For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం పురి రిసిపి: ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

పిల్లలు పెద్దలు తినగలిగే స్వీట్స్ రకాల్లో బాదం పూరి ఒకటి. ఈ స్వీట్ అండ్ స్నాక్ రిసిపిని రెండు మూడు లేయర్స్ గా చేసి తయారుచేస్తారు.
ముఖ్యంగా ఈ బాదం పూరికి మైదా, షుగర్, పంచదార, బియ్యంపిండితో తయారుచేస్తారు.

ఈ స్వీట్ రిసిపికి తయారుచేసే షుగర్ సిరఫ్ లో కుంకుమపువ్వు జోడించడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు, రుచికరంగా ఉంటుంది. ఇది ఒక్క ఈవెనింగ్ స్నాక్ గానే కాదు, స్పెషల్ గా ఏదైనా కార్యక్రమాలకు కూడా తయారుచేసుకోవచ్చు. మరి స్వీట్ అండ్ స్నాక్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

adam Puri Recipe-Evening Snack Recipe

కావల్సిన పదార్థాలు:
మైదా: 2-1/2cup
బాదం: 1/2cup(పేస్ట్)
చక్కెర: 3-1/2cup
బియ్యప్పిండి : 1-1 /4cup
పాలు : 100ml
కుంకుమ : చిటికెడు
ఏలకలు: 1tsp
నెయ్యి: 25 ml
ఆయిల్ : 1cup
నీరు : 1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా పిండిని కలుపుకోవాలి. అందుకు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, పాలు మరియు బాదం పేస్ట్ వేసి బాగా అన్ని కలగలిసే విధంగా కలుపుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగానీళ్ళు పోసి వేడి చేసి అందులో కొద్దిగా కుంకుమపువ్వు, పంచదార, మరియు యాలకులు వేయాలి. తర్వాత స్పూన్ సహాయంతో నిదానంగా కలిబెడుతూ షుగర్ సిరప్ ను తయారుచేసుకోవాలి.
3. ఎప్పుడైతే షుగర్ సిరఫ్ రెడీ అయ్యేలోపు, ముందుగా మృదువుగా కలిలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేయాలి, తర్వాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి.
4. పూరిలూ వత్తుకొనేప్పుడు, నెయ్యి రాసి మూడు మడతలు పెట్టి పూరిల్లా వత్తుకోవాలి.
5. ఇలా వత్తుకొన్న తర్వాత మీకు నచ్చిన ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని తయారుచేసుకోవాలి.
6. మొత్తం పిండిని ఇలా తయారుచేసుకొన్న తర్వాత, స్టై మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఒత్తుకొన్నిపూరిలను అందులో వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత వీటిని తీసి షుగర్ సిరఫ్ లో వేసి కనీసం 10నిముషాలు అలాగే ఉంచి, తర్వాత తీసి వెడల్పు ప్లేట్ లో ఉంచితే, సర్వ్ చేయడానికి స్వీట్ బాదాం పూరి రెడీ.

English summary

adam Puri Recipe-Evening Snack Recipe

The badam puri which is beautifully layered with a great taste of badam, milk, cardamom, ghee and sugar syrup can be indulged at any time of the day. Lord Ganesha who loves sweets will truly be happy if you prepare this soft and crispy sweet delicacy on his birthday.
Story first published: Friday, September 12, 2014, 18:08 [IST]
Desktop Bottom Promotion