For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ చికెన్ లెగ్స్ రిసిపి: వీడియో

|

స్పైసీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈవెనింగ్ స్నాక్ రిసిపి. సాధారణంగా మనం ఇంట్లో చేసుకొనే ఈవెనింగ్ స్నాక్ చాలా సింపుల్ గా తయారుచేసేసుకుంటాం.

కానీ, కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్స్ తయారుచేసుకోవాలంటే ఫ్రైడ్ చికెన్ లెగ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఈజీ అండ్ సింపుల్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:

చికెన్ లెగ్స్: 2
పెప్పర్ కార్న్స్: 1tbsp
అల్లం: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు: 6-8
కారం : 1tsp
చికెన్ మసాలా: 2tsp
మైదా: 1/2cup
నూనె: 2cup
ఉప్పు: రుచికి సరిపడా

<center><iframe width="100%" height="417" src="//www.youtube.com/embed/44XbT7iDQcY" frameborder="0" allowfullscreen></iframe></center>

తయారుచేయు విధానం:

1. ముందుగా రెండు చికెన్ లెగ్ పీస్ లను తీసుకొని, కత్తితో సన్నగా గాట్లు పెట్టుకోవాలి. అలా గాట్లు పెట్టడం వల్ల మసాలా లోపలికి పీల్చుకుంటుంది.
2. తర్వాత మిరియాలు, అల్లం మరియు వెల్లుల్లి మెత్తగా పేస్ట్ తయారుచేసుకోవాలి. తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును చేర్చుకోవాలి.
3. ఇప్పుడు ఈ పేస్ట్ కు కారం, మరియు చికెన్ మసాలాను వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఈ చికెన్ మసాలాను చికెన్ లెగ్స్ కు అన్ని వైపులా బాగా పట్టించాలి. మసాలా బాగా పట్టించిన తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొన్న చికెన్ లెగ్స్ ను మైదాపిండిలో లైట్ గా పొర్లించి తర్వాత వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండిలో అద్దడం వల్ల మసాలా విడిపోకుండా ఉంటుంది.
6. మీడియం మంట మీద 5-10 నిముషాలు, చికెన్ లెగ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేయాలి. అంతే స్పైసీ చికెన్ లెగ్స్ రెడీ

English summary

Spicy Fried Chicken Legs Recipe: Video

Spicy fried chicken legs are a great way to celebrate your evenings. Usually, we keep evening snacks simple at home. However, to make your evening special, you can spice it up with some homemade fried chicken legs. Needless to say that spicy fried chicken legs are not exactly healthy. However, there is no harm in taking a look at this spicy fried chicken legs recipe with video if you try it once in a while.
Story first published: Tuesday, May 13, 2014, 12:31 [IST]
Desktop Bottom Promotion