Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మల్టీ గ్రైయిన్ ఫ్రూట్ నట్ బేక్

మల్టీ గ్రైయిన్ పిండి: 1cup
సోయాపిండి: 1cup
ఓట్స్: 1cup
క్యారెట్ తురుము: 1cup
యాపిల్ తురుము: 1cup
వెనీలా: 1tsp
తేనె: 2tbsp
బాదంపప్పు: 8-10
పిస్తా: 8-10
ఆక్రోట్: 8-10
గుడ్లు: 3
బేకింగ్ పౌడర్: 1tsp
పంచదార: 2cups
సోయానూనె: 1cup
నిమ్మరసం: 2tbsp
తయారు చేయు విధానం:
1. మొదటగా ఒక బౌల్ లో బౌల్ మల్టీ గ్రైయిన్ పిండి, సోయాపిండి, ఓట్స్, వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత మరొక బౌల్ ల్లో గుడ్లను పగుల గొట్టి, అందులో పంచదార, నిమ్మరసం, వేనీలా, తేనె, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు గుడ్డు మిశ్రమంలో మల్టీ గ్రైయిన్ పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత సోయా నూనె లేదా వెజిటేబుల్ ఆయిల్ తీసుకొని పెద్ద బౌల్ లేదా పాన్ లో వేసి కొద్దిగా హీట్ చేసి తర్వాత అందులో పైన సిద్దం చేసి పెట్టుకొన్ని మిశ్రమాన్ని అందులో పోసి సమంగా సర్థాలి.
5. తర్వాత క్యారెట్ తురుము, యాపిల్ తరుమూ కూడా దాని మీద పరిచి ఆపై బాదం, ఆక్రోట్, పిస్తా వంటి నట్స్ ను సర్థాలి.
6. చివరగా ఈ పాన్ ను మైక్రోవోవెన్ లో 350 ఎఫ్ హీట్ బేక్ చేయాలి. అంతే కొద్దిసేపటి తర్వాత బయటికు తీసి చల్లారినిచ్చి సర్వ్ చేయాలి. అంతే మల్టీ గ్రైయిన్ ఫ్రూట్ నట్ బేక్ రెడీ....



Click it and Unblock the Notifications