For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ హాట్ తందూరి ప్రాన్ కర్రీ -వింటర్ స్పెషల్

|

ప్రాన్ కర్రీ ఒక బెస్ట్ ఫేవరెట్ రిసిపి. ఈ రిసిపి ప్రతి నాన్ వెజిటేరియన్స్ కు తప్పకుండా నచ్చుతుంది. ముఖ్యంగా ఇది సీఫుడ్ అంటే ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది . మనం ఎప్పుడు తయారుచేసే పద్దతిలోనే సీఫుడ్ ను తయారుచేయడం వల్ల మనకి బోర్ అనిపించవచ్చు. అటువంటప్పుడు ఇలాంటి ఒక టేస్టీ డిష్ ను తయారు చేసుకుంటే ఒక కొత్త రుచిని రుచి చూడవచ్చు. ఈ తందూరి ప్రాన్ కర్రీ చాలా టేస్ట్ గా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది.

తందూరి ప్రాన్ కర్రీ ఒక రెస్టారెంట్ ఫేవరెంట్ ఫుడ్. ఈ తందూరి ప్రాన్ కర్ర తయారుచేయడం అంత కష్టమైన పనేం కాదు. దీన్ని చాలా త్వరగా మరియు సులభంగా, తయారుచేయవచ్చు. ఈ తందూరి ప్రాన్ రిసిపి ని మొదట ప్రాన్స్ ను గ్రిల్ చేసుకొని తర్వాత గ్రేవీ తయారుచేసుకొని మిక్స్ చేయాలి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Red Hot Tandoori Prawns Curry Recipe

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్: 500grm(మీడియం సైజ్, రొయ్యలకు పై డొల్ల(పెంకు)తొలగించి పెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయలు: 2 (చిన్నముక్కలుగా తరిగాలి)
నిమ్మరసం: 1tbsp
పెరుగు: 2tbsp
వాము: 1/2 tsp
పచ్చిమిర్చి : 2 (చిన్న ముక్కలుగా తరిగాలి)
ధనియాలు పొడి : 1/2 tsp
తందూరి మసాలా పొడి: 2tbsp
ధనియాల పొడి: 1tsp
బే ఆకు: 1
పెప్పర్ కార్న్: 5
లవంగాలు: 4
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్ ను శుభ్రం చేసి, ఒక బౌల్లో తీసుకొని, నిమ్మరసం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా తందూరి మసాలా వేసి బాగా మిక్స్ చేసి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఓవెన్ ను 250డిగ్రీలలో పెట్టాలి.
2. ఇప్పుడు, మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ కు కొద్దిగా నూనె చిలకరించి ఒక స్టాక్ కు గుచ్చి పెట్టాలి.
3. గ్రిల్ చేసిన మ్యారినేట్ ప్రాన్స్ ను ఓవెన్ లో 10నిముషాల పాటు పెట్టాలి.
4. ఓవెన్ లో ప్రాన్స్ గ్రిల్ అయ్యేంత వరకూ అలాగే ఉంచి, అంతలోపు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
5. నూనె వేడయ్యాక అందులో అజ్వైన్, బిర్యానీ ఆకులు, పెప్పర్ కార్న్ మరియు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
6. 30సెకండ్ల తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిస్తూ, మంటను పూర్తిగా తగ్గించుకోవాలి.
7. ఉల్లిపాయ ముక్కలను 4నిముషాలు వేగించుకొన్న తర్వాత అందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మరో 2నిముషాలు వేయించుకోవాలి.
8. ఇప్పుడు, పెరుగులో కారం, ధరియాల పొడి మరియు తందూరి మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయడం వల్ల అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి.
9. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పాన్ లో వేసి రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
10. అంతలోపు ఓవెన్ లో ప్రాన్ గ్రిల్ అయ్యి ఉంటాయి. వాటిని బయటకు తీసి. గ్రేవీలో వేసి, నిధానంగా మిక్స్ చేయాలి .
11. ఇప్పుడు అరకప్పు నీళ్ళు పోసి మొత్త పూర్తిగా డ్రై అయ్యే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5నిముషాలు చాలా తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.చివరిగా కొత్తిమీర తరుగుతుతో గార్నిష్ చేయాలి. దీన్నివేడి వేడి అన్నం మరియు పరోటాతో సర్వ్ చేయాలి.

English summary

Red Hot Tandoori Prawns Curry Recipe

Prawn curry is one of the favourite dishes of any non vegetarian. This is especially true for people who just love seafood.
Story first published: Monday, January 6, 2014, 17:59 [IST]
Desktop Bottom Promotion