For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాల పోలీలు(పాల బొబ్బట్లు): ఉగాది స్పెషల్

|

అన్నిరోజులూ ఒక ఎత్తు, పండగ రోజు ఒక ఎత్తు. 'పండక్కు ఏం చేస్తున్నారు, ఏంచేశారు వంటి ప్రశ్నలు ఈ సందర్భంలో సర్వసాధారణం. అందునా ఇది ఉగాది. మరి ఎంచక్కని స్వీట్లతో ఉగాదిని ఉత్సాహభరితం, సంతోషభరితం చేసుకోవటం అభిలషణీయమే కదా. బొబ్బట్లు సంప్రదాయ పిండివంటే కానీ ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ శ్రమలేకుండా వైవిధ్యభరితంగా బొబ్బట్లను ఎలా తయారుచేసుకోవాలో బోల్డ్ స్కై మీకు వివరిస్తోంది.

పాల పోలీ ఒక ట్రెడిషనల్ స్వీట్ డిజర్ట్. ఇది చాలా రుచికరంగా ఉండటం చేత చాలా ఫేమస్ అయినటువంటి వంటకం. పాలపోలీను చిక్కట పాలు, పంచదారలో పూరిలను నానబెడుతారు. ఈ పాలపోలీలను వివిధ రకాలుగా వండుతారు. ఈ పాలపోలీలను తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ ఉగాది స్పెషల్ గా పాలపోలీలను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Paala Poli(Paala Bobbatlu)

పాల బొబ్బట్లు కావలసిన పదార్థాలు:

పాలు: 2ltrs
చక్కెర: 2cups
బాదంపప్పు: 15
జీడిపప్పు: 15
యాలకులు: 4
కుంకుమపువ్వు: కొంచెం
పోళీ చేసేందుకు కావలసినవి:
మైదాపిండి: 2cups
సోడా, ఉప్పు, నూనె: తగినంత

తయారుచేసే విధానం:

1. ముందుగా పాలను తక్కువ వేడిలో పెట్టి బాగా కాయాలి. బాదం, జీడిపప్పులను నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి లిక్విడ్‌గా చేసుకోవాలి.
2. పాలు బాగా సగానికి సగం తగ్గిన తర్వాత దాంట్లో చక్కెర, బాదం జీడిపప్పుల లిక్విడ్‌, యాలకుల పొడి అన్నీ వేసి కలపాలి.
3. తర్వాత వెడల్పైన పాత్రలో పోసి బాగా ఆరనీయాలి.
4. అంతలోపు మైదాపిండితో చిన్నిచిన్న పూరీలు చేసి పాలలో వేయాలి.
5. ఐదు నిమిషాల తర్వాత పాలలో ఊరిన పూరీలను తీసి ఒక ప్లేట్లో వేసి దానిపై కొంచెం చక్కెరపొడి, కుంకుమ పువ్వుతో అలంకరించి సర్వ్‌ చేయాలి.
అంతే చాలా రుచికరమైన బొబ్బట్లు ఇవి. విందుకు తగ్గ ఐటమ్‌ అనే చెప్పాలి.

English summary

Paala Poli(Paala Bobbatlu)

Milk Poli is a delicious and simple Indian sweet made with milk and flour. Layered pooris are fried and soaked in reduced sweetened milk. You can make it for any special occasions or for parties. This is an easy dessert for last minute plans. Paal Poori is a delicious dessert which, true to its name, is pooris soaked in sweetened, thickened milk and then garnished with roasted cashew nuts and almonds. Yum much?
Story first published: Saturday, March 29, 2014, 12:28 [IST]
Desktop Bottom Promotion