నవరాత్రి స్పెషల్-బాదూషా తయారీ విధానం (వీడియోతో)

Posted By: Staff
Subscribe to Boldsky

నవరాత్రులంటే మనందరికీ ఇష్టమే, ఈపాటికే ఏర్పాట్లు మొదలయిపోయుంటాయి కదా.నవరాత్రుల ఏర్పాట్లంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుర్గా మాత విగ్రహాల తయారీ మాత్రమే కాదు, రక రకాల పిండివంటల తయారీ కూడా.అందుకే సులభంగా మీరు ఈ నవరాత్రుల్లో తయారు చేసుకోవడానికి బాదూషా తయారీ ఇచ్చాము.బాదూషా తయారీ అంటే చాలా కష్టమని మనలో చాలామంది భావిస్తారు, కానీ చాలా సులభం తెలుసా??

క్రింద మేము ఇచ్చిన వీడియో లో బాదూషా ఎలా చెయ్యాలో వివరంగా వివరించబడింది.ఇంక ఆలశ్యమెందుకు, నోరూరించే బాదూషా చేసేయ్యండి మరి.

బాదూషా తయారీకి ముందు అన్నీ సిద్ధం చేసుకోవడానికి పట్టే సమయం:20 నిమిషాలు

బాదూషా తయారీకి పట్టే సమయం:30 నిమిషాలు

ఎంత మందికి సరిపోతుంది:4

కావాల్సిన పదార్ధాలు:

  • మైదా-ఒక కప్పు
  • నెయ్యి-రెండు టీస్పూన్లు
  • బేకింగ్ సోడా-చిటికెడు
  • పెరుగు/యోగర్ట్-అర కప్పు
  • పంచదార- ఒక కప్పు
  • నీళ్ళు-ఒక కప్పు
  • ఏలకుల పొడి-చిటికెడు
  • నూనె-వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

1.ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు/యోగర్ట్,నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

Special Badusha Sweet Recipe For Navratri

2.ఒక వెడల్పాటి గిన్నెలో మైదా వేసి దానిలో మెల్లిగా పెరుగు వేస్తూ చపాతీ పిండిలా కలపాలి.

Special Badusha Sweet Recipe For Navratri

3.ఈ కలిపిన పిండిని పది నిమిషాలు నాననివ్వాలి.

Special Badusha Sweet Recipe For Navratri

4.గిన్నెలో నీళ్ళు తీసుకుని దానిలో పంచదార వేసి పంచదార పాకం వచ్చేంతవరకూ మరిగించాలి.పాకం తయారీలో స్టౌ మంట సన్నగా ఉండాలి.పల్చటి సిరప్ లా అయ్యేవరకూ నీళ్ళూ పంచదార మీశ్రమాన్ని స్టౌ మీద ఉంచాలి.

Special Badusha Sweet Recipe For Navratri
Special Badusha Sweet Recipe For Navratri

6.పాకం వచ్చాకా స్టౌ కట్టేసి ఏలకుల పొడి కలపాలి.

Special Badusha Sweet Recipe For Navratri

7.కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాటీస్ లాగ చెయ్యాలి.కావాలనుకుంటే ప్యాటీల చివర్లు లోపలకి మడిచి అందంగా కూడా తయారుచేసుకోవచ్చు.

Special Badusha Sweet Recipe For Navratri

8.మూకుడులో నూనె వేడి చేసి,ఈ ప్యాటీలని మెల్లిగా నూనెలో వెయ్యాలి.

Special Badusha Sweet Recipe For Navratri

9.సన్నని సెగ మీద బాదూషా పూర్తిగా వేగేవరకూ వేయించుకోవాలి.

Special Badusha Sweet Recipe For Navratri

10.బ్రౌన్ కలర్ వచ్చాకా బాదూషా ని నూనెలో నుండి తీసి 2-3 నిమిషాలు పక్కన ఉంచాలి.

Special Badusha Sweet Recipe For Navratri

11.పక్కన పెట్టుకున్న బాదుషాలని పంచదార పాకంలో వేసి రాత్రంతా నాననివ్వాలి.

Special Badusha Sweet Recipe For Navratri

12.మరునాడు డ్రై ఫ్రూట్స్ తో అలకరించుకుని ఈ నవరాత్రుల్లో నోరూరించే బాదుషాని ఆస్వాదించండి.

Special Badusha Sweet Recipe For Navratri

English summary

Special Badusha Sweet Recipe For Navratri: Video

The preparation for Navratri festival is something that we all enjoy doing and we're sure it's already begun too. Right from cleaning our house to preparing the Durga idols and, not to forget, the list of sweet recipes that we should prepare for Navratri.