Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మిగిలిపోయిన అన్నంతో ఆలూ రైస్..మీ జన్మలో ఇలాంటి రుచి చూసి ఉండదు,ఎలా చేయాలో చూడండి
సాధారణంగా మన ఇళ్లల్లో అన్నం మిగిలిపోతే దానిని పులిహోరగానో లేదా టమాటో రైస్ గానే తయారుచేస్తుంటారు. మిగిలిపోయిన అన్నంతో చేసే వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే మిగిలిపోయిన అన్నంతో చేసే ఆలూ రైస్ మీరెప్పుడైనా తిన్నారా? అబ్బో అదిరిపోతుందంతే. ఉంటే మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు లేదంటే మామూలు అన్నంతో కూడా ఇది చేసుకోవచ్చు. దీనిని క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లో పెట్టుకోడానికి లేదా ఇంటికి ఎవరైనా సడెన్ గా అతిథులు వచ్చినప్పుడు చేయడానికి పర్ఫెక్ట్ వంటకం ఇది. మిగిలిపోయిన అన్నంతో ఆలూ రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆలూ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
-బంగాళదుంప
-అన్నం
-ఉల్లిపాయ
-టమాటో
-కారం
-జీలకర్ర పొడి
-కొత్తిమీర
-పుదీనా
-అల్లం
-పెరుగు
-నిమ్మ రసం
-ఉప్పు
-ఆయిల్
-కరివేపాకు
ఆలూ రైస్ తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 6 వెల్లుల్లి, అర ఇంచు అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న కొత్తిమీర కట్టని కాడలతో సహా వేయాలి,అందులోనే 1 చిన్న పుదీనా కట్ట, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, అర చెక్క నిమ్మరసం,రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చెయ్యండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బంగాళదుంపల చెక్కులు తీసి కట్ చేసి ముక్కలు వేసి లేత బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించాలి.
-తర్వాత అందులో 1 ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడనివ్వాలి. ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసి వేయించాలి.
-తర్వాత అందులో కట్ చేసిన 1 టమాటో ముక్కలు వేసి టమాటోలపైన స్కిన్ మెత్తబడే వరకు వేయించండి.
-టమాటోలు మగ్గుతున్న సమయంలోనే అందులో అర టీస్పూన్ కారం, అర టీస్పూన్ జీలకర్ర పొడి వేసి వేపండి.
-మసాలాలు బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ వేసి నీరు ఇగిరిపోయి చిక్కబడేంతవరకు కలుపుతూ వండండి.
-తర్వాత అందులో మిగిలిపోయిన అన్నం లేదా పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి కలపండి.
-మంటను పెద్దగా ఉంచి రైస్ ను కలుపుతూ ఉండండి. అంతే నిమిషాల్లోనే ఆలూ రైస్ రెడీ.
తెలంగాణ స్టైల్ బగారా బువ్వ..ప్లేటు కూడా నాకేసేంత రుచి,ఎలా చేసుకోవాలంటే
ఆలూ రైస్ ప్రయోజనాలుమిగిలిన అన్నంతో తయారుచేసే ఆలూ రైస్ రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉపయోగించే బంగాళాదుంపలు, బియ్యం రెండూ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, అలాగే కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. బంగాళాదుంపలలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. చల్లారిన అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది, ఇది ఒక రకమైన ఫైబర్, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా పిల్లలు మరియు పెద్దలు ఇద్దరికీ నచ్చే రుచిని కలిగి ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












