖీమా వేసి ఫ్రై చేసుకోవాలి.
3. మద్యలో కొద్దిగా ఉప్పు చిలకరించి ఫ్రై చేయడం వల్ల మరీ డ్రైగా కాకుండా ఫ్రై చేసుకోవచ్చు,.
4. తర్వాత అందులోనే పెప్పర్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి మిక్స్ చేస్తూ 10 నిముషాలు వేగించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
5.అంతలోపు చపాతీ పిండిని కలిపి పెట్టుకోవాలి. అందుకోసం సిద్ధం చేసుకున్న గోధుమ, మైదాపిండి, ఉప్పు , నూనె మరియు నీరు కూడా వేసి చాపాతీ పిండికి తడిపుకున్నట్లు తడిపి పక్కన పెట్టుకోవాలి.
6.తర్వాత చపాతీ పిండి నుండి కొద్దిగా పిండితీసుకొని ఉండలు చేసుకోవాలి .
7. ఇప్పుడు చపాతీ పీట మీద చపాతీలను రుద్ది పెట్టుకోవాలి.. రుద్ది పెట్టుకున్న ఒక్కొక్క చపాతీ సెంటర్లో, ముందుగా వండి పెట్టుకున్న చికెన్ మసాలా మిశ్రమాన్ని పెట్టాలి.
8. తర్వాత చపాతీని నీట్ గా రోల్ చేసి, వ్రాప్ లా చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత వ్రాప్ చేయాలి. అంతే తినడానికి చపాతీ వ్రాప్ రెడీ... ఈ చికెన్ వ్రాప్ ను సాస్ తో సర్వ్ చేయాలి.

English summary

Quick And Tasty Chicken Wrap Recipe

Do you miss your mom's cooking? Do you stay away from your family and are you tired of eating outside food? Relax, we are here to solve your problem.
Story first published:Friday, June 10, 2016, 16:49 [IST]
Desktop Bottom Promotion