Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
సూపర్ టేస్టీ, హెల్తీ పాలక్ రైస్..జస్ట్ 10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పాలకూర టాప్ ప్లేస్ లో ఉంటుంది. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ,చాలామంది పిల్లలు, పెద్దలు పాలకూర కూరగా వండితే తినడానికి ఇష్టపడరు. అలాంటివారి కోసం రుచికరమైన, సులభమైన వంటకం పాలక్ రైస్. ఇది లంచ్ బాక్స్ కు, త్వరగా భోజనం తయారు చేసుకోవడానికి, అతిథులు వచ్చినప్పుడు చేయడానికి చాలా సరైన ఎంపిక. కేవలం 10 నిమిషాల్లోనే దీనిని తయారుచేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా పాలక్ రైస్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-రైస్
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-పాలకూర
-కొత్తిమీర
-కరివేపాకు
-ఉప్పు
-పసుపు
-ఆయిల్
-పోపు దినుసులు
-నెయ్యి
-వెల్లుల్లి రెబ్బలు
పాలక్ రైస్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 లీటర్ నీళ్లు పోసి మరిగించాలి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో 4 చిన్న కట్టల పాలకూర వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పాలకూరను ఉడికించేటప్పుడు ఎక్కువసేపు ఉంచకూడదు. అలా చేస్తే దానిలోని పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది.
-2 నిమిషాలు ఉడికించిన పాలకూరను ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి.
-తర్వాత పాలకూరను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి.
-పోపు దినుసులు వేగాక అందులో 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు, కరివేపాకు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
-తర్వాత అందులో పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి.
-ఇప్పుడు ఇందులో మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్, 1 టీస్పూన్ పసుపు,రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులో 1 పెద్ద కప్పు రైస్ వేసి కలుపుకోవాలి.
-తర్వాత అందులో కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ పాలక్ రైస్ రెడీ.
ప్రయోజనాలు
పాలక్ రైస్ తినడం వల్ల రక్తహీనత (Anemia) సమస్యను నివారించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలక్ రైస్ వంటి వంటకాలు తినడం వల్ల క్యాలరీలను తక్కువగా తీసుకుంటూనే శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు, ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. పాలక్ రైస్ ను మరింత ఆరోగ్యకరంగా మార్చడానికి, మీరు కొన్ని కూరగాయలు (క్యారెట్, బీన్స్, బఠానీలు) కూడా కలుపుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












