సోయా మష్రూమ్ పులావ్..నా సామి రంగా ఏమి టేస్ట్ గురూ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

సోయా మష్రూమ్ పులావ్ ఒక రుచికరమైన, పోషకమైన వంటకం. ఇది మీల్ మేకర్, పుట్టగొడుగుల కలయికతో తయారుచేయబడుతుంది. సుగంధ ద్రవ్యాలు, కూరగాయలతో కలిపి వండిన బాస్మతి బియ్యం దీనికి ప్రత్యేకమైన రుచినిస్తాయి. ఈ పులావ్ తేలికగా జీర్ణమవుతుంది,వివిధ పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సోయా మష్రూమ్ పులావ్ ని మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

-బాస్మతి బియ్యం - 1 కప్పు
-సోయా చంక్స్ (మీల్ మేకర్) - 1/2 కప్పు
-పుట్టగొడుగులు - 1 కప్పు
-ఉల్లిపాయ- 1 పెద్దది
-టొమాటో-1
-పచ్చిమిర్చి- 2-3
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
-నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 1 టీ స్పూన్
-షాజీరా - 1/2 టీ స్పూన్
-లవంగాలు - 3-4
-యాలకులు - 2-3
-దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
-బిర్యానీ ఆకు - 1
-పసుపు పొడి - 1/4 టీ స్పూన్
-ధనియాల పొడి - 1 టీ స్పూన్
-గరం మసాలా - 1/2 టీ స్పూన్
-ఉప్పు - సరిపడా
-కొత్తిమీర తరుగు -కొద్దిగా
-నీరు - 2 కప్పులు

super tasty soya mushroom pulao recipe in telugu

తయారీ విధానం

-బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ని వేడి నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత వాటిని మెల్లగా పిండి అదనపు నీటిని తీసివేయండి.

-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి అడుగు కలిగిన ఒక గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్‌ లో నూనె లేదా నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క,బిర్యానీ ఆకు వేసి వేయించాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి.

-తర్వాత అందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. తర్వాత ఇందులో పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి.

-ఇప్పుడు పిండిన సోయా చంక్స్, పుట్టగొడుగులు వేసి 2-3 నిమిషాలు వేయించండి, మసాలాలు బాగా పట్టేలా చూడండి.

తమిళనాడు స్పెషల్ దిండిగల్ చికెన్ బిర్యానీ..మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

-తర్వాత అందులో నానబెట్టిన బియ్యం నుండి నీటిని తీసివేసి గిన్నెలో వేయండి. బియ్యంను మెల్లగా మసాలాలతో కలిపి 2 కప్పుల నీరు పోయండి. సాధారణంగా 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు సరిపోతుంది. ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి.

-నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు, బియ్యం మెత్తగా ఉడికే వరకు తక్కువ మంట మీద ఉడికించండి. ప్రెషర్ కుక్కర్‌ లో వండితే మీడియం మంట మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీయండి.

-పులావ్ ఉడికిన తర్వాత వెంటనే కదపకుండా 5-10 నిమిషాలు అలాగే ఉంచితే బియ్యం పొడిపొడిగా వస్తుంది. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయండి అంతే సోయా మష్రూమ్ పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, May 16, 2025, 17:11 [IST]
Desktop Bottom Promotion